అల్లంతో రెండు రెట్లు ఒత్తైన జుట్టు పొందే అమేజింగ్ సొల్యూషన్స్..

అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల వ్యాధులను, ఇన్ఫెక్షన్స్ ని నివారించడంలో అల్లం అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. అయితే.. అల్లం మాస్క్ జుట్టుని రెండు రెట్లు ఒత్తుగా, పొడవుగా మారుతుంది.
అల్లం సాధారణంగా.. ఆహారలకు స్పైన్ ని అందించి..అమోఘమైన రుచిని ఇస్తుంది. అలాగే జుట్టు కూడా త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. అయితే.. జుట్టుకి, అల్లంకి కనెక్షన్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. 
అల్లంలో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల జుట్టు పెరుగుతుంది. అలాగే అల్లంలో ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా మార్చి.. జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

అలాగే అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. స్కాల్ప్ లో ఉండే దుమ్ముని తొలగించి.. క్లెన్స్ చేస్తుంది. డాండ్రఫ్ ని తగ్గిస్తుంది. మరి మీ జుట్టు రెండు రెట్లు ఒత్తుగా, పొడవుగా మారడానికి అల్లంను ఎలా ఉపయోగించాలో చూద్దాం..


బట్టతల 
అల్లం తీసుకుని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. అల్లం రసం తీసి.. బట్టతలపై రుద్దుకోవాలి. కాస్త జలదరించేంత వరకు రుద్దుకోవాలి. ఇప్పుడు.. 30 నిమిషాల తర్వాత.. షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే.. నెలలోనే మీ బట్టతలపై జుట్టు రావడం మొదలవుతుంది.
హెయిర్ గ్రోత్ ఆయిల్ 
ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, టీ స్పూన్ అల్లం ఆయిల్, 10 చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. అన్నింటినీ 2నిమిషాలు సన్నని మంటపై వేడి చేయాలి. చల్లారిన తర్వాత.. ఈ ఆయిల్ తో జుట్టు, కుదుళ్లు మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత షాంపూ చేసుకోవాలి. అంతే జుట్టు హెల్తీగా పెరుగుతుంది.
స్కాల్ప్ కి పోషణ ఒక టేబుల్ స్పూన్ అల్లం ఆయిల్, అవకాడో, ఆలివ్ ఆయిల్స్ సమానంగా తీసుకుని.. అన్నింటినీ మిక్స్ చేసి.. స్కాల్ప్ పై మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత.. షాంపూ, కండిషనర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. స్కాల్ప్ లో పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ అయి, రక్త ప్రసరణ మెరుగవుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది.


జోజోబా ఆయిల్ 
నుదుటిపై ఏర్పడే హెయిర్ లైన్ నివారించడానికి ఈ మాస్క్ సహాయపడుతుంది. కొన్ని చుక్కల అల్లం ఆయిల్, అంతే మొత్తంలో జోజోబా ఆయిల్ తీసుకోవాలి. రెండింటి మిశ్రమాన్ని హెయిర్ లైన్ పై రుద్దుకోవాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే..జుట్టు పెరుగుతుంది.

డాండ్రఫ్ డాండ్రఫ్ ని పర్మనెంట్ గా తొలగించడానికి.. మీడియం సైజు అల్లం ముక్క తీసుకోవాలి. పేస్ట్ లా చేసుకోవాలి. ఒక కప్పు రెగ్యులర్ హెయిర్ లో కలిపి.. వేడి చేసుకోవాలి. కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి.. రాత్రంతా చల్లారనివ్వాలి. తర్వాత స్కాల్ప్ కి, జుట్టుకి మసాజ్ చేయాలి. షవర్ క్యాప్ వేసుకోవాలి. గంట తర్వాత.. షాంపూ, కండిషనర్ చేయాలి.


పోషణ అందించే ప్యాక్ 
ఒక గిన్నె తీసుకోవాలి. ఎగ్ వైట్, ఒ టీస్పూన్ అల్లం ఆయిల్ కలపాలి. రెండు బాగా కలిసేవరకు కలపాలి. జుట్టుని తడి చేసుకుని.. ఈ ప్యాక్ అప్లై చేయాలి. 40 నిమిషాల తర్వాత షాంపూ, కండిషనర్ చేయాలి. ఇది జుట్టుని సిల్కీగా, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.

హెయిర్ రిపేర్ మాస్క్ 
ఒక టేబుల్ స్పూన్ షీకాయ్ పొడి, 10చుక్కల ఆల్మండ్ ఆయిల్, 10 చుక్కల అల్లం ఆయిల్, టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. జుట్టుని చిన్న చిన్న పాయలుగా తీసి.. నీళ్లు చిలకరించి.. ఈ మాస్క్ అప్లై చేయాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించాలి.


క్లెన్సింగ్ షాంపూ 
జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కుంకుడుకాయ పొడి, 5చుక్కల అల్లం, ఆర్గాన్ ఆయిల్ కలపాలి. నీళ్లు ఉపయోగించి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ షాంపూలా ఉపయోగించాలి.

స్కాల్ప్ డెటాక్స్ మాస్క్ 
ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 5చుక్కల అల్లం రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత.. షాంపూ, కండిషనర్ ఉపయోగించి.. శుభ్రం చేసుకోవాలి.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్