Posts

Showing posts from October, 2016

చర్మాన్ని స్మూత్ గా, గ్లోయింగ్ గా మార్చుకునే సింపుల్ టిప్స్..!

Image
చాలామంది డ్రై స్కిన్ అనేది సీజన్ తో సంబంధం లేకుండా వేధిస్తుంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా.. అన్ని సీజన్స్ లో సమస్యలు తీసుకొస్తుంది. డ్రై స్కిన్ ఉంటే.. దురద, ఇన్ల్ఫమేషన్, ఇరిటేషన్ వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు.  డ్రై స్కిన్ సమస్య మరీ ఎక్కువైనప్పుడు ఎగ్జిమా, సోరియాసిస్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. పొడి చర్మాన్ని సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే.. చర్మం నిర్జీవంగా, అనారోగ్యంగా కనిపిస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ ని సాఫ్ట్ గా మార్చే రెమిడీస్ మీ వంటింట్లోనే ఉన్నాయి. వాటిని ఒక్కసారి ప్రయత్నిస్తే.. మీ చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా మారుతుంది. ఈ తేడా గమనిస్తే.. మీరే ఆశ్చర్యపోతారు.  ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో హోం రెమిడీస్ తో అందమైన స్కిన్ సొంతం చేసుకోవచ్చు. కాస్త ఓపిక చేసుకుని.. డైలీ ఈ స్కిన్ కేర్ హ్యాబిట్స్ ఫాలో అయితే.. స్కిన్ చాలా స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. దాల్చిన చెక్క అర టీస్పూన్‌  దాల్చినచెక్క పొడి, మూడు టీ స్పూన్ల తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ని

గార్జియస్ లిప్స్ కోసం 10 సింపుల్ లిప్ కేర్ టిప్ ..!

Image
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చలికాలం వచ్చేసింది. ఈ క్రమంలో చలి తెచ్చే ఇబ్బందులూ మొదలైపోయాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది పెదవులు పగలడం. ఈ కాలంలోనైతే చర్మమే కాదు, పెదవులు కూడా పగిలి అందవిహీనంగా కనిపిస్తుంటాయి. దీంతో చాలా మంది పెదవులను రక్షించుకోవడం కోసం పలు రకాల క్రీములు రాస్తుంటారు.  బ్యూటీ టిప్స్ కూడా పాటిస్తుంటారు. కానీ అలాంటి వాటికి బదులుగా కింద ఇచ్చిన పలు టిప్స్ పాటిస్తే పెదవులను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవి ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లిప్ బామ్‌  లిప్ బామ్‌ను పెదాల‌కు రాసి కొంత సేపు అయ్యాక టూత్‌బ్ర‌ష్‌తో పెదాల‌పై సున్నితంగా బ్ర‌ష్ చేయాలి. అనంత‌రం ఒక శుభ్ర‌మైన గుడ్డ‌ను వేడి నీటిలో ముంచి పెదాల‌ను తుడిచేయాలి. మ‌ళ్లీ అవ‌స‌రం అనుకుంటే లిప్ బామ్ పెట్టి అలాగే చేయాలి. దీంతో పెదాలు మృదువుగా మారుతుంది. పొడిద‌నం త‌గ్గుతుంది. తేనె -నిమ్మ‌ర‌సం  ఒక టీస్పూన్ తేనె, 1/2 టీస్పూన్ నిమ్మ‌ర‌సంల‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పెదాల‌కు రాయాలి. దీన్ని 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో క‌డిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పెదాలు కాంతివంతంగా మారుతాయి. కోల్పోయిన స‌హ‌జ

తెల్లజుట్టు నివారించి, బ్లాక్ గా మార్చే ఫర్ఫెక్ట్ హెయిర్ ఆయిల్ : ఆముదం.!

Image
ఆముదం, ఆముదం నూనె గురించి మీకు తెలుసా? ఈ కాలంలో చర్మంతోపాటూ జుట్టుకు సంబంధించిన రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాంటివన్నీ దూరమై మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం. భారతదేశంలో ఆముదము నూనె క్రీ.పూ. 2000 నుండి ఉపయోగంలో ఉంది. క్యాస్టోర్ ఆయిల్ (ఆముదం)ఒక నేచురల్ ప్లాంట్ ఆయిల్ ఆముదం మొక్క నుండి వచ్చిన విత్తనాల నుండి నూనెను తయారుచేస్తారు. ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక అందమైన శరీరానికి దోహదం చేస్తుంది. ఆముదం నూనెను ప్రాచీన కాలం నుండి వివిధ రకాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో ప్రయోజనాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టారియల్, యాంటా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఆముదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. అందేకు ఈ నూనె అన్ని రకాల జుట్టు సమస్యలను గ్రేట్ గా నివారిస్తుంది. చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చివరల్లు చిట్లడం మరియు బట్టతల ను కూడా నివారించడంలో ఆముదం గ్రేట్ గా సహాయపడుతుంది. ఆముదం నూనెలో ఉండే ప్రోటీన్స్, మర

ఆల్మండ్ ఆయిల్ తో అన్ని చర్మసమస్యలకు గుడ్ బై..!

