5 ఉత్తమమైన యాంటీ ఏజింగ్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ లు

పండ్లలో యాంటాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన కొల్లాజెన్ ఉత్పత్తి ఉద్దీపన మరియు చర్మం యొక్క యవ్వన తేజంను పునరుద్ధరించటంలో సహాయపడుతుంది.
మీ వయస్సుతో పాటు చర్మానికి కూడా ముసలితనం వస్తుందని భావిస్తున్నారా? మీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు ముడతలు మరియు లైన్స్ కనిపిస్తున్నాయా? అయితే మీరు ఈ వ్యాసాన్ని చదవండి

వృద్ధాప్య దశ నుండి తప్పించుకోవటం అనివార్యమైన, వృద్ధాప్య గుర్తులను వదిలించుకోవడానికి మార్గాలు లేవు. కానీ ఆ గుర్తులను తగ్గించుకోవటం సాధ్యం అవుతుంది. సహజంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించవచ్చు.
అందం కోసం శతాబ్దాల నుండి ఉపయోగిస్తున్న పండ్లలో చర్మ అనుకూలమైన కాంపౌండ్స్ సమృద్ధిగా ఉంటాయి.

పండ్లలో యాంటాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన కొల్లాజెన్ ఉత్పత్తి ఉద్దీపన మరియు చర్మం యొక్క యవ్వన తేజంను పునరుద్ధరించటంలో సహాయపడుతుంది.
కాబట్టి ఇప్పుడు ఇంటిలో అందుబాటులో ఉండే పండ్లను ఉపయోగించి 5 పేస్ మాస్క్ లను తయారుచేసుకుందాం. ఈ పేస్ ప్యాక్ లను సిద్ధం చేసుకోవటానికి ఈ వ్యాసాన్ని చదవండి.
గమనిక: ఎల్లప్పుడూ చర్మ ప్యాచ్ టెస్ట్ నిర్వహించడం మరియు వృద్ధాప్య కనిపించని గుర్తుల మీద పోరాటం చేయటానికి బయట విధానంను ప్రయత్నించండి. నీరు పుష్కలంగా త్రాగాలి. అలాగే ఆరోగ్యకరమైన సహజ నివారణలను ప్రయత్నించండి.

1. గ్రేప్స్ మరియు తేనే
వీటిలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా సహాయపడతాయి . ఈ ప్యాక్ ని కనీసం వారానికి ఒకసారి వేసుకోవాలి. ద్రాక్ష పండును క్రాష్ చేసి ఒక స్పూన్ ముడి తేనెను కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని శాంతంగా ప్రభావిత ప్రాంతం మీద రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.

2. పెరుగు, తేనె మరియు అరటిపండు
అరటి పండు వృద్ధాప్య గుర్తులను ఎదుర్కోవటంలో గొప్పగా పనిచేస్తుంది. సమానమైన ప్రభావం కలిగిన పెరుగు మరియు తేనె వంటి పదార్దాలను కలపటం వలన ప్యాక్ బాగా పనిచేస్తుంది. బాగా పండిన అరటిపండు గుజ్జుకు పెరుగు,ఒక స్పూన్ తేనే కలిపి చిక్కటి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతాల్లో రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. ఆపిల్,తేనే మరియు పాల పొడి

ఆపిల్ ముడతలను ఎదుర్కోవడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఆపిల్ ని తిన్న లేదా రాసిన వృద్ధాప్య గుర్తులను తగ్గించటంలో సహాయపడుతుంది. ఆపిల్ ని ఉడికించి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ కి ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ పాల పొడి కలపాలి. ఈ పేస్ట్ ని ముడతలు,లైన్స్ ఉన్న ప్రదేశంలో రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

4. ఆరెంజ్ తొక్కల పొడి,రోజ్ వాటర్ మరియు పెరుగు
ఆరెంజ్ తొక్కల పొడిలో సిట్రిక్ ఆమ్లం ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ తగ్గించటానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తిలో ఉద్దీపన కలిగిస్తుంది. ఒక స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడిలో ఒక స్పూన్ పెరుగు మరియు కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి కలపాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. యంగ్ లుక్ రావాలంటే ఈ ప్యాక్ ని వారానికి ఒకసారి వేసుకోవాలి.

5. బొప్పాయి మరియు ముల్టానా మట్టి
బొప్పాయిలో పపైన్ అనే అద్భుతమైన సమ్మేళనం ఉంది. ఈ సమ్మేళనం చనిపోయిన చర్మ కణాలను తొలగించటం మరియు చర్మాన్ని టైట్ గా ఉంచే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. బాగా పండిన నాలుగు బొప్పాయి ముక్కలను మెత్తగా చేసి ఒక స్పూన్ ముల్టానా మట్టి కలపాలి. ఈ పేస్ట్ ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయాలి.


Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్