10 రోజుల్లో ఫెయిర్ అండ్ యంగ్ గా మార్చే ఇండియన్ స్పైసీలు..!


భారత దేశంలో లభించే మూలికలు, మసాలా దినుసులు కేవలం వంటలకు మాత్రమే కాదు, అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా కలిగి ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అంటే, వీటి పోషక విలువల, ఔషధవిలువలు తెలియకపోవడం వల్ల వంటల్లో కూడా ఉపయోగించకుండా ఉంటారు.

ఇండియన్ మసాలదినుసులు, మూలికల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్, అధికంగా ఉంటాయి. ఇవి స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తాయి, చర్మంను నునుపుగా , కాంతివంతంగా మార్చుతాయి.

మసాలాలు, పోపుదినుసుల్లో కూడా చర్మంను కాంతివంతంగా మార్చే శక్తిసార్థ్యాలున్నాయి. ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ ఉండవు. కాబట్టి, ఎటువంటి కష్టం లేకుండా ఈ ఇండియన్ స్సైసెస్ ను రెగ్యురల్ బ్యూటీకోసం ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ కూడా మన వంటగదిలో రెగ్యులర్ గా వాడేవే, కాబట్టి, మీకు అవసరమైనప్పుడు వీటిని బ్యూటీ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

కొన్ని సెలక్టివ్ మాసాలాలను తీసుకుని పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ గా వేసుకోవడమే , 15నుండి 20 రోజుల్లో చర్మంలో కొత్త మార్పులు, ప్రకాశవంతమైన చర్మంను పొందుతారు . వీటిలో అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంతో పాటు, ఏజింగ్ లక్షణాలు నివారించే గుణాలు కూడా అధికగా ఉన్నాయి . ఐతే అటువంటి స్పైసీస్ ఏంటో వాటి లక్షణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం...



అల్లం: 
రేడియంట్ స్కిన్ పొందడానికి ముఖానికి అల్లం వాడొచ్చు. చర్మం కాంతివంతంగా, స్కిన్ టోన్ మెరుగుపర్చడానికి ఏజ్ స్పాట్స్ తొలగించడానికి ఉపయోగపడే లక్షణాలు ఇందులో అధికంగా ఉన్నాయి, అల్లం పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిముషాలు వేసుకుని క్లీన్ చేసుకోవాలి.



బ్లాక్ పెప్పర్ : బ్లాక్ పెప్పర్ ముఖంలో బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, ఇది నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది, బ్లాక్ పెప్పర్ పౌడర్ లో కొద్దిగా పెరుగు చేర్చి స్మూత్ గా పేస్ట్ లా అయ్యాక ముఖానికి అప్లై చేసి 10 నిముషాలు తర్వాత కడిగేయాలి.
ముడతలను నివారించే హాట్ పెప్పర్ : 
ఫేషియల్ బ్యూటీని మెరుగుపరుచుకోవడానికి చిల్లీ, కేయాన్ పెప్పర్ వంటివి ఉపయోగించవచ్చు. హాట్ పెప్పర్ ను పేస్ట్ చేసి, ముకానికి , కళ్లక్రింద అప్లై చేయడం వల్ల ముడుతలు మాయమవుతాయి. చర్మం మరింత ఫెయిర్ గా కనబడుతుంది. హాట్ పెప్పర్ లో ఉండే విటమిన్ ఎ, సిలు చర్మంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను నివారిస్తుంది మరియు క్యాప్ససిన్ యువీ రేస్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.




పసుపు: 
పసుపును రెగ్యులర్ గా కూడా చర్మానికి అప్లై చేయవచ్చు. ఇతర స్కిన్ క్రీములను ఉపయోగించి ముఖ్యంగా బెడ్ టైమ్ స్కిన్ క్రీమ్ కు ఉపయోగించి ముఖాకిని అప్లై చేసుకోవచ్చు. లేదా పసుపు, పాలను మిశ్రమాన్ని రోజు రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేస్తే మంచి స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.


దాల్చిన చెక్క: 
ఇది చర్మానికి కావల్సిన న్యూట్రీసియన్స్, ఆక్సిజెన్ ను అందిస్తుంది, దాంతో చర్మం బ్రైట్ గా మెరుస్తూ కనబడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకుంటే, చర్మం చూడటానికి నేచురల్ బ్యూటీని సొంతం చేసుకుంటుంది,




లవంగాలు: 
లవంగాలను మెత్తగాపొడి చేసి, దానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, చర్మం క్లియర్ గా కనబడుతుంది.


మెంతులు: 
మెంతులను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి, ఉదయం దీన్ని పేస్ట్ లా తయారుచేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని, 15 నిముషాల తర్వాత గోరువెచ్చేనినీటితో శుభ్రం చేసుకుంటే చర్మం వయ్వనంగా కనిబడుతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్