లావు తగ్గాలంటే
లావు తగ్గాలంటే -
బరువు తగ్గాలని తినడం మానేసి కడుపుమాడ్చుకుంటే కుదరదు. బరువు తగ్గడంలో సాయపడే పదార్థాల గురించి తెలిసి , తెలివిగా తింటూ బరువు తగ్గాలి అంటున్నారు పోషకాహార నిపుణులు.
నల్ల మిరియాలు - నిమ్మ రసం
1. బరువు తగ్గించడంలో నల్లమిరియాలు, నిమ్మరసం కలిపి తయారుచేసే కషాయం చాలా బాగా పనిచేస్తుంది.
2. నల్లమిరియాలలో సహజసిద్ధంగా పైపరీన్ అనే రసాయనం ఉంటుంది. మిరియాల ఘాటుకి కారణం ఈ రసాయనమే.
3. ఇది రక్తంలోని కొవ్వు స్థాయిని తగ్గించి, కొవ్వుకణాలు ఉత్పత్తికి అడ్డుపడి, ఆహారం నుండి పోషకాలను శోషించుకోవడంలో సాయపడుతుందని కొన్ని స్టడీలు వెల్లడిచేశాయి.
4. నిమ్మరసం జీర్ణక్రియకి సాయపడటమే కాకుండా ఆహారాన్ని విడగొట్టడంలో జి.ఐ.(గ్యాస్ర్టో ఇంటస్టెయినల్) ట్రాక్‌కు తోడుగా నిలుస్తుంది.
5. ఈ కషాయం తయారీకి కొద్దిగా నల్లమిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం, మంచినీళ్లు కావాలి. నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి ఆ తరువాత నల్లమిరియాల పొడి వేయాలి. ఈ రసాన్ని ప్రతిరోజూ భోజనం తరువాత తాగి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.
యాపిల్ స్నాక్
1. రోజుకో యాపిల్ తింటే అధికబరువు సమస్యకు దూరంగా ఉండొచ్చు.
2. యాపిల్‌లో పుష్కలంగా పోషకాలు ఉండడమే కాకుండా బరువు తగ్గించేందుకు సాయపడే ఎన్నో గుణాలు ఉన్నాయి.
3. వాటిలో మొదటిది పీచుపదార్థాన్ని కలిగి ఉండడం.
4. ఇది ఆకలిని తగ్గిస్తుంది. స్నాక్స్ ఏవైనా తినాలనిపించినప్పుడు ఒక యాపిల్ తింటే సరిపోతుంది.
5. రెండోది రక్తంలో చక్కెరస్థాయిని, ఆకలిని, శక్తిస్థాయిలను క్రమబద్ధం చేస్తుంది.
6. మూడోది యాపిల్ లో ఉండే పెప్టిన్. ఇవి కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తాయి.
7. రక్తంలో చక్కెరను క్రమపరుస్తాయి.
8. కార్బోహైడ్రేట్స్‌ను శోషించుకోవడాన్ని నెమ్మదింపచేస్తుంది.
9. యాపిల్ లో తక్కువ సోడియం ఉండడం వల్ల శరీరంలోకి అదనంగా నీరు
చేరదు.దాంతో నీటి వల్ల బరువు పెరగడం అనేది ఉండదు. ఒక తాజా యాపిల్
ను శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకుని ప్రతిరోజూ తినాలి.
10. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తొక్కలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందుకని యాపిల్‌ను తొక్క తీయకుండా తినాలి.
డార్క్ చాకొలెట్ :
1. స్వీట్ తినాలన్న ఇష్టాన్ని డార్క్ చాకొలెట్ వైపు మళ్లించండి.
2. ఇది తింటే స్వీట్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది.
3. డార్క్ చాకొలెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఇన్సులిన్‌ను నిరోధిస్తాయి.
4. వీటిలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వు రక్తంలో చక్కెర శోషించుకోవడాన్ని నెమ్మదింపచేస్తుంది.
5. ఇన్సులిన్‌ను విడగొడుతుంది.
6. పంచదార, ఉప్పు, కొవ్వు ఉత్పత్తులను తినాలన్న కోరికను తగ్గించడంలో డార్క్ చాకొలెట్ చాలా బాగా పనిచేస్తుంది.
7. ఈ చాకొలెట్‌లో అధికంగా పాలు, పంచదారలకు బదులుగా 70 శాతం కోకోవానే ఉంటుంది.
8. అందుకని తినేందుకు 70 శాతం డార్క్ చాకొలెట్‌ను తీసుకోవాలి.
9. భోజనం తరువాత ఒక ముక్క డార్క్ చాకొలెట్ తినడం మంచిది.
10. ఆ ముక్క సైజ్ మీ చేతి బొటనవేలంత ఉండాలి. అలా తింటేనే ప్రయోజనం ఉంటుంది.

Comments
Post a Comment