మళ్లీమళ్లీ వేడి చేస్తే ఏమవుతుంది?
మళ్లీమళ్లీ వేడి చేస్తే ఏమవుతుంది?
ఉదయంపూట అల్పాహారం అవసరంలేదు.. చిరుతిళ్లు నోరూరించేలా ఉండాలి... అని కొందరు ఆలోచిస్తే రోజూ వ్యాయామం అవసరంలేదు.. పచ్చళ్లు లేనిదే ముద్ద దిగదు.. అని చెబుతుంటారు మరికొందరు. వాటిల్లో వాస్తవాలు ఏంటీ.. అసలు అన్నివయసుల మహిళలూ ఆహారపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇవిగో అలాంటి సందేహాలకి సమాధానాలే ఇవన్నీ!
ఉదయం అల్పాహారం తీసుకోకపోతే ఏమవుతుంది?
పొద్దున్నే నిద్రలేచిన తరవాత గంటా, గంటన్నర లోపు ఏదో ఒకటి తినాలి. చాలామంది పనులన్నీ పూర్తయ్యాకే ఏదో ఒకటి తినాలనుకుంటారు. వంటా, పిల్లల్నీ తయారు చేసి.. పూజతో సహా మిగిలిన పనులు పూర్తి చేసుకునేసరికి నీరసం వచ్చేస్తుంది. దాంతో ఏకంగా భోజనం కానిచ్చేస్తారు. దానివల్ల ఎక్కువ తినాల్సి వస్తుంది. ఇలా అతిగా తినడం ఆహారం కొవ్వుగా మారి బరువు పెరిగిపోతారు.
ఎలాంటి అల్పాహారం: ఉదయంపూట పనులు ఉంటాయి కాబట్టి పిండిపదార్థాలూ, ఆరోగ్యకరమైన కొవ్వులు లభించేలా చూసుకోవాలి. అంటే పాలూ, పాల పదార్థాలూ, ఇడ్లీ, దోశా, పెసరట్టూ, ఉప్మా, బ్రెడ్ ఆమ్లెట్ వంటివి ఎంచుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. మాంసకృత్తులూ, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి వంటి పోషకాలన్నీ అందుతాయి.
ఏవో ఒకటి తినేయడం.. మిగిలినవి ఫ్రిజ్‌లో పెట్టుకుని మర్నాడు వేడి చేసుకోవడం సరైందేనా?
కొందరు మిగిలింది మాత్రమే తిని సరిపెట్టుకుంటారు. మరికొందరు తాము రోజూ తీసుకునే దానితోపాటు ఆ మిగిలింది పడేయకుండా తినేస్తుంటారు. మొదటి దానివల్ల తిన్నది సరిపోదు. నీరసం వస్తుంది. రెండో దానివల్ల అతిగా తినే అస్కారముంటుంది. బరువు పెరుగుతారు. అన్నం, కూరలూ, చపాతీలూ, ఇతర అల్పాహారాలే మిగులుతాయి. అలాంటివి తినడం వల్ల కావల్సిన పోషకాలు శరీరానికి అందవు. అందుకే ఏదో ఒకటని కాకుండా.. ఎంచుకునే పదార్థాల్లో విటమిన్లూ, ఖనిజాలూ, పీచు వంటివి అందేలా చూసుకోవాలి.
వేడి చేస్తుంటే: వాస్తవానికి మిగిలిన పదార్థాలను మర్నాడు తినడం వల్ల వాటిమీద సూక్ష్మజీవులు పేరుకొంటాయి. అవి రకరకాల అనారోగ్యాలకు కారణమవుతాయి. ఒక వేళ్ల మళ్లీ మళ్లీ వేడి చేస్తే సూక్ష్మపోషకాలన్నీ పోతాయి. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల పొట్టలోకి కెలొరీలు వెళ్లిపోతాయి తప్ప ప్రయోజన ఉండదు.
తినే సమయాన్ని ఎలా విభజించుకోవాలి. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి.
ఎప్పుడైనా సరే.. ఆకలిగా అనిపించినప్పుడు తిందాం అనే భావన సరికాదు. రోజంతా అప్పుడప్పుడూ పోషకాహారం తీసుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి. దానికి శాస్త్రీయంగా ఏమీ సమయ విభజన ఉండదు. పండ్లూ, కూరగాయ ముక్కలు తరిగి ఫ్రిజ్‌లో పెట్టుకుని సమయం ఉన్నప్పుడు తింటూ ఉండాలి. రాగి, తృణధాన్యాల పిండితో చేసిన జావ ముందుగా తయారు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. వీటిని ఏ సమయంలోనైనా తాగొచ్చు. అలానే ఉడికించిన మొక్కజొన్నలూ, పల్లీలూ, పండ్ల ముక్కలూ, కీరా, క్యారెట్, టొమాటో వంటివి తినేయొచ్చు.
