పిడికెడు తెల్లటి నువ్వులు తింటే.. జుట్టు పెరుగుతుందట..

పిడికెడు తెల్లటి నువ్వులు తింటే.. జుట్టు పెరుగుతుందట..


రోజూ ఉదయాన్నే.. ఒక పిడికెడు తెల్లటి నువ్వులు తింటే.. అందులో క్యాల్షియం, మెగ్నీషియం.. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే జట్టు పెరగాలంటే..? కొబ్బరి నీళ్లు తాగాలి. వీటిని తాగడం ద్వారా జుట్టు పెరుగుదలకు కావలసిన కాల్షియం అందించబడుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే క్యాల్షియం.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ప్లస్ జుట్టును పెరిగేలా చేస్తుంది.

జుట్టు పెరగాలంటే.. నిద్రించేందుకు ముందు రెండు చెంచాల నూనెను మీ తలకు రాయండి, కానీ ఇక్కడ నూనెను మీ కేశాలకు కాకుండా తలపై చర్మం లేదా వెంట్రుకల మూలాలకు రాయండి. ఇలా తలపైన చర్మానికి నూనెతో మసాజ్ చేయటం వలన రక్త సరఫరా జరుగుతుంది. వెంట్రుకల మూలాలకు కావలసిన పోషకాలు అందించబడతాయి.

వేడి చేసిన నూనెను వేళ్ళతో వెంట్రుకల మూలాలకు మసాజ్ చేయండి, ఈ నూనె మీ వెంట్రుకల మూలాలకు అంటేలా జాగ్రత్త పడండి. కొద్దిగా ఒత్తిడితో నూనెను అద్దటం వలన మీ వెంట్రుకల మూలాలకు నూనెలోని పోషకాలు అందించబడతాయి మరియు రక్త సరఫరా మెరుగుపడుతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్