Posts

Showing posts from April, 2017

వదులైన స్థనాలు..డీగ్లామరస్ బ్రెస్ట్ షేప్ కు చెక్ పెట్టే బ్రిలియంట్ హోం రెమెడీస్ ..!!

Image
ప్రతి మహిళ అందమైన బ్రెస్ట్ షేప్ , బ్రెస్ట్ సైజ్ కలిగి ఉండాలని కోరుకుంటుంది. అయితే కొంత మంది మహిళల్లో కొన్ని కారణాల వల్ల బ్రెస్ట్ సాగడం జరుగుతుంది. ఇలా వదులైన లేదా సాగిన బ్రెస్ట్ తో అందంగా కనబడకపోగా, స్కిన్ ఎలాసిటి, మరియు స్కిన్ ఫెయిర్ నెస్ మీద ప్రభావం చూపుతుంది. సహజంగా, మహిళ30 నుండి 40 వయస్సుకు వచ్చే సరికి, ఆమె శరీరంలో కొన్ని సహజ మార్పులు, హార్మోను ల ప్రభావం వల్ల బ్రెస్ట్ సాగడం మొదలవుతుంది. ముఖ్యంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత వయస్సు రిత్యా, మోనోపాజ్, ప్రెగ్నెన్సీ, స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ వంటి కారణాల వల్ల కూడా బ్రెస్ట్ సాగుతుంది. వదులైన స్థనాలు, సరైన షేప్ లేకపోవడం వల్ల బాడీ షేప్ మీద కూడా ప్రభావం చూపి, డీగ్లామరస్ గా మార్చుతుంది. అంతే కాదు, ఇంకా కొన్ని బ్రెస్ట్ డిసీజెస్ వల్ల కూడా స్థనాలు వదులౌతాయి. ఇలాంటి సమస్యతో మీరు కూడా బాధపడుతుంటే, ఒక సింపిల్ అండ్ ఈజీ మార్గం ఒకటుంది. స్థనాలు వదులు కాకుండా నివారించడంలో కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. అలోవెర మసాజ్  అలోవెర నుండి జెల్ తీసి, బ్రెస్ట్ కు అప్లై చేసి మసాజ్ చేయాలి. అ...

బోల్డ్ స్కై » తెలుగు » సౌందర్యం » Skin Care » కాళ్ల పగుళ్లు, పొడి చర్మంను నివారించుకోవడానికి హోం రెమెడీస్..! కాళ్ల పగుళ్లు, పొడి చర్మంను నివారించుకోవడానికి హోం రెమెడీస్..!

Image
డ్రై స్కిన్ (పొడి చర్మం)చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. కాళ్ళ పగుళ్లు మరియు కాళ్లమీద డ్రై స్కిన్ నివారించుకోవాలనుకుంటున్నారా.అయితే ఇది మీకు ఖచ్ఛితంగా సహాయపడుతుంది.  కాళ్ల పొడి బారిన చర్మంతో ఉన్నప్పుడు చీకాకు, దురద మరియు కొన్ని సందర్బాల్లో బర్నింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. మీరు షార్ట్ ప్యాంట్స్ వేసుకుంటారా, స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటారా అన్నది సమస్య కాదు, కాళ్లు తరచూ దురద కలిగి ఉంటాయి. కాళ్ళు పగుళ్లతో పాటు, కాళ్ల మీద తరచూ చర్మం పొడిబారుతున్నట్లు కనబడుతుంటే ఎప్పుడూ పొడవు దుస్తులు వేసుకోవడం మంచిది. ఇలా వేసుకోవడం వల్ల సూర్యుని నుండి చర్మాన్ని రక్షిస్తాయి. డ్రై స్కిన్ అంటే చర్మం మీద లేయర్ గా డెడ్ స్కిన్ సెల్స్ చేరడం, చాలా రోజుల నుండి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించకపోవడం వల్ల ఇలా పొడిబారి ఇబ్బందికి గురిచేస్తాయి. చాలా రోజుల నుండి ఆ డెడ్ స్కిన్ లేయర్ ను తొలగించకపోవడం వల్ల అలా వస్తుంటుంది. మరి ఇలాంటి డ్రై స్కిన్ నివారించుకోవడం కోసం కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా... 1. ఆలివ్ ఆయిల్ :  డ్రై స్కిన్ నివారించడంలో ఆలివ్ ఆయిల్ ...

