ఎండల నుండి చర్మ నల్లగా మారకుండా..రక్షణ కల్పించే వాటర్ మెలోన్

పుచ్చకాయ వల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చుననే విషయం మీకు తెలుసా..?పుచ్చకాయ వల్ల అందం, ఆరోగ్య లాభాలు రెండూ కలుగుతాయి. పుచ్చకాయలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసినంత దాని సౌందర్య ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియవు.

వేసవికాలంలో విరివిగా లభించే పళ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. వేసవి వేడిమికి చెక్‌ పెడుతూ శరీరానికి చల్లదనాన్ని చేకూర్చే ఈ పండు వల్ల కేవలం ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాదు...సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి, ఆ ప్రయోజనాలు ఏంటి? వాటిని ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ టిప్స్‌ తెలుసుకోవాలి.


పుచ్చకాయలోని 92 శాతం నీరు ఉంటుంది. ఇది తినడం ద్వారా వేసవిలో శరీరం నుంచి పోయే నీటిశాతాన్ని తిరిగి పునరుద్దరించుకోవచ్చు. ఫలితంగా చర్మం తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో ఉండే గింజల వల్ల కూడా చాలా సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయి. చర్మాన్ని సున్నితంగా చేసి, మాయిశ్చరైజ్‌ చేయడంలో వీటిని మించినవి లేవంటే అతిశయోక్తి కాదు. పుచ్చకాయ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు...

టోనర్‌గా పనిచేస్తుంది:
వాటర్‌ మెలోన్‌ చర్మానికి సహజసిద్దమైన టోనర్‌గా పనిచేస్తుంది. ఒక చిన్న పుచ్చకాయ ముక్కని కోసి నేరుగా చర్మం మీద రుద్దచ్చు. లేదంటే తేనెతో కలిపి మెత్తని ముద్దగా చేసుకుని ఆ మిశ్రమంతో కూడా చర్మానికి మృదువుగా మర్దన చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం ప్రకాశించడమే కాకుండా నునుపుగా కూడా మారుతుంది.

మొటిమలు తగ్గడానికి:
వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత వల్ల ఎక్కువగా చెమటలు పట్టడం, చర్మం జిడ్డుగా మారడం వంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే వీటి వల్ల మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొటిమలు తగ్గించడంలో కూడా పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందు ముఖం బాగా శుభ్రం చేసుకోవాలి. పుచ్చకాయ రసంలో ముంచిన దూదితో ముఖమంతా ఈ రసాన్ని అప్లై చేసుకోవాలి. 15నిముషాల తరువాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.


సూర్యరశ్మి నుండి:
సూర్యరశ్మి నుండి చర్మానికి ఎలాంటి హానీ జరగకుండా కూడా పుచ్చకాయ సంరక్షిస్తుంది. దీనికోసం పుచ్చకాయ, దోసకాయ గుజ్జును సమపాళ్లలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేవలం సూర్యరశ్మి వల్ల మండే చర్మం నుంచి ఉపశమనం పొందడమే కాదు…చర్మం ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

వృద్దాప్యఛాయలు కనిపించకుండా:
పుచ్చకాయలో అధికమెత్తంలో ఉండే లైకోఫిన్‌, సి, ఎ విటమిన్లు చర్మంపై ఏర్పడే సన్నని గీతలు కనిపించకుండా చేస్తాయి. అలాగే చర్మం ముడతలు పడకుండా చేసి వృద్దాప్యఛాయల్ని కనిపించకుండా చేస్తాయి. దీన్ని రోజూ చర్మానికి రాసుకున్నా లేదా ఆహారంలో భాగంగా తీసుకున్నా మరిన్నిచక్కని ఫలితాల్ని పొందవచ్చు..



చర్మానికి కావల్సినంత తేమను అందిస్తుంది:
వాటర్ మెలోన్ జ్యూసీ ఫ్రూట్ కాబట్టి శరీరాన్ని ఎప్పడూ తేమగా ఉంచుతుంది. మీరు కనక పొడి చర్మంతో బాధపడుతున్నట్లైతే వాటర్ మెలోన్ మీద తేనె చిలకరించి ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల ముఖం డల్ గా మరియు డ్రైగా ఉంచుతుంది. కాట్టి ఈ జ్యూస్ రెడ్ ఫ్రూట్ ను మీ డైలీ డైయట్ లో చేర్చుకోండి.

ఆయిల్ చర్మాన్ని తొలగిస్తుంది :
ఇందులో ఉండే విటమిన్ ఎ చర్మలోపల ఉన్న నూనె మగ్రంధులను తగ్గిస్తుంది. దాంతో ముఖంలో జిడ్డు కూడా తగ్గి ముఖం తాజాగా ఉంటుంది.

అలసిన చర్మానికి స్వాంతన:
ఎండన పడి తిరిగి ఇంటికి వచ్చాక చర్మం అలసిపోయి.. కళ తప్పుతుంది. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన పుచ్చకాయ ముక్కల్ని మెత్తగా మెదిపి.. ముఖానికి మర్దన చేసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. దీంతో అలసిన చర్మానికి చల్లదనంతోపాటూ సాంత్వనా లభిస్తుంది.

 డ్రై స్కిన్ నివారిస్తాయి:
రెండు చెంచాల పుచ్చకాయ గుజ్జులో కొద్దిగా పెరుగు చేర్చాలి. ముఖాన్ని చల్లటి నీళ్లతో కడుక్కున్నాక ఈ గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే.. కళ తప్పిన చర్మం కాంతిమంతంగా మారుతుంది. పొడిబారిన చర్మానికి ఈ పదార్థాలు రెండూ తేమనందిస్తాయి.

సాప్ట్ స్కిన్ కోసం :
రెండు చెంచాల పుచ్చగుజ్జులో చెంచా తేనె చేర్చాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ మర్దన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే.. చర్మం మృదువుగా మారుతుంది.
అలాగే గుప్పెడు పుదీనా ఆకుల్ని మెత్తగా చేసి.. అందులో నాలుగైదు చెంచాల పుచ్చకాయ రసం చేర్చి ఐస్‌ట్రేలలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఐసుముక్కలుగా మారాక వాటిని బయటకు తీసి చర్మం మీద మృదువుగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల తెరుచుకున్న గ్రంథులు మూసుకుపోయి.. చర్మం నునుపుదేలుతుంది.



స్క్రబ్బింగ్‌: పుచ్చకాయ గుజ్జులో కొద్దిగా శెనగపిండి మిక్స్‌ చేసి, ముఖానికి అప్లై చేసుకుంటే చక్కని స్క్రబ్బింగ్‌లా పనిచేస్తుంది.
బ్లాక్‌ హెడ్స్‌:
చర్మ రక్షణలో బాగంగా ముఖం, ముక్కు మీద ఏర్పడే బ్లాక్‌ హెడ్స్‌ ను తొలగించడం సహాయపడుతుంది.









Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్