Posts

Showing posts from March, 2017

పెరుగు, పసుపు, బీట్‌రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

Image
పెరుగు, పసుపు, బీట్‌రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే? బీట్‌రూట్‌లో సౌందర్యానికి వన్నె తెచ్చే ఎన్నో గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ గుజ్జులో నాలుగు చుక్కల బాదం నూనె, చెంచా ఆలివ్‌ నూనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే అరకప్పు పెరుగులో చిటికెడు పసుపూ, కొద్దిగా బీట్‌రూట్‌ గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం కాంతిమంతమవుతుంది.  బీట్‌రూట్‌ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలూ దూరమవుతాయి. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.  బీట్‌రూట్‌ రసం, కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలను శుభ్రం చేస్తుంది. అదే బీట్‌రూట్‌ రసంలో నిమ్మరసం కలిపి రాసుకుంటే పిగ్మెంటేషన్‌ సమస్య దూరమవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.

పాదాలకు పెడిక్యూర్ ఇలా చేసుకోండి... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో?

Image
పాదాలకు పెడిక్యూర్ ఇలా చేసుకోండి... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో? పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. స్నానం చేస్తున్నప్పుడు పాదాలను శుభ్రంగా వాష్ చేసుకోండి. కాలి గోళ్లను కత్తిరించుకోవాలి. వారానికోసారి పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్‌ క్రిము లేదా రెండు చెంచా ఆలివ్‌ ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిన్‌ బాగా కలిపి చేతులకు, పాదాలకు రాసుకోవాలి.  15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. ఈ నీళ్లలోనే పాదాలను ఉంచి.. ప్యూమిక్‌స్టోన్‌తో మడమల మీద ఏర్పడిన పగుళ్ళపై మూడు-నాలుగు నిమిషాల పాటు రుద్దండి. దీనివలన పాదాలపై పేరుకున్న మురికి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి.  రోజూ రాత్రి పూట హ్యాండ్‌క్రీమ్‌ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి. కాలి మడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే రాత్రి పూట పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సు ధరించి నిద్రించడం మంచిది. 

కంటి కింద నల్లటి వలయాలకు.. తేనె, పాలు, ఓట్స్ పేస్టును?

Image
కంటి కింద నల్లటి వలయాలకు.. తేనె, పాలు, ఓట్స్ పేస్టును? కళ్లజోడు ధరిస్తున్నారా? తద్వారా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయా? అయితే ఇలా చేయండి. కీరదోసను గుజ్జుగా చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. అంతేగాకుండా కీరదోస రసంలో టమోటా, బంగాళాదుంపల రసం కలిపి ముక్కుపై పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసంలో రెండు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.  ఇకపోతే.. తేనెలో కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం తాజాగా మారుతుంది. రాత్రిళ్లు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 

చర్మ సౌందర్యం కోసం న్యాచురల్ టిప్స్

Image
చర్మ సౌందర్యం కోసం న్యాచురల్ టిప్స్ ** చర్మ సౌందర్యం కోసం ఓ చెంచా జొన్న పిండిలో ఓ చెంచా తేనె, ఓ చెంచా పెరుగు మరియు నిమ్మకాయ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూయండి. ఈ మిశ్రమం బాగా ఎండిపోయిన తర్వాత పచ్చి పాలతో ముఖాన్ని కడుక్కోండి.  ** చర్మానికి టోనింగ్ కొరకు రోజ్ వాటర్‌లో దూది ముంచి ముఖంపై పూయండి. దీంతో ముఖ చర్మం నునుపు తేలుతుంది. రోజ్ వాటర్ ముఖానికి పూసిన తర్వాత దూది సహాయంతో క్లీజింగ్ మిల్క్ పూయండి. క్లీజింగ్ మిల్క్‌ పూయడంతో మీ చర్మం నిగారింపునిస్తుంది.

