డేంజర్ : స్లీపింగ్ పిల్స్ వాడటం వల్ల ఆరోగ్యానికి 10 సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్.!

నిద్ర పట్టకపోవటం.. తగినంత సమయం నిద్ర లేక పోవటం.. నిద్ర కోసం మాత్రలను ఆశ్రయిస్తుండటం.. ఇలా నేడు ‘నిద్ర' అతి పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోంది. దీన్నుంచి బయటపడేదెలా?

కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర..! అంతకు మించిన సుఖమయ జీవితమేం ఉంటుంది? కానీ ఈ ఆధునిక కాలంలో నీళ్ల కొరతలా.. తిండి కొరతలా.. 'నిద్ర కొరత' కూడా పెరిగి పోతోంది. ఒకప్పుడు మహాత్ముల్లాగా రోజులో ఎంత తక్కువ సమయం నిద్రపోయి.. ఎంత ఎక్కువ సమయం శ్రమిస్తే అంత గొప్ప అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నిద్ర పట్టకపోవటం.. తగినంత సమయం నిద్ర లేక పోవటం.. నిద్ర కోసం మాత్రలను ఆశ్రయిస్తుండటం.. ఇలా నేడు 'నిద్ర' అతి పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోంది. దీన్నుంచి బయటపడేదెలా? 

శరీరానికి సంబంధించిన ఒక విశ్రాంతి స్థితినే నిద్ర అనవచ్చు. మన దైనందిన జీవితంలో నిద్ర అనేది ఒక ముఖ్యమైన, ప్రాథమిక అవసరం. రోజుకు సుమారు 8 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే నిద్రపోయే వారిలో శరీర సామర్థ్యం తక్కువగా వున్నట్లు పరిశోధనలు తెలిపాయి. సాధారణంగా పిల్లలకు పెద్దలకంటే నిద్ర అనేది ఎక్కువ అవసరం. ఇది పిల్లల శారీరక పెరుగుదలకు మాత్రమే కాక మానసిక అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలకైతే, ఏకంగా రోజుకు సుమారు 18 గంటల నిద్ర అవసరం. కాగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ నిద్రా సమయం తగ్గుతుంటుంది.
ప్రకృత్తి సిద్ధంగా నిద్ర అనేది మానవుని దైనందిన జీవితంలో సహజమైన స్థితే అయినప్పటికీ, కొందరికి వేళకు నిద్ర పట్టకపోవడం, ఎంత జాగ్రత్తలు పాటించినప్పటికి కునుకు తీయలేకపోవడం, ఒక వేళ నిద్రలో ఏదైన భంగం కలిగితే తిరిగి నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు సాధరణంగా నిద్ర పట్టడానికి వాడే ఒకరకమైన ఔషధమే నిద్రమాత్రలు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్ర పట్టకపోయినా, వివిధ రకాల సమస్యల కారణంగా మానసికంగా ఒత్తిళ్లతో సతమతమైపోతున్నా.... అలాంటి వారికి వెంటనే గుర్తొచ్చేది నిద్రమాత్ర. నేటి కాలంలో చాలామంది నిద్ర కోసం ఈ పద్ధతినే అనుసరిస్తుండడం మనం చూస్తూనే వున్నాము. కాకపోతే తరచూ ఇవి వాడటం వల్ల... ఇదే అలవాటుగా మారి, తరువాత కొంత కాలానికి మాత్ర వేసుకోకపోతే నిద్ర పట్టని పరిస్థితి ఎదురౌతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. నిద్రమాత్రలు తరచూ మింగడం వల్ల వివిధ రకాల దుష్ప్రభావాలు కలుగుతాయనడంలో సందేహం లేదు...అవేంటో తెలుసుకుందాం..



రెసిస్టెన్స్ తగ్గుతుంది: 
నిద్రలేమితో బాధపడే స్త్రీ, పురుషులు ఎవరైనా సరే స్లీపింగ్ పిల్స్ మింగడం వల్ల , ప్రస్తుతానికి నిద్ర సమస్యను దూరం చేసినా, కొద్ది రోజుల తర్వాత స్లీపింగ్ పిల్స్ లేకుండా నిద్రపోలేరన్న అలవాటు క్రమంగా పెరుగుతుంది. ఇది బాడీలో రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. దాంతో నిద్రపట్టకపోవడం వల్ల, స్లీపింగ్ పిల్స్ డోస్ పెంచాలనే ఆలోచన మరింత పెరుగుతంది.


ప్యారా సోమ్నియా లేదా ఎరిక్టిక్ బిహేవియర్ ప్యాట్రన్స్ : 
స్లీపింగ్ పిల్స్ మింగడం వల్ల సెమీ కాన్సియస్ నెస్ పెరుగుతుంది. అంటే ఇలా చేయడం వల్ల కలత నిద్ర లేదా నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది . నిద్రించే సమయంలోనే శరీరం మీద అనేక విధాలుగా దుష్ప్రభావం చూపుతుంది. ఇటువంటి పరిస్థితి అత్యంత ప్రమాదకరం.

