విటమిన్ బి12 తో జుట్టు సమస్యలన్నీ మాయం..!!

చర్మం మరియు జుట్టుకు సంరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. హెల్తీ లైఫ్ కోసం సరైన పోషకాలను ఏవిధంగా తీసుకోవాలన్న విషయంలో అవగాహన, ఏకాగ్రతను కలిగి ఉండాలి. 

మానవ శరీరానికి వివిధ రకాల విటమిన్స్ అవసరం అవుతాయి. అలాంటి విటమిన్స్ లో విటమిన్ బి12 కూడా ఒకటి . కొన్ని రకాల విటమిన్స్ శరీరంలో జీవక్రియలు ఆరోగ్యంగా , సహజంగా జరగడానికి సహాయపడుతుంది. 

విటమిన్ బి12ల్లో కోబాల్మిన్ , ఇతర న్యూట్రీషియన్స్, అధికంగా ఉన్నాయి.ఇవి శరీరానికి అత్యధికంగా అవసరం అవుతాయి. శరీరానికి మాత్రమేకాదు, జుట్టు, చర్మ ఆరోగ్యంలో కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. విటమిన్ 12 జుట్టుకు మరియు అందానికి ఏవిధంగా సహాయపడుతాయన్న విషయాన్ని ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది, వాటి మీద మీరు కూడా ఓ కన్నేయండి...


1. నిర్జీవమైన చర్మంను నివారిస్తుంది: 
విటమిన్ బి 12 డల్ గా మరియు డ్రైగా మారిన చర్మాన్ని నివారిస్తుంది. డ్రైఅండ్ డల్ స్కిన్ కు ముఖ్యకారణం విటమిన్ బి12లోపించడం వల్ల. కాబట్టి, విటిమన్ బి12 అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల చర్మంను హైడ్రేషన్ లో ఉంచుతుంది, చర్మానికి తగిన మాయిశ్చరైజింగ్ను అందిస్తుంది. స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. చర్మంలో ముడతలను నివాిరసరిస్తుంది.


2. డ్యామేజ్ అయిన చర్మాన్ని నయం చేస్తుంది: 
శరీరానికి సరిపోయే విటమిన్ బి12 రెగ్యులర్ గా తీసుకుంటుంటే, డ్యామేజ్ అయిన చర్మంను నయం చేస్తుంది. తాజాగా, స్వచ్చమైన చర్మాన్ని అందిస్తుంది.

3. పేల్ స్కిన్ నివారిస్తుంది: 
విటమిన్ బి 12 శరీరంలో సెల్స్ ఏర్పడుటకు సమయాపడుతుంది. కణాలకు జీవం పోస్తుంది. పేల్ స్కిన్ ఉన్నవారు విటమిన్ బి12 తీసుకోవాలని సూచిస్తున్నారు , ఇది ఇన్నర్ గ్లోను పెంచుతుంది. ఎవరైనా సరే విటమిన్ బి12లోపం 70శాతం మంది బాధపడుతున్నారు.


4. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది: 
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే విటమిన్ బి12 లోపం లేకుండా రెగ్యులర్ డైట్ లో విటమిన్ బి12 పదార్థాలను నింపేయాలి. ఇది యూత్ ఫుల్ స్కిన్ ను అందిస్తుంది, విటమిన్ బి12 ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ముడుతలను మాయం చేస్తుంది.

5. ఎగ్జిమా, విటిలిగోను నివారిస్తుంది: 
విటమిన్ బి12 ఎగ్జిమాను పూర్తిగా నివారిస్తుంది. దానిికి సంబంధించిన వైరస్ ను కూడా శరీరంలో నాశనం చేస్తుంది. రెగ్యులర్ డైట్ లో సరిపడా విటమిన్ బి12 ఫుడ్ ను తీసుకుంటుంటే విటలిగోను నివారిస్తుంది. విటలిగో ఒక చర్మ వ్యాధి, చర్మ మీద తెల్లగా మచ్చలు ఏర్పడుతాయి.


6. బలంగా , హెల్తీగా ఉండే గోళ్ళు పెరుగుటకు: 
60శాతం మంది చిట్లిన లేదా వీక్ గా మారిన గోళ్ళతో బాధపడుతుంటారు,ఇది విటమిన్ బి12 లోపం వల్ల ఇలా జరుగుతుంది. ఆరోగ్యకరమైన , బలమైన గోళ్ళు పెరడానికి రెగ్యులర్ డైట్ లో విటమిన్ బి12 అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.


7. జుట్టు రాలడం నివారిస్తుంది: 
విటమిన్ బి12 శరీరానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా చాలా అవసరం. ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ లాస్ ను నివారిస్తుంది, విటమిన్ బి12 లోపం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ కు పోషణ సరిగా అందకపోవడం వల్ల జుట్టు రాలడం, జుట్టు పెరుగదలను అడ్డుకోవడం జరుగుతుంది.

8. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: 
జుట్టు రాలడం , జుట్టు సరిగా పెరగకపోవడం వంటి లక్షణాలు కనబడుతుంటే, విటమిన్ బి12 అదికంగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వీటి ద్వారా జుట్టుకు సహాయపడే ప్రోటీన్స్ అందుతాయి. కోల్పోయిన జుట్టును తిరిగి పెరడగానికి సహాయపడుతాయి.


9. హెయిర్ పిగ్మెంటేషన్ ప్రోత్సహిస్తుంది: 
అమినో యాసిడ్స్ లోని మెలనిన్, దీన్నే టైరోసిన్ అని కూడా పిలుస్తారు. ఇది హెయిర్ పిగ్మెంటేషన్ ప్రోత్సహిస్తుంది. దాంతో హెయిర్ కలర్ పెరుగుతుంది. విటమిన్ బి12 ఎక్కువగా తీసుకోవడం వల్ల మెలనిన్ మెరుగుపడి, ఒరిజినల్ హెయిర్ కలర్ ను మెయింటైన్ చేస్తుంది.

10.హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్: 
విటమిన్ బి12 సరైన ప్రోటీన్స్ ను విటమిన్స్ ను ప్రోత్సహిస్తుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. నాడీవ్యవస్థ స్ట్రాంగ్ గా ఉంటుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్