సూపన్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి ఖర్జూరంతో ఫేస్ మాస్క్ ..!!

డేట్స్ ఫేస్ ప్యాక్ లో పవర్ ఫుల్ విటమిన్ బి 5 ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ ను స్కిన్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ ఎ, సి లు చర్మానికి మాయిశ్చరైజింగ

కర్జూరాల గురించి తెలియని వారుండరు, మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అంధించే సర్ ప్రైజింగ్ డ్రై ఫ్రూట్ ఖర్జూరం. డేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఈజిప్ట్ ప్రదేశాల్లో చాలా ఫేమస్. ఇందులో ఉండే అద్భుతమైన న్యూట్రీషియన్ విలువల వల్ల ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. డ్రైఫ్రూట్స్ లో బాగా ఫేమస్ అయినటువంటి ఈ ఫ్రూట్ లో నేచురల్ స్వీట్నెస్ కలిగి ఉంటుంది. అద్భుత పోషక విలువలుండటం చేత వీటిని వివిధ రకాల స్వీట్ డిష్ లలో జోడిస్తుంటారు.

ప్రెగ్నెన్సీ సమయంలో కర్జూరాలతో పొందే గ్రేట్ బెన్ఫిట్స్


డేట్స్ ఫేస్ ప్యాక్ లో పవర్ ఫుల్ విటమిన్ బి 5 ఉంటుంది. ఇది ఫ్రీరాడికల్స్ ను స్కిన్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ ఎ, సి లు చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. దాంతో చర్మం తేమగా, సపెల్ గా ...స్మూత్ గా ..అందంగా మారుతుంది. ఇంకా డేట్స్ లో ప్యాంటో థెనిక్ యాసిడ్స్, అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది . ఇంకా చర్మంలో కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా, కాంతివంతంగా మారుతుంది.

బరువు తగ్గించడంలో ఖర్జూరం చేసే మ్యాజిక్ హెర్బల్ రెడ్ డేట్స్ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంలో ఖచ్చితంగా మార్పులను గమనిస్తారు. ముఖ్యంగా మొటిమలు, మచ్చలు, ఫైన్ లైన్స్ వంటివి తొలగిపోయి, స్కిన్ టోన్ అద్భుతంగా మారుతుంది. ఖర్జూరం +పాలలో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!! చర్మంలో తప్పనిసరిగా మార్పులు తీసుకురావడానికి, దీర్ఘకాలం చర్మం కాంతివంతంగా కనబడుటకు డైలీ డైట్ లో కూడా ఎండు ఖర్జూరాలను చేర్చుకోవాలి. చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడం కోసం డ్రై డేట్స్ ను ఏవిధంగా ఉపయోగించాలో ఈ క్రింది విధంగా తెలుపబడినది.


స్టెప్ 1 : 
ఎండు ఖర్జూరాలను 3, 5 తీసుకుని, అందులో విత్తనాలను తొలగించాలి. డేట్స్ లో చాలా సులభంగా డస్ట్ చేరుతుంది. కాబట్టి, నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలి.


స్టెప్ 2: 
అరకప్పు పాలను బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, అందులో విత్తనాలు తొలగించి కడిగి పెట్టుకున్న ఖర్జూరాలను పాలలో వేసి, ఒక గంట సేపే మెత్తగా నానబెట్టాలి.


స్టెప్ 3: 
డేట్స్ కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు చేర్చి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.


స్టెప్ 4: 
తర్వాత ఈ పేస్ట్ లో కొద్దిగా సూజి లేదా సన్న రవ్వ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇది గ్రెయినీ పెస్ట్ లా తయారవుతుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనె , కొన్ని చుక్కల ప్రైమ్ రోజ్ ఆయిల్ మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమం కలగలిసే వరకూ బ్లెండ్ చేయాలి.


స్టెప్ 5 : 
ఫేస్ ప్యాక్ సిద్దం చేసి పెట్టుకున్న తర్వాత క్లెన్సర్ తో ముఖంను శుభ్రం చేసుకోవాలి. తర్వాత పేస్ట్ ను ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ డేట్స్ ఫేస్ ప్యాక్ ను అరగంట అలాగే ఉండనివ్వాలి.


స్టెప్ 6: 
అరగంట తర్వాత కొద్దిగా నీళ్ళు తీసుకుని, చర్మం మీద చిలకరించుకోవాలి. ప్యాక్ కొద్దిగా వదులవుతున్నప్పుడు, చేతి వేళ్ళతో సున్నితంగా సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేసి, ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసి కడిగేసు కోవాలి. రెడ్ డేట్స్ ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తూ కనబడుతుంది . స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్