అపోహలు వదిలేద్దాం..


అపోహలు వదిలేద్దాం..
వ్యాయామం చేయాలి... ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే చాలామంది మహిళలకి రకరకాల అపోహలు ఉంటాయి. అసలు వాటిల్లో వాస్తవాలేంటో చూద్దాం.

అపోహ: వ్యాయామం చేస్తూ.. ఉన్నట్టుండి ఆపేస్తే లావైపోతామా? 
వాస్తవం: నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేస్తున్నప్పుడు వారి సలహామేరకు ఆహారం తీసుకోవడం జరుగుతుంది. వ్యాయామం ఆపేసినప్పుడు అంతమొత్తంలో ఆహారం తీసుకోకూడదు. అలా కాకుండా దాన్ని ఆపేసి..శరీరం కోరుకున్నదానికంటే ఎక్కువ ఆహారం తీసుకుంటే కచ్చితంగా బరువు పెరుగుతారు. కాబట్టి ఎలాంటి సాధనలు చేయనప్పుడు ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే బరువు అదుపులో ఉంటుంది.
అపోహ: నెలసరి సమయంలో వ్యాయామాలు చేయకూడదా? 
వాస్తవం: చాలామందికి ఈ సమయంలో రకరకాల నొప్పులూ, చిరాకూ, అలసటా లాంటివి ఉంటాయి. వాటిని అధిగమించాలంటే ముందునుంచీ వ్యాయామం చేయాలి. కావాలనుకుంటే శరీరం అతిగా అలసిపోకుండా కొద్దిదూరం నడవొచ్చు. ధ్యానం చేయొచ్చు. కాబట్టి మొత్తానికే మానేయాల్సిన పనిలేదు.
అపోహ: ఎక్కువ బరువులు మోస్తేనే త్వరగా బరువు తగ్గుతామా? 
వాస్తవం: అలా ఏమీ ఉండదు. సామర్థ్యాన్ని బట్టి బరువులు ఎంచుకోవాలి. పదిహేను సార్లు డంబెల్స్‌ ఎత్తొచ్చు. మనకు సరిపోయే వెయిట్లతోనూ రకరకాల వ్యాయామాలు చేయొచ్చు. అయితే ఇలాంటి సాధనలు ఎంచుకున్నప్పుడు మాంసకృత్తులు అధికంగా లభించే ఆహారం మీద దృష్టి పెట్టాలి.
అపోహ: సన్నగా ఉన్న మహిళలు వ్యాయామం చేయకూడదా? 
వాస్తవం: సన్నగా ఉన్నవారు ఏదైనా వ్యాయామం చేస్తుంటే నీకెందుకు బరువు తగ్గాల్సిన అవసరం లేదుగా అని చాలామంది అంటారు. నిజానికి లావుగా ఉన్నా.. సన్నగా ఉన్నా ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరం. వీటివల్ల శక్తి వస్తుంది. శరీరం సౌకర్యంగా, చురుగ్గా మారుతుంది. వ్యాయామాలు అనేవి కేవలం బరువు తగ్గించడానికే కాదు.. ఆరోగ్యానికి కూడా. సన్నగా ఉన్నావారు కొవ్వు తగ్గేవి కాకుండా.. వివిధ రకాల ప్రక్రియల్ని ఎంపిక చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్