వేసవిలో చల్లచల్లగా.. అందంగా...!!

వేసవిలో చల్లచల్లగా.. అందంగా...!!




వేసవికాలం అనగానే సాధ్యమైనంతదాకా ఎవరైనా సరే నీడపట్టున ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఎండలలోని అతినీల లోహిత కిరణాల వల్ల చర్మంలోని మెరుపు తగ్గిపోయి, ముడుతలు వచ్చి, వార్ధక్యపు ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి.

ముఖ్యంగా చర్మానికి హానిచేసేది మధ్యాహ్నపు ఎండ. చర్మానికి సహజంగా ఉండే సాగే గుణం, మృదుత్వాన్ని కూడా ఈ ఎండలోని కిరణాలు ధ్వంసం చేస్తాయి. పిగ్మెంటేషన్ తప్పదు, చర్మక్యాన్సర్ ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి, మరీ అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం శ్రేయస్కరం.

అయితే, ఎండలవల్ల చర్మానికి కీడే కాదు, మేలూ కూడా జరుగుతుంది. ఉదయం 6.30-7.30 గంటల మధ్య వచ్చే ఎండ ఎంతో మంచిది. ఆ సమయంలో 10 నిమిషాలు ఎండలో నిలబడితే, శరీరంలో హార్మోన్లు చక్కగా ఉత్పత్తి అవుతాయి. జీర్ణక్రియ వేగవంతమవుతుంది. డి విటమిన్‌ అందటమే గాకుండా, కాల్షియంను సులభంగా స్వీకరించగలుగుతుంది. 

ఈ కాలంలో వాడే మాయిశ్చరైజర్‌ యువిఏ, యువిబి ఫిల్టర్‌ అయి ఉంటే మంచిది. రెండుమూడు గంటలకోసారి సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. అదనంగా ముక్కు, మెడ, పాదాల సంరక్షణకు విడిగా బామ్‌, పెదవులకు లిప్‌బామ్‌ కూడా తప్పనిసరిగా రాసుకోవాలి. సన్‌స్క్రీన్‌ రాసుకుంటే నేరుగా ఎండలో వెళ్లవచ్చనేది అపోహ మాత్రమే. వెంట గొడుగు, లేదా స్కార్ఫ్‌ తప్పనిసరి.

చర్మం కాస్త ఎర్రబడినా, దురదగా అనిపిస్తున్నా, ఎండ ఎక్కువగా ఉన్నట్లే. కాబట్టి తదనుగుణమైన చర్యలు తీసుకోవాలి. చర్మం మరీ మంటగా ఉంటే కలబందతో తయారైన జెల్‌ వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. పుట్టుమచ్చలు, ఫ్రెకిల్స్‌, కుటుంబచరిత్రలో చర్మక్యాన్సర్‌ ఉన్నవాళ్లు సాధ్యమైనంతవరకు ఎండలో తిరగకూడదు. 

బి, సి, ఇ, విటమిన్లు, కెరోటిన్‌, సెలీనియం..యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, ఆపిల్‌, గ్రీన్‌టీ, ఉల్లిపాయ, బొప్పాయి, నిమ్మజాతిపండ్లు.. ఇలా ఫ్లేవనాయిడ్ల ఆధారిత ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల శరీరంలో తేమ శాతం పెరుగుతుంది, అలసట దూరమవుతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్