మధ్యాహ్నం నిద్రపోతే ఏమవుతుంది.?
భోజనం తరవాత ఓ కునుకు మంచిదే అదే గంటలు గంటలు అయితేనే కష్టం. జీర్ణవ్యవస్థ పనితీరుపై ఆ ప్రభావం పడుతుంది. త్వరగా అరగదు. సాధారణంగా మహిళలు ఇంట్లో పనులన్నీ చేసుకుని నీరసపడిపోతుంటారు. మధ్యాహ్నం పూట కాస్త ఎక్కువగా తింటారు. ఇలా చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. దాంతో నిద్ర వచ్చేస్తుంది. అందుకే వేళకు అల్పాహారం తిని భోజనానికి ముందు కూడా ఏదైనా కాస్త తీసుకోవాలి. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తీసుకోవాలి. పొట్టనిండా తినడం కాకుండా ఆకలి తీరే వరకూ తినాలి అనే నియమం పెట్టుకోవాలి.
అలా తింటే కొవ్వు సమస్య ఉంటుందా?
అది నిజమే. చాలామంది మహిళలు టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనే స్పృహ ఉండదు. దీనివల్ల అదనపు కెలొరీలు లోపలికి వెళ్లిపోతాయి. మనసు అదుపులో లేకుండా తినడం (మైండ్‌లెస్ ఈటింగ్) వల్ల తీసుకున్నది కొవ్వుగా మారుతుంది. అందుకే తినేప్పుడు టీవీ చూడటం, ఫోన్లు మాట్లాడుకోవడం వంటివి మంచిదికాదు.
ప్రతిరోజూ పచ్చళ్లూ తినొచ్చా?
ఇలా చేయడం వల్ల అన్నం ఎక్కువగా తింటారు.. ఉప్పూ, నూనెలూ, పిండిపదార్థాల శాతం అధికంగా అందుతుంది. ఇలా నిత్యం చేస్తుంటే రక్తపోటు పెరుగుతుంది. బీపీ ఉన్నవాళ్లు, గర్భిణులు వీటి జోలికి వెళ్లకపోవడం మంచిది. అప్పుడప్పుడు అయితే తినొచ్చు.
రుచి కోసం నూనె ఎక్కువ వేస్తుంటే..
ఇదీ బరువు పెరగడానికి కారణమవుతుంది. కూరలు చేసేటప్పుడు కాస్త సమయం కేటాయించడం మంచిది. హడావుడి లేకుండా తక్కువ మంటపై వండాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు పోవు. నూనె కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఇక వండుతున్నంతసేపూ మూత పెట్టడం మంచిది.
గృహిణులకు వ్యాయామం అవసరమా?
తప్పకుండా అవసరమే. వంట చేస్తున్నప్పుడూ, గిన్నెలు తోముతున్నప్పుడూ, కూరగాయలు తరుగుతున్నప్పుడు నిల్చొని ఉంటారు. దానివల్ల కొంతవరకూ కదలిక ఉన్నా కూడా వ్యాయామం తప్పనిసరి. కాబట్టి రోజులో కనీసం అరగంట అయినా వేగంగా నడవాలి. కానీ తిన్న వెంటనే నడవడం సరికాదు.
చిరుతిండికోసం ఎలాంటివి ఎంచుకోవాలి?
రకరకాల మిఠాయిలూ, కేకులూ, జంతికలు చేసి చాలామంది మహిళలు నిల్వ చేస్తుంటారు. ఇంటిల్లిపాదికీ పెట్టేసి తామూ తింటూ ఉంటారు. ఇలా నూనెలూ, చక్కెరతో చేసినవి అతిగా తినడం సరికాదు. వాటికి బదులు, పండ్లూ, పండ్ల రసాలూ, మొలకలూ, ధాన్యాలతో చేసిన చాట్, పచ్చికూరగాయలు ఎంచుకోవాలి. వీటివల్ల బరువు కూడా పెరగరు. ఆరోగ్యానికీ మంచిది. ఈరోజుల్లో అన్ని వయసుల వారి జీవనశైలిలో మార్పులు వచ్చాయి. శారీరక శ్రమ తగ్గింది. కాబట్టి అలాంటి చిరుతిళ్లు లేకుండా సమతులాహారం తీసుకుంటూ.. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్నీ చూసుకోవడం మంచిది.

Comments
Post a Comment