Posts

జుట్టు నెరవకుండా చేసే ఆహార పదార్థాలు

Image
వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలంలో, చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ ఆహార పదార్థాలను మీ ప్రణాళికలో కలుపుకొంటే, రంగు వేసుకోవలసిన అవసరమే ఉండదు. 1 ఆహార ఎంపికతో తెల్ల వెంట్రుకలకు దూరం ఆరోగ్యకరమైన ఆహార సేకరణ ద్వారా జుట్టు తెల్లబడటాన్ని నివారించవచ్చు అని చెప్తే మీరు నమ్ముతారా? అవును నిజం! కానీ ఇది ఒక సిద్ధాంతపరమైనది.విటమిన్ మరియు మినరల్ వంటి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు తినటం వలన మీరు యవ్వనంగా కనపడతారు మరియు ఇవి వృద్దాప్యాన్ని ఆలస్యపరుస్తాయి. 2 పచ్చని ఆకుకూరలు పచ్చని ఆకుకూరలు తలపై చర్మం పునరుద్దపరిచే విటమిన్ 'B' లను కలిగి ఉంటాయి. సాధారణంగా, ఎర్రరక్తకణాల ఉత్పత్తికి మరియు వెంట్రుక యొక్క అన్ని భాగాలకు రక్తం పంపిణి చేయటానికి తలపై చర్మానికి విటమిన్ 'B-6' మరియు విటమిన్ 'B-12' లు అవసరం. మన జుట్టు నల్లగా ఉండటానికి లేదా సహజ రంగులో ఉండటానికి విటమిన్ 'B-2' పై ఆధారపడి ఉంటుంది. 3 సూపర్ సాల్మన్ ఎప్పటికైనా ఆరోగ్యక ఆహార పట్టికలో నిలిచే ఆహార పదార...

ముడతలను తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

Image
గుడ్డులోని తెల్ల సొన ఆస్ట్రిజెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మ రంధ్రాల మూసివేస్తుంది. తేనె, ముడతలను తొలగించే కారకాలను & యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. అవకాడోలో ఉండే సహజ విటమిన్ 'A', 'B', & 'E'లు ముడతలను తొలగిస్తాయి. రోజు రాత్రి ఆముదం నూనెను వాడటం వలన వీటిని తగ్గించవచ్చు. వృద్దాప్యానికి చేరువయ్యే కొలది, శరీర చర్మంలో మార్పులు కలగటం మరియు ముడతలు ఏర్పడటం కూడా సాధారణమే అని చెప్పవచ్చు. ముడతల వలన చర్మం వేలాడుతూ కనబడుతుంది, ఇది కేవలం ముఖ చర్మంపై మాత్రమే కాకుండా, పూర్తి శరీరం పై ముడతలు ఏర్పడి చూడటానికి ఇబ్బందులను కలుగచేస్తుంది. కానీ, ముడతలకు కారణం కేవలం వయసు మాత్రమే కాకుండా, అనారోగ్యకర ఆహార ప్రణాళిక, ఒత్తిడి మరియు వేగంగా బరువులో తగ్గుదల వలన కూడా చర్మంపై ముడతలు కలుగుతాయి. కొన్ని రకాలు ఇంట్లో ఉండే ఔషదాలు వయసు మీరిన కొలది చర్మంపై కలిగే మార్పులను, ముడతలను మరియు చర్మం వేలాడే స్థితిగతులను తగ్గించి వేస్తాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి. గుడ్డు యొక్క తెల్ల సోన మాస్క్ ఆస్ట్రిజెంట్ (రక్తస్రావ నివారిణి) గుణాలను కలిగి ఉన్న, గుడ్డ...

మహిళలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే చిట్కాలు

Image
ఆరోగ్యకమైనవి తినటం వలన ఒత్తిడి తగ్గి, వెంట్రుకలు పెరుగుతాయి. ఆవాల నూనె, ఉసిరి, మెంతి విత్తనాలతో చేసిన మిశ్రమం జుట్టుకు మంచివి. క్రమంగా జుట్టు కత్తిరించని ఎడల వెంట్రుకల పెరుగుదల నిలిచిపోతుంది. స్టైలింగ్ ఉత్పత్తుల, కలర్ లలో ఉండే రసాయనాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. TV లలో వచ్చే ప్రకటనలలో చూపించే విధంగా పొడవైన ఆకర్షణీయమైన జుట్టును పొందుటకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలం అయ్యారా? మరేం ఫరవాలేదు. ఈ వ్యాసం మీ కోసమే... మార్కెట్లో జుట్టుకు బహిర్గతంగా అప్లై చేసేమందులు, జెల్ లు, టానిక్ లు మరియు ఇతరేతర ఉత్పత్తులు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటికి మన జేబు ఖాళీ అవటమే కాకుండా, నాణ్యమైన జుట్టు అనారోగ్యం భారినపడుతుంది. వీటికి బదులుగా కొన్ని సులువైన సూచనలు పాటిస్తే మహిళల జుట్టు ఆరోగ్యం చాలా మెరుగుపడి, పొవవైన జుట్టు మీ సొంతం అవుతుంది. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. ఆరోగ్యకరమైనవి తింటూ అనుకూలంగా ఆలోచించండి జుట్టు రాలటం తగ్గినపుడు మాత్రమే మన జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. మనలో చాలా మంది ఒత్తిడితో కూడిన జీవనశైలి అనుసరించటం వలన త్వరగా బట్టతల కలుగుతుంది. కావున రోజు ఆరోగ్యక...

మీ స్కాల్ప్ పొడిగా ఉందా? ఈ వ్యాసం మీకోసమే...

Image
జింక్, విటమిన్ 'C' తలపై చర్మన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. వేడిగా ఉండే నూనెతో తలపై చర్మానికి మసాజ్ చేయండి. గోకటం వలన తలపై చర్మ పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. సూర్యరశ్మికి బహిర్గతం అవకుండా జాగ్రత్త పడండి. పొడిగా మరియు దురదలకు గురిచేసే తలపై చర్మం లేదా స్కాల్ప్ వలన కలిగే ఇబ్బంది, చికాకు మరోటి ఉండదు. మన శరీరంలో పట్టించుకోకుండా ఉండే భాగం తలపై చర్మం మరియు స్కాల్ప్ లో సమస్యలు కలిగేంత వరకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోము. కానీ ఇక్కడ తెలిపిన కొన్ని చిట్కాల ద్వారా పొడిగా మరియు దురదలను కలిగించే తలపై చర్మం నుండి ఉపశమనం పొందవచ్చు. కీలక పోషకాలు జింక్, విటమిన్ 'C' వంటి పోషకాలు ఈ సమస్య నుండి త్వరగా కోలుకోటానికి సహాయపడతాయి. వైద్యుడిని లేదా ట్రైకాజిస్ట్ ను కలిసి పొడిగా ఉండే తలపై చర్మాన్ని ఆరోగ్యంగా మారటానికి ఈ పోషకాలు చాలా? లేదా ఇతర పోషకాలు కూడా అవసరమో ఒకసారి చర్చించండి. తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ 'C' ని సహజంగా సిట్రస్ జాతికి చెందిన పండ్ల నుండి పొందవచ్చు మరియు జింక్ ను పాల ఉత్పత్తులు, నట్స్ నుండి పొందవచ్చు. శుభ్రంగా ఉంచుకోండి పొడిగా, దురదలుగా ...

