5రూపాయల కంటే తక్కువ ఖర్చుతో అందమైన జుట్టు మీ సొంతం..!!
అందమైన జుట్టు పొందడానికి ప్రతి ఒక్కరూ కాస్తైనా కేర్ తీసుకుంటారు. పొడవాటి, నల్లటి, ఒత్తైన జుట్టు పొందాలని భావిస్తారు. కానీ.. కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం ద్వారానే తాము కోరుకున్న జుట్టు పొందవచ్చనే అపోహలో ఉంటారు.
మజ్జిగలో మైమరిపించే.. సౌందర్య రహస్యాలు..!!
ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టే కొద్దీ జుట్టు అందంగా, పొడవుగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ.. వాటివల్ల జుట్టుకి జరిగే హానే ఎక్కువగా ఉంటుంది. అందుకే.. మీ వంటింట్లో ఉండే వస్తువులే.. మీ జుట్టుని చాలా తేలికగా అందంగా మారుస్తాయి. డ్యామేజ్ అయిన జుట్టుకి మంచి కండిషనర్ ని అందిస్తాయి
కరివేపాకు, మెంతి ఆకు మిశ్రమంతో జుట్టుకి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!!
కేవలం 5 రూపాయల కంటే.. తక్కువ డబ్బు ఖర్చు చేస్తే చాలు.. మీరు కోరుకున్న కురుల సౌందర్యం పొందవచ్చు. మరి 5రూపాయల కంటే తక్కువ డబ్బుతో.. పొడవాటి, నల్లటి, ఒత్తైన జుట్టుని ఎలా పొందవచ్చో చూద్దామా..
నిమ్మకాయలు

రెండు నిమ్మకాయల రసంతో ప్రతి రోజూ తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. జుట్టు రాలడం, డాండ్రఫ్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒకవేళ డ్రై హెయిర్ ఉంటే.. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి పట్టించుకోవచ్చు.
అలోవెరా
1 టీస్పూన్ అలోవెరా జెల్ ని తలకు, స్కాల్ప్ కి రెగ్యులర్ గా మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ రెమిడీ ఫాలో అవడం వల్ల.. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.
బీట్ రూట్
1 టేబుల్ స్పూన్ బీట్ రూట్ జ్యూస్, ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను మిక్స్ చేసి.. తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల.. జుట్టు డార్క్ గా, సాఫ్ట్ గా, షైనీగా ఉంటుంది.
క్యారట్స్
2టేబుల్ స్పూన్ల క్యారట్ జ్యూస్ ని స్కాల్ప్ పై మసాజ్ చేసుకోవాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే.. జుట్టు రాలే సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు. క్యారట్స్ లో ఉండే బయోటిన్ జుట్టుని షైనింగ్ ని ఇస్తుంది.
కొత్తిమీర
రెగ్యులర్ కొత్తిమీర రసంను.. కుదుళ్లకు, జుట్టుకి పట్టించడం వల్ల హెల్తీగా ఉంటుంది. కొత్తిమీరలో ఉండే ఐరన్, కాపర్.. జుట్టుని పొడవుగా, నల్లగా పెరిగేలా చేస్తాయి.
దోసకాయ
2టేబుల్ స్పూన్ల దోసకాయ పేస్ట్ ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి.. జుట్టుని షైనీగా మార్చడమే కాకుండా.. త్వరగా, వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
మెంతులు
2టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం దాన్ని పేస్ట్ చేసుకుని, కొద్దిగా పెరుగు మిక్స్ చేసి.. స్కాల్ప్ కి, జుట్టుకి అప్లై చేయాలి. ఇది మీ జుట్టుని పొడవుగా, అందంగా మారుస్తుంది.
వెల్లుల్లి
2టేబుల్ స్పూన్ల వెల్లుల్లి జ్యూస్ ని జుట్టుకి పట్టించి.. గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు షైనీగా మారుతుంది. చుండ్రు తొలగిపోతుంది.
ఉల్లిపాయ
2టేబుల్ స్పూన్ల ఉల్లిరసం, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి మిక్స్ చేసి.. జుట్టుకి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది.. ఒత్తైన, బలమైన పొడవాటి కురులను అందిస్తుంది.
బంగాళదుంప
2 నుంచి 3 బంగాళాదుంపలు తీసుకుని.. దాని నుంచి రసం తీయాలి. ఈ రసాన్ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. బంగాళాదుంప రసం.. డ్రై హెయిర్ ని, స్కాల్ప్ ని నివారిస్తుంది.
Comments
Post a Comment