తలకు గుమ్మడి విత్తనాల పేస్ట్ తో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!


గుమ్మడి విత్తనాల హెయిర్ ప్యాక్స్ ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఒకసారి ఈ ప్యాక్ అప్లై చేసి.. బెన్ఫిట్స్ చూస్తే.. మళ్లీ మళ్లీ అప్లై చేస్తారు. గుమ్మడి విత్తనాల హెయిర్ ప్యాక్ లో దాగున్న మ్యాజిక్ ఏంటో చూద్దాం.. 

ఇది స్కాల్ప్ కి పోషణ అందించి, జుట్టు పెరుగుదలను మెరుగుపరిచి, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేస్తుంది. అలాగే.. డాండ్రఫ్ ని నివారిస్తుంది. అంతేకాదు.. మీకున్న జుట్టు సమస్యలన్నింటినీ... చిటికెలో మాయం చేస్తుంది.. ఈ హెయిర్ ప్యాక్.

గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుని రిపేర్ చేస్తాయి. మాయిశ్చరైజర్ కోల్పోకుండా అడ్డుకుంటుంది. అలాగే ఫోలికల్స్ పోషకాలు గ్రహించేలా చేస్తుంది. అలాగే.. జుట్టు హైడ్రేట్ గా ఉండటానికి సహాయపడుతుంది. 
గుమ్మడిలో విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి స్కాల్ప్ కి రక్తప్రసరణ సజావుగా అందేలా సహాయపడతాయి. దీనివల్ల హెయిర్ గ్రోత్ మెరుగుపడుతుంది. మరి ఈ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం..


స్టెప్ 1 
గుమ్మడి విత్తనాలను ఎండలో 24గంటలు ఎండబెట్టి.. తర్వాత పౌడర్ చేసుకోవాలి. విత్తనాలకు బదులు.. బాగా పండిన గుమ్మడి కాయను కూడా ఉపయోగించుకోవచ్చు.

స్టెప్ 2 
సన్నని మంటపై 3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 10 చుక్కల రోజ్ ఆయిల్ కలిపి వేడి చేయాలి.

స్టెప్ 3 
5 నిమిషాలు వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. ఆయిల్ ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గుమ్మడి విత్తనాల పొడిని కలపాలి. ఫోర్క్ ఉపయోగించి.. బాగా కలిపి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి.



స్టెప్ 4 
ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. దీనివల్ల జుట్టు రాలిపోకుండా, చిట్లిపోకుండా ఉంటుంది.


స్టెప్ 5 
జుట్టుని చిన్న చిన్న పాయలుగా విడదీసి.. బ్రష్ ఉపయోగించి.. ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేయాలి. జుట్టుకి, స్కాల్ప్ కి మొత్తం పట్టించాలి.

స్టెప్ 6 
ఇప్పుడు జుట్టుని షవర్ క్యాప్ తో కవర్ చేసుకోవాలి. గంట తర్వాత.. మైల్డ్ క్లెన్సింగ్ షాంపూ ఉపయోగించి.. జుట్టుని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు.. మీ జుట్టు షైనీగా మారడం గమనించవచ్చు. అలాగే.. ఈ మాస్క్ జుట్టురాలడాన్ని అరికడుతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్