పెరుగు, పసుపు, బీట్‌రూట్ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

బీట్‌రూట్‌లో సౌందర్యానికి వన్నె తెచ్చే ఎన్నో గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీట్‌రూట్ గుజ్జులో నాలుగు చుక్కల బాదం నూనె, చెంచా ఆలివ్ నూనె వేసి ముఖానికి మర్దన చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అలాగే అరకప్పు పెరుగులో చిటికెడు పసుపూ, కొద్దిగా బీట్‌రూట్ గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం కాంతిమంతమవుతుంది.
బీట్‌రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలూ దూరమవుతాయి. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
బీట్‌రూట్ రసం, కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలను శుభ్రం చేస్తుంది. అదే బీట్‌రూట్ రసంలో నిమ్మరసం కలిపి రాసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య దూరమవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.

Comments
Post a Comment