తెల్ల జుట్టును నివారించే 10 పవర్ ఫుల్ హోం రెమెడీస్

Image
ప్రస్తుత రోజుల్లో జుట్టు సమస్యల్లో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో హెయిర్ ఫాల్ మొదటి సమస్య అయితే, చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం రెండో సమస్య.. అందుకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్రలేమి, పొల్యూషన్, హెరిడిటి, కొన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్.. జుట్టు పెరుగుదల ఓల్డ్ హెయిర్ ఫాలీసెల్స్ (నిర్జీవమైన హెయిర్ ఫాలీ సెల్స్ ను) బయటకు పుష్ అవుట్ చేసి, కొత్త ఫాలీసెల్స్ ను ఉత్పత్తి అయితే జుట్టు పెరుగుదల ప్రారంభం అవుతుంది. కొత్తగా జుట్టు ఏర్పడటేప్పుడు ఆ ప్రదేశంలో హెయిర్ పిగ్మెంట్ తక్కువగా ఉత్పత్తి అయితే, ఆ ప్రదేశంలో జుట్టు గ్రేగా లేదా తెల్లగా మారుతుంది. అంతే కాదు మెలనిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. హార్మోన్స్ లోపం, స్ట్రెస్, కెమికల్ ప్రొడక్ట్స్ ఇవి కూడా తెల్లజుట్టుకు కారణమవుతాయి.. విటమిన్ బి 12 : విటమిన్ బి12 లోపించడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. కాబట్టి, డైలీ డైట్ లో విటమిన్ బి12 అధికంగా ఉండే పోర్క్, బీఫ్ , ల్యాంబ్, డైరీ ప్రొడక్ట్స్ ను పాలు,చీజ్ గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. థైరాయిడ్ లెవల్స్ ను చెక్ చేసుకోవాలి: థైరాయిడ్...

మీ ఫ్రిజ్ లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఈ సమ్మర్ బ్యూటీ క్వీన్ మీరే..!!

Image
చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించేందుకు బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లడం లేదా రకరకాల పూతలు వేసుకోవడం మామూలే. అయితే ఈసారి వాటన్నింటికీ సెలవిచ్చేసి కేవలం ఐసుముక్కలతోనే చికిత్స చేసుకునేందుకు ప్రయత్నించండి. ఐస్ క్యూబ్స్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే పండ్ల రసాలూ, వివిధ అవసరాల కోసం ఫ్రిజ్‌లో ఐసుముక్కల్ని ఉంచుతారు. మరి మీ ఫ్రిజ్‌లోనూ ఈ ముక్కలు ఉంటే ఈ వేసవిలో సౌందర్యపోషణకు ఎలా ఉపయోగపడతాయో చూడండి. మొటిమలు, మచ్చలు తొలగించే ఐస్ క్యూబ్స్ :  మొటిమలు, యాక్నె ముఖం పై ఉంటే.. వేడి వాతావరణంలో చాలా మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. దీన్నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే మాత్రం శుభ్రంగా ఉన్న పొడి వస్త్రంలో ఐసు ముక్కల్ని ఉంచి.. ఆ ప్రాంతంలో అద్దాలి. ఇలా ఓ పదినిమిషాలు చేయడం వల్ల హాయిగా అనిపిస్తుంది. మొటిమలూ, యాక్నె చాలా త్వరగా తగ్గిపోతాయి. అలసిన చర్మం పునరుత్తేజం అవుతుంది:  తరచూ ప్రయాణాలు చేసేవారి ముఖం అలసటగా ఉంటుంది. దాన్ని దూరం చేసుకుని.. తాజాదనం సొంతం చేసుకోవాలంటే ఐసుముక్కలతో ముఖంపై అద్దుకోవాలి. చల్లదనం అలసటని దూరం చేస్తుంది. చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తుంది. ఐబ్రోస్ చేయించుకొన్నప...

