కీరా జ్యూస్ లో దాగున్న అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్..!!
దోసకాయలో విటమిన్ సి, కేతోపాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే.. వీటిని డైట్ లో చేర్చుకోవాలి అని చెబుతుంటారు. కీరాలో కెరోటిన్, మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. కీరా మాత్రమే కాదు.. దాని తొక్కలో కూడా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాన్ట్సిపేషన్ సమస్యతో బాధపడేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం. దోసకాయను సలాడ్స్, వంటకాల్లో ఉపయోగిస్తారు. ప్రతి రోజూ వీటిని డైట్ లో చేర్చుకుంటూ ఉంటాం. అయితే.. కీరా.. అనేక చర్మ, జుట్టు సమస్యలను నివారిస్తుందని తెలుసా ? నిజమే.. జీర్ణక్రియ వంటి సమస్యలే కాదు.. జుట్టు, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను నివారిస్తుంది. మరి కీరా జ్యూస్ లో దాగున్న అమేజింగ్ బ్యూటీ బెన్ఫిట్స్, కీరా జ్యూస్ ని అందానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. అలాగే.. ఇది ఖర్చు తక్కువ.. ఫలితాలు ఎక్కువ అందిస్తుంది.. తెల్లగా మారడానికి కీరాను బ్లీచింగ్ లా ఉపయోగించడం వల్ల.. చర్మం తెల్లగా మారడానికి సహాయపడుతుంది. దీనికోసం కీరా జ్యూస్ లేదా కీరా ముక్క తీసుకుని.. ముఖంపై రుద్దుకోవచ్చు. ఇది చాలా మైల్డ్ గా ఉంటుంది కాబట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు. మొటిమలు, మచ్చలు మొటిమల వల్ల ఏర్...