కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు
కురులు ఏపుగా పెరగడానికి చిట్కాలు
- వత్తైన జుట్టు మగువకు ఎంతో అత్మ వశ్వాసాన్నిస్తుంది.అయితే కొంత మంది ఆడవారికి జుట్టు చాలా పలచగా ఉంటుంది.మరి జుట్టు పలచగా ఉందని బాదపడకుండా ఈ క్రింది చిట్కాలను పాటిస్తే మీ జుట్టు కూడా ఏపుగా పెరుగుతుంది.ఇక్కసారి అవేంటో చూద్దామా..
- జుట్టు ఎక్కువగా రాలిపోయేవారు దువ్వెనతో స్పీడ్ గా కాకుండా కాస్త నెమ్మదిగా దువ్వుకుంటే జుట్టు దువ్వెనకు చిక్కి తెగిపోకుండా కాపాడుకోవచ్చు.
- తలలకు నూనెను పట్టించి కుదుళ్ళ వరకూ వెళ్ళాలా మర్దనా చేసుకోవాలి.దీని వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ బాగా జరిగి వెంట్రుకలు బలంగా పెరుగుతాయి.
- వారానికి కనీసం రెండు సార్లయినా కుంకుడు కాయతోగాని తలమ్మటా స్నానం చెయ్యాలి.
- బయట పనుల మీద ఎక్కువ తిరిగెవారు తలకు దుమ్మూ,దూళి పట్టకుండా చున్నీగానీ,షాల్ గానీ కట్టుకోవాలి.
- స్నానం చేసిన వెంటనే జుట్టును ప్యాన్ గాలిలో అరబెట్టి ఆ తర్వాత దువ్వుకోవాలి.తడిజుట్టును దువ్వితే తెగిపొయె ప్రమాదం ఉంది.
- మందారపు పువ్వుని కాగేనూనేలో వేసి చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించుకోవాలి.
- జుట్టు ఎదుగుదలకు పోషకపదార్ధాలు,ప్రోటిన్స్ అవసరం కాబట్టి బలమైన పోషక పదార్ధాలైన పాలు,పళ్ళరసాలును ఎక్కువగా ఎక్కువగా తీసుకోవాలి.
- దువ్వుకునే దువ్వెనల్లో దుమ్ము,మట్టి వంటివి చెరకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుని ఆ తరువాత దువ్వుకోవాలి.
- తలంటుకునే ముందు వెంట్రుకలకు కలబంద రసం పూసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగనిగ మెరుస్తుంది.
- అవసరమైన ఆందోళనలకు గురవడం వల్లకూడా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి.
Comments
Post a Comment