కేవలం 2వారాల్లో మీ చర్మాన్ని ఫెయిర్ గా మార్చే సింపుల్ రెమిడీస్..!!

న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవడం ద్వారా.. సున్నితమైన మన చర్మాన్ని ఫెయిర్ గా మార్చుకోవడం కాస్త తేలికవుతుంది.అది కూడా మన వంటింట్లో ఉండే పదార్థాలతో చర్మానికి ఎలాంటి డ్యామేజ్ కలుగకుండా చర్మం బ్రైట్ అవుతుంది.

మనలో చాలామందికి ఫెయిర్ స్కిన్ అంటే పిచ్చి. ఎంత ఫెయిర్ గా ఉంటే.. అంత అందంగా ఉంటామన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ.. కెమికల్ ఉండే.. క్రీమ్స్ చాలానే అందుబాటులో ఉంటాయి. కానీ.. వీటి వల్ల చర్మానికి కలిగే మంచి కంటే.. హానే ఎక్కువ ఉంటుంది.
చాలా ప్రొడక్ట్స్.. రాత్రికి రాత్రే తెల్లగా మార్చేస్తాయి అని ప్రచారం చేస్తుంటాయి. కానీ.. అంత తేలికగా ఫెయిర్ స్కిన్ పొందడం సాధ్యం కాదు. అయితే న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవడం ద్వారా.. సున్నితమైన మన చర్మాన్ని ఫెయిర్ గా మార్చుకోవడం కాస్త తేలికవుతుంది.
అది కూడా మన వంటింట్లో ఉండే.. పదార్థాలతో.. చర్మానికి ఎలాంటి డ్యామేజ్ కలుగకుండా.. చర్మాన్ని చాలా బ్రైట్ గా మార్చుకోవచ్చు. ఆకర్షణీయమైన స్కిన్ టోన్ పొందవచ్చు. కేవలం రెండు వారాల్లోనే ఫెయిర్ స్కిన్ పొందే.. అమేజింగ్ హోం రెమిడీస్ మీరే చూడండి..


దోసకాయ
ఒక టేబుల్ స్పూన్ దోసకాయ రసంలో, కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి.. ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అంతే. దోసకాయ ఆస్ట్రిజెంట్ లా పనిచేసి.. ట్యాన్ ని తొలగిస్తుంది.

ముళ్లంగి

ముళ్లంగి రసంతో.. ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ముళ్లంగి చర్మాన్ని బ్రైట్ గా, టైట్ గా.. మార్చడంలో సహాయపడుతుంది. ముళ్లంగిలో ఫైబర్ ఉంటుంది.. అలాగే.. చర్మంలో మలినాలను తొలగిస్తుంది.


ఉసిరి

రాత్రి పడుకోవడానికి ముందు 1 టీస్పూన్ ఉసిరి రసం, 1 టీస్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల.. చర్మాన్ని గ్లోయింగ్ గా, హెల్తీగా మారుస్తుంది. అలాగే పిగ్మెంటేషన్ తొలగించి.. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.

పెరుగు

ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ముఖానికి పెరుగు పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్.. దుమ్ము తొలగించి, చర్మరంధ్రాలను తెరుచుకునేలా చేసి.. చర్మం ఫెయిర్ కనిపించడానికి సహాయపడుతుం

తేనె
అర టేబుల్ స్పూన్ తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని స్మూత్ గా మారుస్తాయి. యంగ్ లుక్ సొంతం చేసుకోవాలంటే.. ప్రతి రోజూ.. అప్లై చేస్తుండాలి.


పాలు
టేబుల్ స్పూన్ పాలు, టేబుల్ స్పూన్ తేనె కలిపి.. ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్.. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి.. ఫెయిర్ లుక్ అందిస్తుంది. అలాగే ముడతలు, ఫైన్ లైన్స్ తొలగించి..ఎలాస్టిసిటీ పెంచుతుంది.

ఆరంజ్
నారింజ తొక్కను ఎండబెట్టి పొడి చేసి.. పాలు కలిపి.. ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి.. చర్మాన్ని బ్లీచ్ చేసి.. బ్రైట్ గా మారుస్తుంది.

బొప్పాయి
2టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి.. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ, సి చర్మాన్ని బ్రైట్ గా మార్చి.. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది.

టమోటా
ఒక టమోటా గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. టమోటాల్లో ఉండే లైకోపిన్ ట్యాన్ తొలగించి.. కాంప్లెక్షన్ పెంచుతుంది. అలాగే చర్మాన్ని యంగ్ గా ఉంచుతుంది.

పసుపు

ఒక టీస్పూన్ పసుపును, ఒక టేబుల్ స్పూన్ తేనెలో మిక్స్ చేసి.. ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. ట్యాన్ తొలగించి.. చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది. అలాగే ఆయిలీనెస్ ని తగ్గిస్తుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్