వైట్ అండ్ సాప్ట్ స్కిన్ పొందడానికి బాదం ఫేస్ ప్యాక్స్..!
స్కిన్ వైటనింగ్ (చర్మం తెల్లగా)కాంతివంతంగా మార్చుకోవడం కోసం బాదం, మరియు బాదం ఆయిల్ ఎకనామికల్ గా మరియు నేచురల్ గా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ నట్స్ చర్మంను తెల్లగా మరియు కాంతివంతంగా మార్చే లక్షణాలతో పాట
మహిళలు సాధారణంగా సాధ్యమైనంత వరకూ తెల్లగా ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలా మంది ఇన్ స్టాంట్ ఫెయిర్ నెస్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ, మార్కెట్లో అందుబాటులో ఉండే కమర్షియల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనుకోకుండా సైడ్ ఎఫెక్ట్స్ కు గురిచేస్తాయి. బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకోవలనుకొన్నప్పుడు నేచురల్ మరియు సురక్షిత పద్దతులను ఎంపిక చేసుకోవడం మంచిది. ఇది తక్షణ ప్రభావం చూపకపోయినా, నిధానంగా మంచి పరిస్కారం మార్గం చూపుతుంది. ఎఫెక్టివ్ ఫలితాలను చూపెడుతుంది. హోం బేస్డ్ రెమడీలు మరియు హోం మేడ్ ట్రీట్మెంట్ లో బాదం ఒక టాప్ లిస్ట్ లో ఉంటుంది.
స్కిన్ వైటనింగ్ (చర్మం తెల్లగా)కాంతివంతంగా మార్చుకోవడం కోసం బాదం, మరియు బాదం ఆయిల్ ఎకనామికల్ గా మరియు నేచురల్ గా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ నట్స్ చర్మంను తెల్లగా మరియు కాంతివంతంగా మార్చే లక్షణాలతో పాటు విటమిన్ ఇ అధికంగా ఉన్నాయి. ఇటువంటి బాదం మరియు బాదం ఆయిల్ తో తయారుచేసుకొనే హోం మేడ్ ఫేస్ ప్యాక్ వల్ల అనుకోని ఆశ్చర్యకరమైన ఫలితాలను మీకు అందిస్తుంది . మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచడంతో పాటు కాంతివంతంగా మార్చడాంలో బాదం బాగా సహాయపడుతుంది.
బాదంలను తినడం మాత్రమే కాకుండా వీటితో అనేక విధాలుగా ఉపయోగించి బ్యూటిఫుల్ స్కిన్ ను పొందవచ్చు. బాదంలో ఉన్న విటమిన్ ఇ వల్ల సూర్యని యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి చర్మం అందానికి బాదంను వివిధ రకాలుగా ఉపయోగించడానికి వివిధ మార్గాలున్నాయి. మీ చర్మంఛాయను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ పద్దతులు క్రింది విధంగా...
బాదం -పాలు ఫేస్ ప్యాక్ :
రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడి ని తాజాగా ఉండే పాలలో మిక్స్ చేయాలి. చిక్కటి పేస్ట్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మీరు నిద్రించడానికి ముందు మీ ముఖానికి అప్లై చేయాలి. 10-15అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బాదం పాలు కాంబినేషన్ ఫేస్ ప్యాక్ బెస్ట్ రిజల్ట్ ను అంధిస్తుంది
బాదం మరియు తేనె:
చర్మం కాంతిని వేగవంతంగా పెంచుకోవడానికి బాదం మరియు తేనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . కొన్ని బాదంలను నీళ్ళలో నానబెట్టి, తర్వాత రోజు ఉదయం వాటికి పొట్టు తీసి, తేనె మిక్స్ చేసి, ముఖం మరియు శరీరానికి పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె మిక్స్ చేయడం వల్ల ముఖంలో ఏర్పడ్డ మచ్చలు చాలా తేలికగా తొలగిపోతాయి.
బాదం , బొప్పాయి:
బాదం పౌడర్ లో కొద్దిగా బొప్పాయి గుజ్జును మిక్స్ చేసి, వాటర్ తో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వల్ల డెడ్ స్కిన్, డల్ స్కిన్, తొలగిపోతుంది. ఫేషియల్ హెయిర్ నివారించబడుతుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ హెయిర్ ఫోలిసెల్స్ ను బ్రేక్ డౌన్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
బాదం -ఓట్స్ ఫేస్ ప్యాక్:
మెత్తగా పౌడర్ చేసిన ఓట్స్ కు కొద్దిగా బాదం పొడి రెండు టీస్పూన్ల పచ్చిపాలు కూడా వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ కలిగి వారికి ఈ ఫేస్ మాస్క్ బాగా పనిచేస్తుంది.
బాదం , షుగర్ స్ర్కబ్ :
చర్మ సంరక్షణకు బాదంను ఉపయోగించడం మీకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే బాదం, షుగర్ పౌడర్ ను కొద్దిగా నీటితో మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేసి, స్ర్కబ్ చేయడం వల్ల స్క్రబ్బింగ్ గా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి చర్మం తెల్లగా మారడానికి సహాయపడుతుంది.
బాదం , బనాన:
అరటిపండ్డు చర్మానికి నేచురల్ మాయిశ్చరైజర్ , పోషణను అందిస్తాయి. సగం అరటిపండును మెత్గా మ్యాష్ చేసి, అందులో బాదం పౌడర్ మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకుని, స్ర్కబ్ చేసి, శుభ్రం చేసుకుంటే చర్మం సాఫ్ట్ గా ..వైట్ గా మిళమిళ మెరిసిపోతుంది.
బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్ మసాజ్:
బాదం నూనెలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసి ముఖానికి మరియు శరీరానికి పట్టించి బాగా మసాజ్ చేయడం వల్ల ఎఫెక్టివ్ గా చర్మం తెల్లగా మారుతుంది. బాదం నూనెను ముఖం మరియు శరీరానికి పట్టించి అరగంట అలాగే ఉంచి తర్వత శుభ్రం చేసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరిగి చర్మంకాంతివంతంగా మారుతుంది.
బాదం, గుడ్డు మరియు నిమ్మరసం:
ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్ అందులో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ రెంటింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం త్వరగా తెల్లగా మారుతుంది.
Comments
Post a Comment