ముల్తానీ పూతతో..ముత్యంలా!



ముల్తానీ పూతతో..ముత్యంలా!
ముల్తానీమట్టి ముఖాన్ని సహజంగా మెరిపించడమే కాదు.. కొన్ని రకాల చర్మ సమస్యల్నీ సులువుగా నివారిస్తుంది. మరి దాన్ని ఎలా వాడాలంటే..


రెండు చెంచాల ముల్తానీమట్టికి రెండు చెంచాల గులాబీనీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఈ పూత ముఖంపై అధికంగా పేరుకుపోయిన జిడ్డుని తొలగిస్తుంది.
* నాలుగు చెంచాల ముల్తానీమట్టిలో చెంచా పాలు, రెండు మూడు బాదం గింజల ముద్ద వేసి మెత్తగా చేయాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి ఆరనిచ్చి కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
* రెండు చెంచాల టొమాటో గుజ్జూ, చెంచా చొప్పున ముల్తానీ మట్టీ, గంధం పొడీ, పసుపూ తీసుకుని అన్నింటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రెండురోజులకోసారి చేస్తుంటే చర్మంపై పేరుకున్న మచ్చలు పోతాయి.
* మూడు చెంచాల ముల్తానీ మట్టికి చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, అరచెంచా పాలు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. వారానికోసారి ఈ పూత వేస్తుంటే ముఖం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది.
* చెంచా చొప్పున ముల్తానీ మట్టీ, పుదీనా ఆకుల పొడీ, పెరుగూ వేసి అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని మచ్చలున్న చోట రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మొటిమల తాలుకూ మచ్చల్ని పోగొడుతుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్