‘క్యా’రెట్ ప్యాక్
‘క్యా’రెట్ ప్యాక్
footmaskfinalమనం తరచూ ఏదో ఓ ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది. అందుకే ఈ ప్యాక్ కు అంత ప్రాధాన్యం ఇస్తారు. అయితే పాదాలకు ఏ ప్యాక్ వేస్తే బాగుంటుందో తెలియక, ఎవైనా వేసుకున్నా సంతృప్తి కలుగక మనం బాధపడుతుంతాం. అటువంటి సమస్యకు సొల్యూషన్ క్యారెట్ పాదాలకు ప్యాక్ గా వేస్తే ఎన్నో సహజ సిధ్ధ గుణాలతో మన పాదాలకు మంచి చేస్తోందట. అంతేకాక పాదాల రంగునూ ఇనుమడింప చేస్తుందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
1 . క్యారెట్ తురుమునకు రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ చేర్చి ప్యాక్‌లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
2 . అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.
3 . మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.
4 . కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్‌గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.
5 . కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
6 . టేబుల్‌స్పూన్ శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.

Comments
Post a Comment