గార్జియస్ లిప్స్ కోసం 10 సింపుల్ లిప్ కేర్ టిప్ ..!
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చలికాలం వచ్చేసింది. ఈ క్రమంలో చలి తెచ్చే ఇబ్బందులూ మొదలైపోయాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది పెదవులు పగలడం. ఈ కాలంలోనైతే చర్మమే కాదు, పెదవులు కూడా పగిలి అందవిహీనంగా కనిపిస్తుంటాయి. దీంతో చాలా మంది పెదవులను రక్షించుకోవడం కోసం పలు రకాల క్రీములు రాస్తుంటారు.
బ్యూటీ టిప్స్ కూడా పాటిస్తుంటారు. కానీ అలాంటి వాటికి బదులుగా కింద ఇచ్చిన పలు టిప్స్ పాటిస్తే పెదవులను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవి ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లిప్ బామ్
లిప్ బామ్‌ను పెదాలకు రాసి కొంత సేపు అయ్యాక టూత్‌బ్రష్‌తో పెదాలపై సున్నితంగా బ్రష్ చేయాలి. అనంతరం ఒక శుభ్రమైన గుడ్డను వేడి నీటిలో ముంచి పెదాలను తుడిచేయాలి. మళ్లీ అవసరం అనుకుంటే లిప్ బామ్ పెట్టి అలాగే చేయాలి. దీంతో పెదాలు మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది.
తేనె -నిమ్మరసం
ఒక టీస్పూన్ తేనె, 1/2 టీస్పూన్ నిమ్మరసంలను కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. దీన్ని 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పెదాలు కాంతివంతంగా మారుతాయి. కోల్పోయిన సహజ సిద్ధమైన రంగును తిరిగి పొందుతాయి.
ఆలివ్ ఆయిల్
ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని పెదాలకు రాసి 15 నిమిషాలు ఆగాక వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడిచేయాలి. అవసరం అనుకుంటే మళ్లీ ఇంకోసారి ఇలాగే చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే పెదాలు సౌందర్యాన్ని పొందుతాయి. కాంతివంతంగా మారుతాయి.
అలోవెరా జెల్‌ను
అలోవెరా జెల్‌ను కొద్దిగా తీసుకుని పెదాలకు రాయాలి. 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేయాలి. రోజు ఇలా కనీసం 4,5 సార్లు చేస్తూ ఉంటే పెదాల పగుళ్లు తగ్గిపోయి పెదాలు కాంతివంతంగా మారుతాయి. కొత్త అందాన్ని సొంతం చేసుకుంటాయి.
దానిమ్మ గింజలను
కొన్ని దానిమ్మ గింజలను తీసుకుని వాటి నుంచి జ్యూస్‌ను తీయాలి. ఆ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ కొద్ది మొత్తంలో ఆ జ్యూస్‌ను తీసుకుని అందులో కాటన్ బాల్స్ ముంచి వాటితో పెదాలపై సున్నితంగా మర్దనా చేయాలి. దీని వల్ల పెదాలు ఆకర్షణీయంగా, మృదువుగా మారుతాయి.
బాదం పప్పు
ఒకటి రెండు బాదం పప్పు పలుకులను తీసుకుని నలిపి పెదాలకు రాసి కొంత సేపు ఆగాక కడిగేసినా పెదాలు మృదువుగా మారుతాయి. కాంతివంతంగా తయారవుతాయి.

గులాబీ పూవు రెక్కలi
గులాబీ పూవు రెక్కలను 6,7 తీసుకుని వాటిని అర కప్పు పాలలో రాత్రి పూట నానబెట్టాలి. ఉదయాన్నే పాలను వంపి పూవు రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు మళ్లీ కొంచెం పాలను కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పెదాలు ప్రకాశవంతంగా మారుతాయి.
నిమ్మరసం
నిమ్మరసం, గ్లిజరిన్‌లను సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా కలుపుకుని దాన్ని పెదాలకు రాసి 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేయాలి. దీంతో పెదాలు మృదువుగా మారుతాయి.
కొత్తిమీర
ఆకులను కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకుని బాగా నలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని పెదాలకు రాసి 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. అనంతరం వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సహజ సిద్ధమైన రంగును పొందుతాయి. మృదువుగా కూడా మారుతాయి.
కొబ్బరి నూనె
రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని పెదాలకు రాసి ఉదయాన్నే కడిగేయాలి. దీంతో పెదాల పొడితనం తగ్గుతుంది. మృదువుగా కూడా మారుతాయి.
ఒకటి రెండు బాదం పప్పు పలుకులను తీసుకుని నలిపి పెదాలకు రాసి కొంత సేపు ఆగాక కడిగేసినా పెదాలు మృదువుగా మారుతాయి. కాంతివంతంగా తయారవుతాయి.
Comments
Post a Comment