వేసవిలో ముఖంలో చెమటలు తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్..!
వేసవి ఎండలు ఒకరకంగా ఇబ్బంది కలిగిస్తే.. చెమటలు మరో రకంగా చీకాకు ఇబ్బంది కలిగిస్తాయి. అరచేతుల్లో చెమటలు.... కాళ్లలో చెమటలు, ముఖంలో చెమటలు..ఇలా బాడీ మొత్తం చెమటలతో ఇబ్బంది..అసౌకర్యం. ముఖ్యంగా ఎన్ని సార్లు స్నానం చేసినా..ముఖం శుభ్రం చేసుకున్నాముఖంలో ఫ్రెష్ నెస్ కనబడదు. వేసవిలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఇది. వేసవిలో డే మరియు నైట్ టైమ్ చెమటలు పట్టడం సహజం. అయితే ముఖంలో చెమటలు పడితే ఇబ్బంది మాత్రమే కాదు, హ్యాండిల్ చేయడానికి కూడా కష్టమే. ఇటువంటి సమయంలో చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ చెమటలు పట్టడం వల్ల చర్మం జిడ్డుగా, ఆయిలీగా కనబడుతుంది. ఎంత మేకప్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. వేసవిలో చెమటలు తగ్గించుకోవడం అంత సులభం కాదు . అయితే ఇంట్లో ఉండే కొన్ని హోం రెమెడీస్ తో ఈ సమస్యను నివారించుకోవచ్చు. అలాగే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కూడా ఫేషియల్ స్వెట్టింగ్ ను దూరం చేసుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ చిట్కాలను డైలీ స్కిన్ కేర్ లో ఉపయోగించడం కూడా చాలా మంచిది. వీటిని రెగ్యులర్ గా కొద్దిరోజులు ఉపయోగిస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది . మార్పు కనబడుతుంది . వేసవ...