ఎండల నుండి చర్మ నల్లగా మారకుండా..రక్షణ కల్పించే వాటర్ మెలోన్

Image
పుచ్చకాయ వల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చుననే విషయం మీకు తెలుసా..?పుచ్చకాయ వల్ల అందం, ఆరోగ్య లాభాలు రెండూ కలుగుతాయి. పుచ్చకాయలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసినంత దాని సౌందర్య ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియవు. వేసవికాలంలో విరివిగా లభించే పళ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. వేసవి వేడిమికి చెక్‌ పెడుతూ శరీరానికి చల్లదనాన్ని చేకూర్చే ఈ పండు వల్ల కేవలం ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాదు...సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి, ఆ ప్రయోజనాలు ఏంటి? వాటిని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ టిప్స్‌ తెలుసుకోవాలి. పుచ్చకాయలోని 92 శాతం నీరు ఉంటుంది. ఇది తినడం ద్వారా వేసవిలో శరీరం నుంచి పోయే నీటిశాతాన్ని తిరిగి పునరుద్దరించుకోవచ్చు. ఫలితంగా చర్మం తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే గింజల వల్ల కూడా చాలా సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయి. చర్మాన్ని సున్నితంగా చేసి, మాయిశ్చరైజ్‌ చేయడంలో వీటిని మించినవి లేవంటే అతిశయోక్తి కాదు. పుచ్చకాయ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు... టోనర్‌గా పనిచేస్తుంది: వాటర్‌ మెలోన్‌ చర్మానికి సహజసిద్దమైన టోనర్‌గా పనిచేస్తుంది. ఒక చిన్న పు

మళ్లీమళ్లీ వేడి చేస్తే ఏమవుతుంది?

Image
మళ్లీమళ్లీ వేడి చేస్తే ఏమవుతుంది? ఉదయంపూట అల్పాహారం అవసరంలేదు.. చిరుతిళ్లు నోరూరించేలా ఉండాలి... అని కొందరు ఆలోచిస్తే రోజూ వ్యాయామం అవసరంలేదు.. పచ్చళ్లు లేనిదే ముద్ద దిగదు.. అని చెబుతుంటారు మరికొందరు. వాటిల్లో వాస్తవాలు ఏంటీ.. అసలు అన్నివయసుల మహిళలూ ఆహారపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవిగో అలాంటి సందేహాలకి సమాధానాలే ఇవన్నీ!  ఉదయం అల్పాహారం తీసుకోకపోతే ఏమవుతుంది? పొద్దున్నే నిద్రలేచిన తరవాత గంటా, గంటన్నర లోపు ఏదో ఒకటి తినాలి. చాలామంది పనులన్నీ పూర్తయ్యాకే ఏదో ఒకటి తినాలనుకుంటారు. వంటా, పిల్లల్నీ తయారు చేసి.. పూజతో సహా మిగిలిన పనులు పూర్తి చేసుకునేసరికి నీరసం వచ్చేస్తుంది. దాంతో ఏకంగా భోజనం కానిచ్చేస్తారు. దానివల్ల ఎక్కువ తినాల్సి వస్తుంది. ఇలా అతిగా తినడం ఆహారం కొవ్వుగా మారి బరువు పెరిగిపోతారు. ఎలాంటి అల్పాహారం: ఉదయంపూట పనులు ఉంటాయి కాబట్టి పిండిపదార్థాలూ, ఆరోగ్యకరమైన కొవ్వులు లభించేలా చూసుకోవాలి. అంటే పాలూ, పాల పదార్థాలూ, ఇడ్లీ, దోశా, పెసరట్టూ, ఉప్మా, బ్రెడ్‌ ఆమ్లెట్‌ వంటివి ఎంచుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. మాంసకృత్తులూ, క్యాల్షియం, ఫోలిక్‌ య

Special Feature లైంగిక ఆరోగ్యం

Image
మనం అన్నింటికీ ముందే సంసిద్ధమవుతుంటాం!  పెళ్లికి ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటాం.  కాపురానికి ముందే ఇల్లు చూసుకుంటాం.  పిల్లలకు ముందే బడిలో సీటు సిద్ధం చేసుకుంటాం.  విరమణకు ముందే డబ్బు దాచుకుంటాం.  ఇలా అన్నింటికీ ముందు నుంచే సిద్ధమవుతుండే మనం.. జీవితంలో అత్యంత కీలక అంశమైన లైంగిక జీవనం విషయంలోనూ ఇంతే సంసిద్ధత ప్రదర్శిస్తున్నామా?  లేనే లేదంటున్నారు నిపుణులు!  శృంగారం విషయంలో మనం ప్రతి దశలోనూ వెనకబడే ఉంటున్నాం! శృంగారాన్ని చీకటి వ్యవహారంగానే చూస్తున్నాం. చాటుమాటు తంతుగానే దాచేస్తున్నాం. అభంశుభం తెలీని పసిబిడ్డల వయసు నుంచీ ఛీచ్ఛీ అంటున్నాం. నవయవ్వన ఘడియల్లో ఇవ్వాల్సిన విజ్ఞానం ఇవ్వటం లేదు. దాంపత్యంలోనూ దాగుడుమూతలే ఆడుతున్నాం. ఇక మలివయసులో ఇదేం ముచ్చటని ఈసడించేస్తున్నాం. ప్రతి దశలోనూ మన ధోరణి అశాస్త్రీయంగానే సాగుతోంది. శాస్త్రీయమైన అవగాహనతో.. చక్కటి శృంగార జీవితాన్ని బాధ్యతాయుతంగా ఆస్వాదించేలా చెయ్యటం ఒక్కటే దీనికి సరైన విరుగుడు. అందుకే దీనికి సంబంధించిన వివరాలను సరళంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ! మనలో చాలామంది గుండె జబ్బు వచ్చినప్పుడే గుండె గురించి ఎక్కువగా ఆలోచిస్త