అలసిన కళ్ళు, కళ్ళు తిరగడం: 
రెగ్యులర్ గా స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం వల్ల డ్రగ్స్ లేకుండా నిద్రపోలేమన్న విధంగా ఉండటం వల్ల ఓవర్ డోస్ స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం వల్ల ఉదయం నిద్రలేచినా ..మత్తుగా, నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయడం అంత సురక్షితం కాదు, ప్రమాదకరం. ఇది కొంత మందిలో ఎక్కువగా ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.



వ్యసనపరులుగా మారుతారు: 
నిద్రలేమి సమస్యల వల్ల స్లీపింగ్ పిల్స్ కు బానీసలుగా మారుతారు . ఒకసారి అలవాటు పడిన తర్వాత వాటిని మానుకోవడం అసాధ్యం అవుతుంది. అందుకే దీన్ని నిద్రలేమి సమస్యలను మరింత తీవ్రం చేస్తుందని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది.


హార్ట్ బర్న్: 
నిద్రసరిగా పట్టడం లేదని నిద్రమాత్రలు మింగడం వల్ల హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది. ఇది నిద్రలేమి వల్ల వచ్చే హార్ట్ ను నిద్రమాత్రలు వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. అసిడిక్ రిఫ్లెక్షన్ పెరగడం వల్ల చాతీలో మంటగా , ఇబ్బందికరంగా ఉంటుంది.

స్కిన్ అలర్జీలు: 
కొంతమందిలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల అలర్జీ సంబంధిత చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో నిద్రమాత్రలు మానేసి వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. లేకపోతే వాంతులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్లు మసకమసకగా కనిపించడం, దురద, ఛాతిలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం.. వంటి లక్షణాలు ఏర్పడతాయి.





మెమరీ లాస్: 
ముందుగా ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపక శక్తి ప్రభావితమవుతుంది. శారీరకంగా కూడా పని సామర్థ్యం తగ్గిపోతుంది. పగటి నిద్ర, ఆందోళన, చికాకు.. భావోద్వేగాలు మారిపోతాయి. నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెమరీ లాస్ అవుతుంది. నిద్రమాత్రలు 3 నెలల కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల మతిమరుపు వ్యాది సోకుతుంది. డిజనరేటివ్ డిజార్డ్స్ ఏర్పడుతాయి.




క్యాన్సర్: 
నిద్రమాత్రలు ఎక్కువ రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటుంటే క్యాన్సర్ కు దారి తీస్తుందని కొన్ని పరిశోధన ద్వారా తెలిసింది . కాబట్టి, నిద్రలేమి సమస్యను నివారించుకోవడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.


కోమా లేదా మరణం: 
నిద్రమాత్రలు తినడం వల్ల మోతాదు ఎక్కువైతే కోమాలోని వెళ్ళడం లేదా మరణం పొందవచ్చు. నిద్రమాత్రల వల్ల శ్వాసలో ఇబ్బందులు కలుగుతాయి. దాంతో ప్రాణాంతక ప్రమాదంగా మారుతుంది.

ఆస్తమా 
నిద్ర మాత్రలు మీ శ్వాసను నెమ్మదిస్తాయి. గాఢ శ్వాస లేకుండా చేస్తాయి. ఆస్తమా రోగులకు ఈ మందులు అసలు మంచివి కావు. కనుక వీరు నిద్రమాత్రలు తీసుకోరాదు.


ప్రవర్తనలో మార్పులు: 
నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రమాధకరమైన ఆమ్నీషియా జబ్బుకు దారితీస్తుంది. కాబట్టి, మీరు తీసుకొనే మాత్రల్లో మార్పుతు తీసుకోవల్సి ఉంటుంది.

ఆల్కహాల్ తో ప్రమాదకరం కొంతమంది నిద్రమాత్రలు ఆల్కహాల్ తో కలిపి తీసుకుంటారు. ఇది ప్రమాదకరం. మరణానికి దోవతీస్తుంది కూడాను. ద్రాక్షరసంతో కూడా కలిపి తీసుకోకండి.


పడిపోవడం: 
స్లీపింగ్ పిల్స్ వల్ల మరో సైడ్ ఎఫెక్ట్ కళ్ళు తిరగడం మరియు పడి పోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిలో వెంటనే హాస్పిటల్లో చేర్చకపోతే చాలా ప్రమాధం జరగుతుంది.


సూచన: నిద్రమాత్రలను వాడటానికి అలవాటు పడినట్లయితే మానడం అనేది చాలా కష్టం. అంచేత నిద్ర పట్టడం లేదని మాత్రలు వేసుకొని కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే, నిద్రలేమి కారణం తెలుసుకుని, డాక్టరుని సంప్రదించడం మంచిది. అయితే వైద్యుల సలహా మేరకు నిద్ర మాత్రలు వాడేవారిలో కూడా ఈ అలవాటు దీర్ఘకాలంగా కొనసాగినట్లయితే... తరచూ వాడుతుంటే... కొన్ని రోజులకు ఈ మాత్రల మోతాదు శరీరానికి సరిపోక, మరింత అధిక మోతాదు వేసుకుంటే తప్ప నిద్రపట్టని పరిస్థితికి దారితీస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియలో భాగంగా ఒత్తిడి ఏర్పడటం వల్ల, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ సలహా మేరకే నిద్ర మాత్రలు వాడినప్పటికీ కూడా, వారు చెప్పిన జాగ్రత్తలు తప్పక పాటించాల్సి వుంటుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్