రెండు వారాలలో శరీర బరువును తగ్గించే మార్గాలు

అమెరికా మరియు ఇతర పాశ్చత్య దేశాలలో మాత్రమె కాకుండా ఇపుడు భారతదేశంలో కూడా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ''అధిక బరువు''. అధిక బరువు తగ్గించుకోటానికి చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అవునా! కానీ ఇక్కడ తెలిపిన విధానాలను పాటించటం వలన బరువు త్వరగా మీ శరీర బరువు తగ్గుతారు. 

1 గ్రీన్ టీ

శరీర బరువు వేగంగా తగ్గించుటలో గ్రీన్ టీ శక్తివంతంగా పని చేస్తుంది. రోజు దీనిని తాగటం వలన అద్భుతాలను గమనించవచ్చు. రోజులో 3 లేదా 5 కప్పుల గ్రీన్ టీ తాగటం వలన 40 శాతం కొవ్వు పదార్థాలను తగ్గించుకోవచ్చని పరిశోధనలలో వెల్లడించబడింది.


2 రోజు ఉదయాన వ్యాయామాలు

రోజు ఉదయాన వ్యాయామాలను చేయటం వలన శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలు తగ్గటమే కాకుండా, రోజు మొత్తం శక్తివంతంగా ఉంటారు. కావున రోజు ఉదయానే లేచి, అరగంట పాటూ వ్యాయామాలను చేయటం మరవకండి.

3 చైతన్యవంతంగా ఉండండి

చైతన్యవంతంగా ఉంటూ, రోజు అనుసరించే భౌతిక కార్యలను అధికం చేయండి. భౌతిక కార్యాలను అధికం చేయటం వలన మీరు ఉహించిన దాని కంటే త్వరగా శరీర బరువు తగ్గిపోతుంది. ఇలా చిన్న చిన్న కార్యాలను పెంచటం వలన అధిక క్యాలోరీలు ఖర్చు చేయబడి, శరీర బరువు తగ్గుతుంది.


4 ఎక్కువ సమయం నడవండి

పీడోమీటర్ (నడిచే దూరాన్ని కొలిచే పరికరము) కొనుక్కొని, 10,000 అడుగులు నడటవటం ద్వారా 100 కన్నా ఎక్కువ క్యాలోరీలను కరిగించుకోవచ్చు. మీరు చేసే తక్కువ ప్రయత్నంలో, సంవత్సరానికి కనీసం 10పౌండ్ల బరువు తగ్గుతారన్న మాట.


5 నీటిని ఎక్కువగా తాగండి

తగిన మొత్తంలో నీరు తాగని ఎడల, మూత్ర పిండాలు విధిని సరిగా నిర్వహించక, కాలేయంపై ఒత్తిడిని పెంచుతాయి, నిజానికి కాలేయం యొక్క ముఖ్య విధి, నిల్వ ఉన్న కొవ్వు పదార్థాలను వినియోగింప చేసి శక్తిని ఉత్పత్తి చెందించటం. నీటిని తక్కువగా తీసుకోవటం వలన రెండు అవయవాలు వాటి విధిని నిర్వహించలేవు. శరీర బరువు తగ్గుటకు నీటిని ఎక్కువగా తాగండి.


6 సరైన సమయం పాటూ విశ్రాంతి

"లావాల్ యూనివర్సిటీ ఇన్ క్యూబెక్" వారు జరిపిన పరిశోధనల ప్రకారం, 7 నుండి 8 గంటల సమయం పాటూ కాకుండా, 6 గంటల కన్నా తక్కువ మరియు 8 గంటల కన్నా ఎక్కువ సమయం పాటూ నిద్రపోయే వారి శరీర బరువు పెరుగుతుందని తెలిపారు, కావున సరైన సమయం పాటు మాత్రమె నిద్రపోండి.


7 భోజనానికి ముందు నీరు లేదా జ్యూస్ తాగండి

భోజనానికి ముందు నీరు లేదా కూరగాయలతో తయారు చేసిన జ్యూస్'లను తాగటం వలన ఆకలి తగ్గి, అధికంగా తినటం తగ్గుతుంది. ఫలితంగా, అధిక ఆహార సేకరణ తగ్గి, శరీర బరువు కూడా తగ్గుతుంది.


8 ఎక్కువ సమయం పాటు నమలండి

మీరు తినే ప్రతి ఆహారాన్ని కనీసం 8 నుండి 12 నిమిషాల పాటూ నమలండి మరియు నెమ్మదిగా తినండి. ఎక్కువ సమయం నమలటం వలన జీర్ణాశయంపై కూడా ఒత్తిడి తగ్గి, ఆహరం కూడా పూర్తిగా జీర్ణం అవుతుంది. ఎక్కువ సమయం పాటు నమలటం వలన ఆహారాన్ని కూడా ఎక్కువగా తినలేరు.



Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్