మెడ నొప్పా.. Just click

Image
మెడ నొప్పా.. బ్యాగు సరిగ్గా వేసుకోండి రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే చిన్నపాటి పొరపాట్లే మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఇంతకీ అలాంటి పొరపాట్లేంటో చూద్దాం.. * మనలో చాలామంది స్మార్ట్‌ఫోను లేకుండా ఐదునిమిషాలు కూడా ఉండలేరు. అయితే దాన్ని వాడుతున్నంత సేపూ తలదించుకునే ఉంటాం. దాంతో మెడా, భుజాలూ నొప్పి పుడతాయి. అలా కాకుండా ఫోనుని మన కంటికి సమాంతరంగా ఉంచుకుని చూస్తే ఏ నొప్పులూ బాధించవు. *  కాలేజీకెళ్లే అమ్మాయిలూ, ఉద్యోగినులూ బ్యాక్‌ప్యాక్స్‌ని ఒక భుజానికే వేసుకుంటారు. దాంతో ఆ భాగం ఒక్క భుజంపైనే పడుతుంది. క్రమంగా భుజం, మెడా, వెన్ను నొప్పులు మొదలవుతాయి. అందుకే దాన్ని రెండు భుజాలకీ వేసుకోవడంతోపాటూ తప్పనిసరిగా ఆ బ్యాగు పట్టీలను బిగుతుగా పెట్టుకోవాలి. బ్యాగు జారిపోతున్నట్టుగా కాకుండా పైకి ఉండాలి. అప్పుడే సమస్యలు ఎదురుకావు. *  కొంతమంది దిండుని సరిగా ఎంపిక చేసుకోరు. మరీ పల్చగా ఉండేవాటిని వాడతారు లేదంటే బాగా ఎత్తైన దిండ్లని ఎంచుకుంటారు. దీనివల్ల వెన్నెముకకి ఇబ్బంది. దీర్ఘకాలం ఇలానే పడుకుంటే వెన్నెముక, మెడపై భారం పడుతుందని మరవకూడదు. *  వెల్లకిలా, బోర్లా ఈ రెండూ నిద్రపోవడానికి సరైన విధా

ముల్తానీ పూతతో..ముత్యంలా!

Image
ముల్తానీ పూతతో..ముత్యంలా! ముల్తానీమట్టి ముఖాన్ని సహజంగా మెరిపించడమే కాదు.. కొన్ని రకాల చర్మ సమస్యల్నీ సులువుగా నివారిస్తుంది. మరి దాన్ని ఎలా వాడాలంటే.. రెండు చెంచాల ముల్తానీమట్టికి రెండు చెంచాల గులాబీనీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఈ పూత ముఖంపై అధికంగా పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది. * నాలుగు చెంచాల ముల్తానీమట్టిలో చెంచా పాలు, రెండు మూడు బాదం గింజల ముద్ద వేసి మెత్తగా చేయాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి ఆరనిచ్చి కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * రెండు చెంచాల టొమాటో గుజ్జూ, చెంచా చొప్పున ముల్తానీ మట్టీ, గంధం పొడీ, పసుపూ తీసుకుని అన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రెండురోజులకోసారి చేస్తుంటే చర్మంపై పేరుకున్న మచ్చలు పోతాయి. * మూడు చెంచాల ముల్తానీ మట్టికి చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, అరచెంచా పాలు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. వారాన

అపోహలు వదిలేద్దాం..