బాబోయ్ మొండి చుండ్రు... తల జిల... చాలా బాగోదు, ఏం చేయాలి?

Image
బాబోయ్ మొండి చుండ్రు... తల జిల... చాలా బాగోదు, ఏం చేయాలి? చుండ్రు సమస్య గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ చుండ్రు కారణంగా పదిమందిలో కలిసి వున్నా... తల జిలపుడుతుండటంతో వారి ముందే చుండ్రు సమస్యతో బాధపడేవారు గోక్కుంటూ వుంటారు. ఇది చూసేందుకు చాలా బాగోపోయినా అలా తలలో చేతులు పెట్టి గోకుతూనే వుంటారు. దీన్ని వదిలించుకునేందుకు కొన్ని చిట్కాలు.  ఒక కప్పు నీటిలో అర చెంచా నిమ్మ రసం కలిపి తలకు పట్టించాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే మెలమెల్లగా చుండ్రు మటుమాయం అవుతుంది. రాత్రి పూట కొబ్బరినూనెలో నిమ్మ రసం కలిపి తలకు దట్టించి మాలిష్ చేయండి. తెల్లవారిన తర్వాత తల స్నానం చేయండి. దీంతో చుండ్రు తగ్గిపోతుంది. యూకలిప్టస్ నూనె చుక్కలు కొన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు మాలిష్ చేయండి. ఆ తర్వాత తలస్నానం చేయండి. మెల్లగా చుండ్రు సమస్య వదిలిపోతుంది. అలాగే పడుకునే దిండు కవర్లు, దుప్పట్లు తరచుగా ఉతికేస్తుండాలి. దువ్వెనలను కూడా క్లీన్ చేసుకోవాలి.

పిడికెడు తెల్లటి నువ్వులు తింటే.. జుట్టు పెరుగుతుందట..

Image
పిడికెడు తెల్లటి నువ్వులు తింటే.. జుట్టు పెరుగుతుందట.. రోజూ ఉదయాన్నే.. ఒక పిడికెడు తెల్లటి నువ్వులు తింటే.. అందులో క్యాల్షియం, మెగ్నీషియం.. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే జట్టు పెరగాలంటే..? కొబ్బరి నీళ్లు తాగాలి. వీటిని తాగడం ద్వారా జుట్టు పెరుగుదలకు కావలసిన కాల్షియం అందించబడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే క్యాల్షియం.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ప్లస్ జుట్టును పెరిగేలా చేస్తుంది. జుట్టు పెరగాలంటే.. నిద్రించేందుకు ముందు రెండు చెంచాల నూనెను మీ తలకు రాయండి, కానీ ఇక్కడ నూనెను మీ కేశాలకు కాకుండా తలపై చర్మం లేదా వెంట్రుకల మూలాలకు రాయండి. ఇలా తలపైన చర్మానికి నూనెతో మసాజ్ చేయటం వలన రక్త సరఫరా జరుగుతుంది. వెంట్రుకల మూలాలకు కావలసిన పోషకాలు అందించబడతాయి. వేడి చేసిన నూనెను వేళ్ళతో వెంట్రుకల మూలాలకు మసాజ్ చేయండి, ఈ నూనె మీ వెంట్రుకల మూలాలకు అంటేలా జాగ్రత్త పడండి. కొద్దిగా ఒత్తిడితో నూనెను అద్దటం వలన మీ వెంట్రుకల మూలాలకు నూనెలోని పోషకాలు అందించబడతాయి మరియు రక్త సరఫరా మెరుగుపడుతుంది.