చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించేందుకు

చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించేందుకు



                          

డార్క్‌ చాక్లెట్‌:

1. దీన్ని తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లు, ఫ్యాటీయాసిడ్లు అందుతాయి. ఈ పోషకాలన్నీ చర్మాన్ని మెరిసేందుకు తోడ్పడతాయి.
2. ఇందులో ఉండే కోకో రక్తప్రసరణపై సానుకూల ప్రభావాన్ని చూపడం వల్ల పరోక్షంగా చర్మానికి మేలు జరుగుతుంది.
3. అలాగే డార్క్‌ చాక్లెట్‌లోని పోషకాలు అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి కలిగే హానిని అడ్డుకుంటాయి కూడా.
4. అతిగా తింటే మాత్రం మొటిమలతోపాటూ, అధికబరువూ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

క్యారెట్లు:

1. కళ్లకే కాదు చర్మానికీ మేలుచేస్తాయి.
2. వీటిల్లో ఉండే ఎ విటమిన్‌ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
3. చర్మంలో ఎక్కువ కణాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయివి. అదే సమయంలో ఎండ ప్రభావం చర్మంపై పడకుండా కూడా ఇందులోని పోషకాలు కాపాడతాయి.

ఎరుపు రంగు క్యాప్సికం:

1. దీన్ని పచ్చిగా సలాడ్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.
2. ఇందులో సి, బి6 విటమిన్లూ, పీచు, కెరొటినాయిడ్లూ ఉంటాయి.
3. ఈ పోషకాలన్నీ ముడతల్ని నివారిస్తాయి.
4.  మొటిమలు రాకుండానివారిస్తాయి ,
5. రక్తప్రసరణ కూడా బాగా జరిగేలా చేస్తాయి.
6. తరచూ దీన్ని తీసుకోగలిగితే వార్థక్యపు ఛాయలు చాలామటుకూ దూరం అవుతాయంటున్నారు నిపుణులు.

కొబ్బరినూనె:

1. ఈ నూనెలో కెలొరీలు ఎక్కువైనా, లారిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఇందులో ఉంటుంది.
2. దీనికి యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ గుణాలు ఉంటాయి.
3. వంటల్లో కొన్ని చెంచాల నూనె వాడినా ఇన్‌ఫెక్షన్లూ, కొన్నిరకాల వైరస్‌లూ దరిచేరవు.
4. విటమిన్‌ ఇ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

గ్రీన్‌టీ:

1. ఇందులోనూ కెఫిన్‌ ఉంటుంది కానీ..
2. అదనంగా ఎల్‌-థియనైన్‌ అనే అమినోయాసిడ్‌ మనకెంతో మేలు చేస్తుంది.
3. ఒత్తిడి తగ్గించి శరీరం విశ్రాంతి పొందేలా చేస్తుంది.
4. గ్రీన్‌టీలో ప్రత్యేకంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి వార్థక్యపు ఛాయలు రాకుండా కాపాడతాయి.

పాలకూర:

1. ఇందులో మెగ్నీషియం, విటమిన్‌ సి, ఇ, ఎ, ఫొలేట్‌, ఫైబర్‌, ప్లాంట్‌ప్రొటీన్‌, ఇనుము లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
2. ఇవన్నీ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
3. పాలకూర ఎక్కువగా తీసుకుంటే చర్మానికి తగినంత పోషణ అంది, మొటిమలూ, ముడతల్లాంటివి తొందరగా రావు.

గింజలు:

1. అన్నిరకాల గింజలు చర్మానికి మేలుచేసేవే.
2. ముఖ్యంగా గుమ్మడి, పొద్దుతిరుగుడు పువ్వు గింజల నుంచి అందే విటమిన్‌ ఇ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
3. వీటివల్ల శరీరానికి లభించే ప్రొటీన్‌, సెలీనియం లాంటి పోషకాలు ముడతలు రాకుండా చేస్తాయి.
4. అవిసెగింజలయితే చర్మానికి కావాల్సినంత తేమనందిస్తాయి.

బొప్పాయి:

1. ఇందులో ఖనిజాలే కాదు, విటమిన్లూ సమృద్ధిగా ఉంటాయి.
2. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మెరిసేలా కూడా చేస్తాయి.
3.  ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల చర్మం తాజాగా మారి నిగనిగలాడటం ఖాయం.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్