హై కొలెస్ట్రాల్ కరిగించే.. హైలీ ఎఫెక్టివ్ ఫుడ్స్
కొలెస్ట్రాల్ ధమనుల్లో పేరుకుంటుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లోకి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యమైన అవయవాలైన గుండె వంటి వాటికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ని కరిగించుకోవడానికి రెమిడీస
శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే.. అనేక తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని మనలో చాలామందికి తెలుసు. అయితే.. కొలెస్ట్రాల్ ని ఎఫెక్టివ్ గా, న్యాచురల్ రెమిడీస్ తో.. కూడా తగ్గించుకోవచ్చు. ఎలా ?
ఒకవేళ మీరు అన్ హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్కువగా తినడం, చాలా అరుదుగా వ్యాయామం చేయడం వంటి అలవాట్లు ఉంటే.. మీకు ఖచ్చితంగా.. హై కొలెస్ట్రాల్ రిస్క్ ఉంటుంది. అన్ హెల్తీ డైట్, ఫ్యాట్, షుగర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది.
కొలెస్ట్రాల్ ధమనుల్లో పేరుకుంటుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లోకి ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యమైన అవయవాలైన గుండె వంటి వాటికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ని కరిగించుకోవడానికి అద్భుతమైన హోం రెమిడీస్ మీకోసం...
ధనియాలు ధనియాలు.. కొలెస్ట్రాల్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒక టీస్పూన్ తాజా ధనియాల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి కాసేపు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండుసార్లు తాగితే.. కొలెస్ట్రాల్ కరిగిపోతుంది
ఉసిరి
ఒక టీస్పూన్ ఉసిరిపొడిని ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి ప్రతిరోజూ ఉదయం పరకడుపున తీసుకుంటే.. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.
ఆరంజ్ జ్యూస్ విటమిన్ సి,
ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఆరంజ్ జ్యూస్ ని రోజుకి రెండు మూడు సార్లు తీసుకుంటే.. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్
ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని.. ఒక గ్లాసు నీటిలో కలిపి.. రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. ఒకనెలలోనూ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడాన్ని గమనించవచ్చు.
తేనె, ఉల్లిరసం
ఒక టీస్పూన్ ఉల్లిపాయ రసం, ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. ఇది.. ఎఫెక్టివ్ గా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
ఓట్స్
కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి ఓట్స్ చక్కటి పరిష్కారం. ప్రతి రోజూ ఉదయం ఓట్స్ తీసుకుంటే.. ఫైబర్ పొందవచ్చు. ఇలా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
నట్స్ డ్రైఫ్రూట్స్..
ముఖ్యంగా వాల్ నట్స్, ఆల్మండ్స్ కొలెస్ట్రాల్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. నట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీటిని లిమిట్ గా తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
Comments
Post a Comment