చర్మాన్ని స్మూత్ గా, గ్లోయింగ్ గా మార్చుకునే సింపుల్ టిప్స్..!
చాలామంది డ్రై స్కిన్ అనేది సీజన్ తో సంబంధం లేకుండా వేధిస్తుంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా.. అన్ని సీజన్స్ లో సమస్యలు తీసుకొస్తుంది. డ్రై స్కిన్ ఉంటే.. దురద, ఇన్ల్ఫమేషన్, ఇరిటేషన్ వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు. డ్రై స్కిన్ సమస్య మరీ ఎక్కువైనప్పుడు ఎగ్జిమా, సోరియాసిస్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. పొడి చర్మాన్ని సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే.. చర్మం నిర్జీవంగా, అనారోగ్యంగా కనిపిస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ ని సాఫ్ట్ గా మార్చే రెమిడీస్ మీ వంటింట్లోనే ఉన్నాయి. వాటిని ఒక్కసారి ప్రయత్నిస్తే.. మీ చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా మారుతుంది. ఈ తేడా గమనిస్తే.. మీరే ఆశ్చర్యపోతారు. ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో హోం రెమిడీస్ తో అందమైన స్కిన్ సొంతం చేసుకోవచ్చు. కాస్త ఓపిక చేసుకుని.. డైలీ ఈ స్కిన్ కేర్ హ్యాబిట్స్ ఫాలో అయితే.. స్కిన్ చాలా స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. దాల్చిన చెక్క అర టీస్పూన్ దాల్చినచెక్క పొడి, మూడు టీ స్పూన్ల తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకో...