బాబోయ్ మొండి చుండ్రు... తల జిల... చాలా బాగోదు, ఏం చేయాలి?

బాబోయ్ మొండి చుండ్రు... తల జిల... చాలా బాగోదు, ఏం చేయాలి?

చుండ్రు సమస్య గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ చుండ్రు కారణంగా పదిమందిలో కలిసి వున్నా... తల జిలపుడుతుండటంతో వారి ముందే చుండ్రు సమస్యతో బాధపడేవారు గోక్కుంటూ వుంటారు. ఇది చూసేందుకు చాలా బాగోపోయినా అలా తలలో చేతులు పెట్టి గోకుతూనే వుంటారు. దీన్ని వదిలించుకునేందుకు కొన్ని చిట్కాలు. 

ఒక కప్పు నీటిలో అర చెంచా నిమ్మ రసం కలిపి తలకు పట్టించాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే మెలమెల్లగా చుండ్రు మటుమాయం అవుతుంది. రాత్రి పూట కొబ్బరినూనెలో నిమ్మ రసం కలిపి తలకు దట్టించి మాలిష్ చేయండి. తెల్లవారిన తర్వాత తల స్నానం చేయండి. దీంతో చుండ్రు తగ్గిపోతుంది.

యూకలిప్టస్ నూనె చుక్కలు కొన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు మాలిష్ చేయండి. ఆ తర్వాత తలస్నానం చేయండి. మెల్లగా చుండ్రు సమస్య వదిలిపోతుంది.

అలాగే పడుకునే దిండు కవర్లు, దుప్పట్లు తరచుగా ఉతికేస్తుండాలి. దువ్వెనలను కూడా క్లీన్ చేసుకోవాలి.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్