ఫర్ఫెక్ట్ క్లియర్ స్కిన్ పొందడానికి 10 సింపుల్ స్టెప్స్ ..!!


పర్ఫెక్ట్ స్కిన్, రేడియంట్ స్కిన్ పొందడం అంటే అంత సులభం కాదు. అందుకు మన చేతుల్లో మంత్రం లేదు, మ్యాజిక్ లేదు. కొంత సమయం, శ్రమ పెడితే తప్పకుండా అటువంటి ఫర్ఫెక్ట్ స్కిన్ పొందుతారు. అందుకు ఖచ్చితమైన నిర్ణయాలు, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. చర్మం క్లియర్ గా, రేడియంట్ గా కనబడాలంటే కొన్ని సింపుల్ బేసిక్ రూల్స్ పాటించక తప్పదు. అటువంటి సింపుల్ టిప్స్ ను ఈ క్రింది విధంగా తెలుపుతున్నాము. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితే చాలు. పర్ఫెక్ట్ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు !




మంచి నిద్ర: 

శరీరానికి ఎలాగైతే విశ్రాంతి అవసరమో, అదే విధంగా చర్మానికి కూడా విశ్రాంతి అవసరం. సరైన విశ్రాంతి తీసుకోకపోతే చర్మం నిర్జీవం, అలసట, డల్ గా కనబడుతుంది, కాబట్టి, రోజుకు కనీసం 8 గంటలు నిద్ర తప్పనిసరి.




వ్యాయామం: 

మంచి నిద్రతో పాటు, వ్యాయామం కూడా అవసరం. స్కిన్ ఎలాసిటి మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం అద్భుతంగా సహాయపడుతుంది. రోజూ 20 నిముషాలు వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే శరీరంలోని అన్ని బాగాలతో పాటు, చర్మానికి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దాంతో చర్మం పుష్టిగా , గ్లోయింగ్ స్కిన్ తో మెరుస్తుంటుంది. అది వ్యాయామం వల్ల సాధ్యం అవుతుంది.




ఆవిరిపట్టడం: 

శరీరానికి శ్రమ కలిగించడంతో పాటు, చెమటలు పట్టించడం వల్ల చర్మ రంద్రాలు తెరచుకుని, చర్మం లోపలి నుండి శుభ్రం కావడంతో చర్మం క్లియర్ గా, ఫర్ఫెక్ట్ గా ఉంటుంది.




ఎక్స్ ఫ్లోయేట్ : 

ఒక సారి చర్మ రంద్రాలు తెరచుకున్నప్పుడు వాల్ నట్, ఆప్రికాట్ వంటి ఫ్రూట్స్ తో స్క్రబ్చేయడం వల్ల చర్మం ఎక్స్ ఫ్లోయేట్ అవుతుంది. చర్మంలోని మురికి, ఇతర మలినాలు, డెడ్ స్కిన్ సెల్స్ పూర్తిగా తొలగిపోతాయి. స్క్రబ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి




క్లెన్సింగ్ : 

స్కిన్ ఎక్సఫ్లోయేషన్ వల్ల చర్మం కాస్త రఫ్ గా మారొచ్చు, అందుకు స్మూత్ గా మార్చుకోవడానికి మన్నికైన క్లెన్సర్ ను ముఖానికి ఉపయోగించి శుభ్రం చేసుకోవడం మంచిది.



మాయిశ్చరైజర్ : 

స్ర్కబ్బింగ్, క్లెన్సింగ్ , క్లీనింగ్ వంటివన్నీ చేసిన తర్వాత చర్మం కాస్త మంటగా అనిపించవచ్చు. ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే, మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది. ఆయిల్ ఫేస్ లేకుండా మురికిని, జిడ్డును తొలగించుకోవచ్చు.




ఫౌండేషన్ వాడకూడదు: 

మేకప్ లేకుండా బయటకు వెళ్ళరు కొందరు. అయితే మేకప్ వేసుకోవడంలో మంచి క్వాలిటి ఉన్న ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి. మేకప్ వేసుకోవడానికి ముందు ప్రైమర్ ఉపయోగించాలి.




లైట్ మేకప్ : 

మేకప్ అంటే అమ్మాయిలకు ఇష్టం. అందుకోసం మార్కెట్లో వచ్చిన ప్రతి ప్రొడక్ట్ ఉపయోగించుకుండా.. మీ చర్మ తత్వానికి నప్పేవి మాత్రమే చూసి కొనాలి.



మేకప్ ను సరిగా తొలగించాలి: 

మరో ముఖ్యమైన విషయం చర్మం సంరక్షణలో మేకప్ తొలగించుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాత్రుల్లో మేకప్ వేసుకుని పడుకుంటే చర్మం మరింత దారుణంగా తయారవుతుంది.




క్లెన్సింగ్ : 

సింపుల్ గా మేకప్ తొలగించడానికి ముఖంను శుబ్రంగా కడగాలి. పాలు, లైట్ ఫేస్ వాష్ వంటి వాటితో ముఖంను శుభ్రం చేసుకోవడం ,రాత్రి నిద్రించడానికి ముందు ఖచ్చితంగా ముఖం శుభ్రం చేసుకోవాలి.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్