పుదీనా వలన అందానికి కలిగే ప్రయోజనాలు

Image
వంటలలో మంచి రుచిని ఇచ్చే పుదీనా వలన అందం కూడా పెరుగుతుంది. ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ ఇది చదవండి. 1 పుదీనా ఘాటైన సువాసన కలిగి ఉండే పుదీనా మాయిశ్చరైజర్, క్లీనర్ మరియు లోషన్ రూపంలో కూడా దొరుకుంతుంది. ముఖ్యంగా పుదీనా మరియు దాని సారాన్ని అందాన్ని మెరుగుపరిచే వివిధ రకాల ఉత్పత్తులలో వాడుతున్నారు. మన అందాన్ని మెరుగుపరచటంలో పుదీనా పాత్ర గురించి ఇక్కడ తెలుపబడింది. 2 మెరిసే చర్మం పుదీనా నూనెను వాడటం వలన మెరుగైన చర్మం పొందవచ్చు. చర్మంపై ఉన్న నిర్జీవ కణాలను తొలగించి, చర్మం ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది. మెరిసే చర్మాన్ని పొందాలి అనుకుంటున్నారా? అయితే కొన్ని చుక్కల పుదీనా నూనెను నేరుగా చర్మానికి వాడి తరువాత మార్పులను గమనించండి. 3 జుట్టు పెరుగుదల పుదీనా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మీ జుట్టు కోసం రోజు వాడే నూనెకు కొన్ని చుక్కల పుదీనా నూనె కూడా వాడి వెంట్రుకలకు అప్లై చేయటం వలన రక్త ప్రసరణ మెరుగుపడి, జుట్టు పెరుగుదల కూడా బాగుటుంది. 4 పొడి జుట్టు మీ జుట్టు పొడిగా ఉంటుందా? అయితే పుదీనా నూనె మీకు తప్పక సహాయపడుతుంది. దీని కోసం గానూ, రోజు వాడే కొబ్బరి నూనెకు క...

దానిమ్మ వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు

Image
దానిమ్మ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దానిమ్మ రసం వృద్దాప్య, సూర్యకాంతి వలన ఏర్పడే చ చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దానిమ్మ విత్తనాలు చర్మంపై తెగుళ్ళను & మరకలను తొలగిస్తాయి. దానిమ్మ పొడిచర్మ సమస్యలను, దురదలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దానిమ్మ, వైద్య గుణాలను కలిగి ఉన్నందు వలన, నిజానికి క్రీస్తూ పూర్వం 1552 కాలం నుండి దానిమ్మను వాడుతున్నారు. మొదటగా, ఈజిప్షియన్ పాపిరస్ దానిమ్మను వైద్యం కోసం వాడి, రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, గ్రీకు వైద్యులు ఆర్థరైటిస్, జీర్ణాశయ సమస్యలను, రక్త ప్రసరణ సమస్యలను మరియు ఇన్ఫెక్షన్ లను తగ్గించుటకు వాడి సఫలం చెందారు. చర్మ సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందు వలన సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడుతున్నారు.  రోజు దానిమ్మ పండును తినటం ద్వారా వీటి వలన కలిగే ప్రయోజనాలు పొందవచ్చు, అంతేకాకుండా, చర్మాన్ని సంరక్షించే గుణాలను కలిగి ఉన్నందు వలన నేరుగా చర్మానికి ఆపాదించవచ్చు. చర్మానికి, దానిమ్మ వాడటానికి గల కారణాల గురించి కింద వివరించబడింది. మొటిమలు తగ్గించుటకు సాధారణంగా, శరీరంలో హార్మోన...

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

Image
జుట్టు ఆరోగ్యానికి, పునరుత్పత్తికి విటమిన్ 'A' తప్పక అవసరం. ప్రోటీన్ జుట్టు వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. విటమిన్ 'E' రక్తప్రసరణను పెంచి, జుట్టు పునరుత్పత్తిని మెరుగుపరుస్తుంది. కాల్షియం ఎముకలు మాత్రమే కాకుండా, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. స్త్రీలలో జుట్టు రాలటం అనేది నిరాశకు గురి చేస్తుంది. స్త్రీలలో జుట్టు రాలటం అనేది శిశు జననం లేదా అనీమియా (రక్తహీనత) వంటి కారణాల వలన కలుగుతుంది. ముఖ్యంగా అనారోగ్యం వలన స్త్రీలలో జుట్టు రాలటం జరుగుతుంది. కానీ, కొన్ని విటమిన్ లను తీసుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, అధికంగా విటమిన్ సంబంధిత మాత్రల సేకరణ వలన కూడా జుట్టు రాలటం అధికం అవుతుంది. కావున, జుట్టు రాలుటను తగ్గించుకోటానికి గానూ, వైద్యుడిని సంప్రదించి తగిన తగిన స్థాయిలో విటమిన్ లను మరియు ఉపభాగాలను తీసుకోండి. అధిక మొత్తంలో విటమిన్ సేకరణ కూడా అనారోగ్యకరమే విటమిన్ 'A' జుట్టు ఆరోగ్యం మెరుగుపడటానికి మరియు వెంట్రుకలు పునరుత్పత్తిలో విటమిన్ 'A' ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్యారెట్, పాలు...