Image
అపోహలు వదిలేద్దాం.. వ్యాయామం చేయాలి... ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే చాలామంది మహిళలకి రకరకాల అపోహలు ఉంటాయి. అసలు వాటిల్లో వాస్తవాలేంటో చూద్దాం. అపోహ: వ్యాయామం చేస్తూ.. ఉన్నట్టుండి ఆపేస్తే లావైపోతామా?  వాస్తవం: నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేస్తున్నప్పుడు వారి సలహామేరకు ఆహారం తీసుకోవడం జరుగుతుంది. వ్యాయామం ఆపేసినప్పుడు అంతమొత్తంలో ఆహారం తీసుకోకూడదు. అలా కాకుండా దాన్ని ఆపేసి..శరీరం కోరుకున్నదానికంటే ఎక్కువ ఆహారం తీసుకుంటే కచ్చితంగా బరువు పెరుగుతారు. కాబట్టి ఎలాంటి సాధనలు చేయనప్పుడు ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే బరువు అదుపులో ఉంటుంది. అపోహ: నెలసరి సమయంలో వ్యాయామాలు చేయకూడదా?  వాస్తవం: చాలామందికి ఈ సమయంలో రకరకాల నొప్పులూ, చిరాకూ, అలసటా లాంటివి ఉంటాయి. వాటిని అధిగమించాలంటే ముందునుంచీ వ్యాయామం చేయాలి. కావాలనుకుంటే శరీరం అతిగా అలసిపోకుండా కొద్దిదూరం నడవొచ్చు. ధ్యానం చేయొచ్చు. కాబట్టి మొత్తానికే మానేయాల్సిన పనిలేదు. అపోహ: ఎక్కువ బరువులు మోస్తేనే త్వరగా బరువు తగ్గుతామా?  వాస్తవం: అలా ఏమీ ఉండదు. సామర్థ్యాన్ని బట్టి బరువులు

బిజీగా ఉండే అమ్మాయిల కోసం సులభమైన స్కిన్ కేర్ టిప్స్

Image
చాలా బిజీగా ఉంటూ మీ చర్మ సౌందర్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇప్పటికీ సమయం మించిపోలేదు. మీ చర్మం తన అందాన్ని కోల్పోకముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు చర్మ సౌందర్యాన్ని పరిరక్షించినవారవుతారు. చాలా సులభమైన చర్మాన్ని పరిరక్షించుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. చర్మంపై నల్ల మచ్చలు, వయసు రీత్యా ఏర్పడే చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు తగు జాగ్రత్తలు అవసరం. హానీకరమైన సూర్యకిరణాల వల్ల కూడా చర్మసమస్యలు ఏర్పడతాయి. కాబట్టి, తగు సంరక్షణ తీసుకోవడం వల్ల చర్మ సమస్యల బారినుండి బయట పడవచ్చు. అటువంటి సులభమైన చర్మ సంరక్షణ చిట్కాలు మీకోసం.  సన్ స్క్రీన్ ను స్కిప్ చేయకండి:  సన్ స్క్రీన్ ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. హానీకరమైన సూర్యకిరణాల వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు ఈ చిట్కాను కచ్చితంగా పాటించాలి. ఎస్ పీ ఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువున్న సన్ స్క్రీన్ ను కచ్చితంగా వాడాలి. వయసు రీత్యా చర్మం లో పటుత్వం కోల్పోతుంది. అయితే, సన్ స్క్రీన్ ను రెగ్యులర్ గా వాడడం వల్ల ఆ సమస్య కూడా వేధించదు. వెట్ వైప్స్ ను ఎల్లప్పుడూ దగ్గరుంచుకోండి:  ఎక్కువ సేపు దుమ్మూ ధూళి ముఖంపై పేరుకుపోవడంతో చర్మంపై మొటిమలు వ

చర్మంను తేమగా, కాంతివంతంగా మార్చే ఆరెంజ్ ఫేస్ మాస్క్..!

