కంటి కింద నల్లటి వలయాలకు.. తేనె, పాలు, ఓట్స్ పేస్టును?

కంటి కింద నల్లటి వలయాలకు.. తేనె, పాలు, ఓట్స్ పేస్టును?


కళ్లజోడు ధరిస్తున్నారా? తద్వారా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయా? అయితే ఇలా చేయండి. కీరదోసను గుజ్జుగా చేసి నల్లటి వలయాలు ఏర్పడిన చోట పూతలో పూస్తే.. మంచి ఫలితం లభిస్తుంది. అంతేగాకుండా కీరదోస రసంలో టమోటా, బంగాళాదుంపల రసం కలిపి ముక్కుపై పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. నిమ్మరసంలో రెండు, మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి ముక్కుకిరువైపులా రాయాలి. రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది. 

ఇకపోతే.. తేనెలో కొద్దిగా పాలు, ఓట్స్ వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మచ్చలు పడిన భాగంగా రాసుకోవాలి. దీనివల్ల సమస్య తగ్గడంతో పాటు చర్మం తాజాగా మారుతుంది. రాత్రిళ్లు బాదం నూనెను ముక్కుకిరువైపులా రాసి నెమ్మదిగా మర్ధన చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కళ్లజోడు పెట్టుకున్న ప్రాంతంలో ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్