బియ్యం పిండి దోసెలు, ఇడ్లీలకు కాదు.. టమాటా జ్యూస్‌తో బియ్యం పిండి కలిపి?

బియ్యం పిండి దోసెలు, ఇడ్లీలకు కాదు.. టమాటా జ్యూస్‌తో బియ్యం పిండి కలిపి?


బియ్యం పిండిని దోసెలకు, ఇడ్లీలకే కాదు.. చర్మ సౌందర్యానికి గాను ఉపయోగించుకోవచ్చు. బియ్యం పిండి, ఎగ్ వైట్, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల స్కిన్ టైట్‌గా ఉంటుంది. ముడతలు మాయమవుతాయి. బియ్యం పిండి, ఓట్ మీల్, పాలపొడి మిశ్రమాలను కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని స్కిన్ టోన్‌గా ఉపయోగించుకుంటే.. స్కిన్ టోన్ అందంగా మారుతుంది. 

అలాగే కంటి కింద ఏర్పడే వలయాలు మాయమవ్వాలంటే.. బాగా పండిన అరటి  పండు, ఆముదం, బియ్యం పిండి కలిపి ప్యాక్‌లా రాసుకుంటే డార్క్ సర్కిల్స్ మటుమాయమవుతాయి. బియ్యం పిండి, ఆలోవెరా జెల్‌, తేనె కలిపి పేస్టుగా చేసుకుని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.

అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి.. అర టీస్పూన్ టమోటా జ్యూస్‌ను పేస్టులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. ఇలా రోజూ చేయడం ద్వారా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్