Image
సౌందర్యానికి పండ్లు కూడా అద్భుతంగా ఉపయోగపడుతాయన్న సంగతి మనకు తెలిసిందే. పండ్లలో ముఖ్యంగా ఆరోగ్యానికి మరియు అందానికి బాగా ఉపయోగపడేది ఆరెంజ్. ఆరెంజ్ తొక్క ముఖం మరియు చర్మఛాయను పెంచడంలో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది. ఆయిల్ చర్మాన్ని, చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలను, ఇన్ఫ్లమేషన్ ను తొలగిస్తుంది, మొటిమలను నివారిస్తుంది, blemishesను తొలగిస్తుంది. ఇంకా స్కిన్ టోన్ కూడా మీ ముఖం మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కను నిల్వ చేయడంతో పాటు ఉపయోగించడం కూడా చాలా సులభం. అందుకు మీరు చేయాల్సిందల్లా, మీరు తిన్నప్రతి సారి ఆరెంజ్ తొక్కను పడేయకుండా సేవ్ చేయాలి. తర్వాత కొంత పెద్ద మెత్తం అయిన తర్వాత తొక్కను రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అంతే ఫేస్ కు ఉపయోగించడానికి ఆరెంజ్ పౌడర్ రెడీ. ఈ పౌడర్ ను దీర్ఘకాలం ఉపయోగించడానికి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ పౌడర్ తో ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో మంచి ఛాయతో పాటు, కళంకంలేని క్లియర్ స్కిన్ ను మీకు అందిస్తుంది. మరి ఈ సులభమైన ఫేస్ ప్యాక్ తో మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి తప్పనిసరిగా ఆరెంజ్ తొక్కలను ఉపయోగించండి. ఆరెంజ్ పౌడర్ తో ఫే

మెడపై ముడతలు రాకుండా నివారించే చిట్కాలు

Image
స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి చాలా అవసరం. చర్మంలో ఉత్పత్తి అయ్యే కొల్లాజెన్ స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తి సరిగా లేనప్పుడు చర్మంలో సన్నని చారలు, ముడుతలను మొదలవుతాయి. ఇవి ముఖం, మెడ నుండి ప్రారంభమై, నిధానంగా చేతులకు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది. ముఖంలో చారలు, ముడుతలను నివారించుకోవడానికి కొంత మంది ఫేషియల్స్ చేసుకుంటారు. అయితే ముఖం క్రింద మరో అందమైన మెడ భాగాన్ని వదిలేస్తుంటారు. మెడకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మెడ మీద చర్మం ముఖ చర్మం కంటే మందంగా కనబడుతుంది. దాంతో మెడ మీద చారలు, ముడతలు ఎత్తి కనబడుతుంటాయి. యూవి కిరణాలు మెడ మీద పడటంతో మరింత ఎక్కువ కనబడుతుంటాయి. ఇంకా జెనటిక్ సమస్యలు, స్ట్రెస్, మరియు ఇతర రీజన్స్ వల్ల కూడా మెడ మీద ముడతలు ఇబ్బంది కలిగిస్తాయి.  ముఖంలో వలే మెడ మీద ఫైన్ లైన్స్ , ముడుతలను నివారించుకోవడానికి ఫేస్ మాస్క్ లు అంతగా ఉపయోగపడకపోవచ్చు . అయితే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను ఉపయోగించి ముడుతలను కనబడకుండా కవర్ చేయోచ్చు. మరియు ముడుతలను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖంలో, మెడ మీద చారలను, ముడతలను నివ

ఫేస్ తెల్లగా..కాంతివంతంగా కనబడాలంటే పెరుగు ఫేస్ ప్యాక్

Image
ఆరోగ్యం కోసం తీసుకునే ఆహార పదార్థాలతో అందం కూడా పెరుగుతుందనే విషయం మీకు తెలుసా? పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబితే.. తక్కువ ఖరీదులో అందాన్ని మెరుగుపరుచుకోవడానికి పెరుగు చాలంటారు సౌందర్య నిపుణులు.ప్రతి ఇంట్లో తప్పకుండా లభించే పెరుగు ముఖ్యమైన బ్యూటీ ఇంగ్రీడియెంట్ అన్న విషయం మరచిపోకూడదు. కాంతివంతమైన చర్మం కోసం ప్రయత్నిస్తుంటే, కచ్చితంగా మీ బ్యూటీ ప్యాక్స్ లో పెరుగుకి స్తానం కలిపించాలి. వెడ్డింగ్ సీజన్ లో ఆరోగ్యవంతమైన చర్మం కోసం పెరుగుకు మొదటి స్థానాన్ని కల్పించడం ప్రధానం.  పెరుగుతో చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కేవలం పెరుగునే ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకున్నా మెరుగైన ఫలితముంటుంది. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ లు అత్యధిక స్థాయిలో లభిస్తాయి. అంతే కాకుండా, విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే, పెరుగులో ఉండే యాంటి మైక్రోబియాల్ ప్రాపర్టీస్ చర్మ సమస్యలకు రెమిడీగా పని చేస్తాయి. స్కిన్ వైట్ గా మార్చుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఎంతో డబ్బు ఖర్చు