మెడ నొప్పా.. Just click
మెడ నొప్పా.. బ్యాగు సరిగ్గా వేసుకోండి
రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే చిన్నపాటి పొరపాట్లే మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఇంతకీ అలాంటి పొరపాట్లేంటో చూద్దాం..
* మనలో చాలామంది స్మార్ట్‌ఫోను లేకుండా ఐదునిమిషాలు కూడా ఉండలేరు. అయితే దాన్ని వాడుతున్నంత సేపూ తలదించుకునే ఉంటాం. దాంతో మెడా, భుజాలూ నొప్పి పుడతాయి. అలా కాకుండా ఫోనుని మన కంటికి సమాంతరంగా ఉంచుకుని చూస్తే ఏ నొప్పులూ బాధించవు.
* కాలేజీకెళ్లే అమ్మాయిలూ, ఉద్యోగినులూ బ్యాక్‌ప్యాక్స్‌ని ఒక భుజానికే వేసుకుంటారు. దాంతో ఆ భాగం ఒక్క భుజంపైనే పడుతుంది. క్రమంగా భుజం, మెడా, వెన్ను నొప్పులు మొదలవుతాయి. అందుకే దాన్ని రెండు భుజాలకీ వేసుకోవడంతోపాటూ తప్పనిసరిగా ఆ బ్యాగు పట్టీలను బిగుతుగా పెట్టుకోవాలి. బ్యాగు జారిపోతున్నట్టుగా కాకుండా పైకి ఉండాలి. అప్పుడే సమస్యలు ఎదురుకావు.
* కొంతమంది దిండుని సరిగా ఎంపిక చేసుకోరు. మరీ పల్చగా ఉండేవాటిని వాడతారు లేదంటే బాగా ఎత్తైన దిండ్లని ఎంచుకుంటారు. దీనివల్ల వెన్నెముకకి ఇబ్బంది. దీర్ఘకాలం ఇలానే పడుకుంటే వెన్నెముక, మెడపై భారం పడుతుందని మరవకూడదు.
* వెల్లకిలా, బోర్లా ఈ రెండూ నిద్రపోవడానికి సరైన విధానాలు కావు.. ఒక పక్కకు ఒత్తిగిలి పడుకోవడం మంచి పద్ధతి.
* బరువుని ఎత్తేటప్పుడు వంగిపోయి అమాంతం ఎత్తడం కూడా మనలో చాలామంది చేసేదే. దీనివల్ల నడుము పట్టేస్తుంది. అలా కాకుండా మోకాళ్ల మీద కూర్చుని నిదానంగా, అదును చూసుకుని ఎత్తాలి.
* కంప్యూటర్ ముందు కూర్చీలో కూర్చుంటే...మరీ ముందుకు వంగికానీ, మరీ వెనక్కి కానీ కూర్చోకూడదు. నిటారుగా, ఆ తెరకు ఎదురుగా కూర్చోవడం అలవాటుగా మార్చుకోవాలి.
Comments
Post a Comment