తెల్ల జుట్టును నివారించే 10 పవర్ ఫుల్ హోం రెమెడీస్
ప్రస్తుత రోజుల్లో జుట్టు సమస్యల్లో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో హెయిర్ ఫాల్ మొదటి సమస్య అయితే, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం రెండో సమస్య.. అందుకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్రలేమి, పొల్యూషన్, హెరిడిటి, కొన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్..
జుట్టు పెరుగుదల ఓల్డ్ హెయిర్ ఫాలీసెల్స్ (నిర్జీవమైన హెయిర్ ఫాలీ సెల్స్ ను) బయటకు పుష్ అవుట్ చేసి, కొత్త ఫాలీసెల్స్ ను ఉత్పత్తి అయితే జుట్టు పెరుగుదల ప్రారంభం అవుతుంది. కొత్తగా జుట్టు ఏర్పడటేప్పుడు ఆ ప్రదేశంలో హెయిర్ పిగ్మెంట్ తక్కువగా ఉత్పత్తి అయితే, ఆ ప్రదేశంలో జుట్టు గ్రేగా లేదా తెల్లగా మారుతుంది. అంతే కాదు మెలనిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. హార్మోన్స్ లోపం, స్ట్రెస్, కెమికల్ ప్రొడక్ట్స్ ఇవి కూడా తెల్లజుట్టుకు కారణమవుతాయి..
విటమిన్ బి 12 :
విటమిన్ బి12 లోపించడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. కాబట్టి, డైలీ డైట్ లో విటమిన్ బి12 అధికంగా ఉండే పోర్క్, బీఫ్ , ల్యాంబ్, డైరీ ప్రొడక్ట్స్ ను పాలు,చీజ్ గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
థైరాయిడ్ లెవల్స్ ను చెక్ చేసుకోవాలి:
థైరాయిడ్ గ్రంథులు శరీరంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ హార్మోనుల అసమతుల్యత వల్ల కూడా తెల్ల జుట్టుకు కారణమవుతుంది. కాబట్టి, థైరాయిడ్ చెక్ చేయించుకోవడం వల్ల హార్మోన్ సప్లిమెంట్ తీసుకోవచ్చు.
స్మోకింగ్ నిలపాలి:
జుట్టు ఆరోగ్యం మీద జీవనశైలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన తీసుకునే ఆహారం, అలవాట్లే మన ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని తెలుపుతాయి. కాబట్టి, జుట్టు ఆరోగ్యంగా, నల్లగా ఉండాలంటే, స్మోకింగ్ మానేయాలి.
యాంటీ ఆక్సిడెంట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి:
హెయిర్ పిగ్మెంటేషన్ కు కారణం ఆక్సిడేటివ్ స్ట్రెస్ . స్ట్రెస్ వల్ల ఫ్రీరాడికల్స్ , ఏజింగ్ లక్షణాలను పెంచుతాయి. హెయిర్ లాస్ ఇమ్ బ్యాలెన్స్ అవుతుంది. యాంటీఆక్సిడెంట్ వైట్ హెయిర్ తో పోరాడుతుంది. యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే బెర్రీస్, గ్రేప్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, గ్రీన్ టీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
హెన్నా:
హెన్నా జుట్టు రాలడం ఆపడం మాత్రమే కాదు, ఇది తెల్ల జుట్టును నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. హెన్నా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హెన్నాలో కాఫీ డికాషన్ మిక్స్ చేసి తకలు ప్యాక్ లా వేసుకుని, రెండు మూడు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి షైనింగ్, రంగు వస్తుంది. నల్ల జుట్టు కనబడకుండా చేస్తుంది.
కరివేపాకు:
కరివేపాకును పురాతన కాలం నుండి బ్యూటికోసం ఉపయోగిస్తున్నారు. తెల్ల జుట్టును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను స్టోన్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తలకు అప్లైచేయవచ్చు. ఈ ఆయిల్ హెయిర్ ఫాలిసెల్స్ ను క్రమబద్దం చేస్తుంది. మెలనిన్ ఉత్పత్తి పెంచుతుంది. హెయిర్ కు మంచి కలరింగ్ ఇస్తుంది.
ఉసిరి:
వైట్ హెయిర్ నివారించడంలో ఎఫెక్టివ్ హోం మేడ్ మెడిసిన్. దీన్ని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు..కొన్ని ఉసిరికాయ ముక్కలను ఒక కప్పు కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. ఈ ఆయిల్ ను తరచూ తలకు అప్లై చేస్తుంటే తెల్ల జుట్టు సమస్య క్రమంగా తగ్గుతుంది.ఈనూనెలో ఉండే యాంటీఏజింగ్ బెణిఫిట్స్ హెయిర్ పిగ్మేంటేషన్ ను నివారిస్తుంది. ఈ నూనె డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. హెయిర్ టానిక్ గా పనిచేస్తుంది. షైనింగ్ బ్లాక్ హెయిర్ ను అందిస్తుంది.
నువ్వుల నూనె:
నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల గ్రేట్ హెయిర్ బెనిఫిట్స్ పొందుతారు. ముఖ్యంగా తెల్ల జుట్టు నివారించుకోవచ్చు.
బ్లాక్ టీ:
తెల్ల జుట్టును నివారించడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ బ్లాక్ టీ . రెండు టీస్పూన్ల బ్లాక్ టీ ఆకులను నీళ్లలో వేసి ఉడికించి, చల్లారిన తర్వాత తలకు అప్లై చేసి, ఒక గంట తర్వాత షాంపు లేకుండా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వైట్ హెయిర్ పెరగకుండా నివారిస్తుంది. అలాగే జుట్టును నల్లగా షైనీగా మార్చుతుంది.
మెంతులు :
వైట్ హెయిర్ ను నివారించడంలో పవర్ ఫుల్ హోం రెమెడీ ఇది. మెంతుల మొలకలను తినడం లేదా మెంతులను నానబెట్టిన నీళ్ళు తాగడం, లేదా మెంతి పేస్ట్ ను తలకు ప్యాక్ వేసుకవోడం వల్ల తెల్ల జుట్టును ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. మెంతుల్లో ఉండే న్యూట్రీషియన్స్, విటమిన్ సి , ఐరన్ పొటాషియం మరియు లిసైన్స్ జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది. ఇది తెల్ల జుట్టును నివారించడం మాత్రమే కాదు, పొడి జుట్టును కూడా నివారిస్తుంది..
Comments
Post a Comment