మిలమిల మెరిసె చేతుల కోసం


స్త్రీల సౌందర్య పోషణలో చేతులు ప్రముఖపాత్ర పోషిస్తాయి.చాలామంది వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు.అలాంటి వారి కొసమే మెము అందిస్తున్న ఈ చిట్కాలు.
»ఎండలోనికి వెళ్ళినప్పుడు ఎండతాకిడికి చేతులు కమిలిపోతాయి.కాబట్టి బయటకు వేళ్ళేటపుడు చేతికి గ్లౌజులు ధరించాలి.

»చేతికి ఎప్పటికపుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి.

»నిమ్మరసంలో పంచదార కలిపి చేతులకు మర్ధనా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి.

»ఆకుకూరలు,పండ్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల మీ చేతులు నిగనిగలాడతాయి.

»గ్లిజరిన్,ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు కాంతివంతంగా తయారవుతాయి.

»టీస్పూన్ పంచదారలో టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు మర్ధనా చేసుకోవడం వల్ల చేతులు నునుపుగా తయారవుతాయి.

»బట్టలు ఉతుకుతున్నప్పుడు బట్టలసబ్బులో ఉండే రసాయన పదార్ధాలు మీ చేతిని హని చేసే ప్రమాదం ఉంది.కాబట్టి వుతికిన వేంటనే నిమ్మరసాన్ని చేతికి రాసుకుని కాసేపాగాక కడుక్కోవాలి.

»అతివేడయిన,అతిచల్లనైన పదార్ధాలను డైరక్ట్ గా చేతితో తాకకూడదు.

»ఒకస్పూన్ రోజ్ వాటర్ లో ఒకస్పూన్ గ్లిజరిన్ కలిపి చేతులకు రాసుకుని గంట తర్వాత శుభ్రంగా కడుక్కుంటే మీ చేతులు మృదువుగా తయారవుతాయి.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్