ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకర ఆహార పదార్థాలు ఇవే...
ఆరోగ్యంగా ఉండటంలో మనం తినే ఆహరం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
1 ఆరోగ్యకర ఆహార పదార్థాలు
ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తినాలి. ఈ రకం ఆరోగ్యకర ఆహర పదార్థాలు మనం పాటించే ఆహార ప్రణాళికలో తప్పక కలుపుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకర ఆహర పదార్థాల గురించి ఇపుడు తెలుసుకుందాం.
1 ఆరోగ్యకర ఆహార పదార్థాలు
ఆరోగ్యంగా, వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తినాలి. ఈ రకం ఆరోగ్యకర ఆహర పదార్థాలు మనం పాటించే ఆహార ప్రణాళికలో తప్పక కలుపుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకర ఆహర పదార్థాల గురించి ఇపుడు తెలుసుకుందాం.
2 సాల్మన్ ఫిష్
ఈ చేపలో ఎక్కువగా ఒమేగా ఫాటీ ఆసిడ్ లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొవ్వు పదార్థాలను తగ్గించటమే కాకుండా, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతాయి. అంతేకాకుండా, వీటిలో ఉండే ప్రోటీన్ లు శరీరానికి అన్ని విధాల సహాయపడతాయి. సాల్మన్ ఫిష్ అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కావున వారంలో కనీసం 3 సార్లు అయిన వీటిని తప్పక తినండి.
3 ఆపిల్
"రోజు ఒక ఆపిల్, డాక్టర్ ను కలవలసిన అవసరం ఉండదు" అనే వ్యాఖ్య వినే ఉంటారు. అవును నిజమే, ఆపిల్ లో ఉండే ఫబార్ లు ఎక్కువ సమయం ఆకలి అవకుండా చూస్తాయి. వీటితో పాటుగా ఆపిల్ లో పెక్టిన్, విటమిన్ 'C', విటమిన్ 'B' కాంప్లెక్స్ లను కలిగి ఉంటాయి. శరీర శక్తిని పెంచటమే కాకుండా,అ వీటిలో ఉండే ఫైటో కెమికల్స్ వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. అందుకనే ఆపిల్ ను సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు.
4 బ్రోకలీ
విటమిన్ 'C' అధిక మొత్తంలో కలిగి ఉండే బ్రోకలీ కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్ లను కూడా కలిగి ఉంటుంది. వీటి వలన శరీరంలో కేన్సర్ వ్యాధి పెరుగుదల కూడా నివారించబడుతుంది. అంతేకాకుండా, దీనిలో ఉండే ఫైబర్ లు, రక్తపీడనాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులకు గురవకుండా కాపాడుతుంది. కావున దీనిని తప్పక మీ ఆహరం ప్రణాళికలో చేర్చుకోండి.
5.వాల్నట్స్
మోనో సాచురేటేడ్ కొవ్వు పదార్థాలను అధికంగా కలిగి ఉండే వాల్నట్స్ గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచటమే కాకుండా, లైంగిక వాంఛను కూడా పెంచి, సెక్స్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఒమేగా ఫాటీ ఆసిడ్ లు వీటిలో పుష్కంగా ఉంటాయి
Comments
Post a Comment