Image
మనం నిద్రలేచినప్పుడు మన చర్మం డ్రైగా, నిర్జీవంగా ఉంటుంది. మన చర్మం ఎక్కువ ఆయిల్ ని ఉత్పత్తి చేయడం వల్ల లేదా ఆయిల్ కోల్పోవడం వల్ల.. చర్మం ఇలా డ్రైగా లేదా నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటి చర్మ సమస్యలకు ఆల్మండ్ ఆయిల్ పర్మనెంట్ గా సొల్యూషన్ ఇస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మరే ఇతర సమస్యలు రాకుండా.. అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది కొల్లాజెన్ లెవెల్ ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఎలాస్టిసిటీ పెరుగుతుంది. చర్మం స్మూత్ గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. చర్మాన్ని రిపేర్ చేసి.. ఉపశమనం కలిగిస్తాయి. ఆల్మండ్ ఆయిల్ లో ఉండే మోనో శ్చాచురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం, ప్రొటీన్స్, జింక్, ఇతర మినరల్స్ ఫైన్ లైన్స్ ని తగ్గిస్తాయి. చర్మాన్ని డీప్ గా క్లెన్స్ చేస్తాయి. అలాగే.. ఏజింగ్ ప్రాసెస్ ని అడ్డుకుంటాయి. మరి ఈ ఆల్మండ్ ఆయిల్ తో.. చర్మానికి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం.. డార్క్ సర్కిల్ రాత్రిపడుకునే ముందు.. కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ తీసుకున.. కళ్ల చుట్టూ మసాజ్ చేసుకోవాలి.

ఫేషియల్ బ్లీచ్ తర్వాత స్కిన్ బర్నింగ్ తగ్గించే 8 ఎఫెక్టివ్ రెమెడీస్ ..!

Image
ఫేషియల్ బ్లీచ్ బర్న్స్ నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ఇన్ స్టాంట్ గా కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి . ఫేషియిల్స్, బ్లీచింగ్ వంటివి మహిళలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. రెగ్యులర్ ఫేషియల్, బ్లీచ్ వల్ల ఇన్ స్టాంట్ గా చర్మంను తెల్లగా మార్చుకోవచ్చు. అయితే ఫేషియల్ అయినా, బ్లీచింగ్ అయినా బయట చేయించుకోవాలంటే పర్స్ ఖాలీ చేయాల్సిందే... ఫేషియల్ హెయిర్ బ్లీచ్ చేసుకున్న వెంటనే కొంత మందికి చర్మంలో మంట పుడుతుంది. చర్మంలో బర్నింగ్ సెన్షేషన్ అసాధారణంగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇది చీకాకు కలిగిస్తుంది. దురద పెట్టినట్లు అనిపిస్తుంది. దాంతో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇటువంటి అనుభం మీకు కూడా కలిగి ఉంటే , తప్పనిసరిగా ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది. ఫేషియల్ బ్లీచ్ బర్నింగ్ ను తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. ఇది చర్మంలో మంటను, ఇరిటేషన్, తగ్గిస్తుంది. ఈ ట్రెడిషినల్, నేచురల్ రెమెడీస్ ను కొన్ని శతాబ్దాల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ నేచురల్ రెమెడీస్ చర్మంలో ఇరిటేషన్ తగ్గిస్తాయి . బర్నింగ్ సెన్షేషన్ తగ్గిస్తాయి.చర్మానికి స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తాయి. ఇవి ఇన్

ముక్కు, గెడ్డంపై మీద బ్లాక్ హెడ్స్ ను తొలగించే 12 హెర్బల్ రెమెడీస్ ..!

Image
జిడ్డు చర్మం లేదా పొడి చర్మం లేదా ఈ రెండు కాంబినేషన్ చర్మం ఉన్న పర్వాలేదు, కానీ చాలా మంది ఏదో ఒక సందర్బంలో బ్లాక్ హెడ్స్ తో బాధపడుతుంటారు. బ్లాక్ హెడ్స్ ముఖ అందాన్ని పాడు చేస్తాయి. కాబట్టి, ఇటువంటి బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి కొన్ని హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి. బ్లాక్ హెడ్స్ కు కారణమేమి? చర్మంలో శ్రవించే నూనెలతో చర్మ రంద్రాలు మూసుకుపోయినప్పడు , చర్మ రంద్రాల్లో డస్ట్ చేరినప్పుడు, డెడ్ స్కిన్ సెల్స్ వల్ల చర్మం మీద నల్లగా చిన్నమొటిమల వలే చర్మంలోపలి నుండి పొడుచుకుని వస్తాయి . ముఖ్యంగా ముఖ్యంగా ముక్కు మీద ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి. బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ రెండు కూడా చర్మ సమస్యలే. ఈ రెండూ కూడా చర్మం రంద్రాలు తెరచుకున్నప్పుడు లేదా చర్మ రంద్రాలు మూసుకుపోయినప్పుడు ఏర్పడుతాయి . బ్లాక్ హెడ్స్ చర్మ రంద్రాల్లో నూనెలతో బ్లాక్ అయినప్పుడు ఆక్సిజన్ ప్రసరించకుండా చేస్తుంది . దాంతో ఆక్సిడైజ్డ్ గా మారి, బ్లాక్ కలర్ లోకి మారుతుంది. బ్లాక్ హెడ్స్ ను నివారించుకోవడానికి స్క్రబ్బింగ్ అనుకూలమైన పద్దతిగా భావిస్తారు . స్ర్కబ్బింగ్ వల్ల డీప్ చర్మంలో నుండి డీప్ గా బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుందని