ఫేషియల్ బ్లీచ్ తర్వాత స్కిన్ బర్నింగ్ తగ్గించే 8 ఎఫెక్టివ్ రెమెడీస్ ..!

ఫేషియల్ బ్లీచ్ బర్న్స్ నిజంగా చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ఇన్ స్టాంట్ గా కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి .

ఫేషియిల్స్, బ్లీచింగ్ వంటివి మహిళలు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. రెగ్యులర్ ఫేషియల్, బ్లీచ్ వల్ల ఇన్ స్టాంట్ గా చర్మంను తెల్లగా మార్చుకోవచ్చు. అయితే ఫేషియల్ అయినా, బ్లీచింగ్ అయినా బయట చేయించుకోవాలంటే పర్స్ ఖాలీ చేయాల్సిందే...

ఫేషియల్ హెయిర్ బ్లీచ్ చేసుకున్న వెంటనే కొంత మందికి చర్మంలో మంట పుడుతుంది. చర్మంలో బర్నింగ్ సెన్షేషన్ అసాధారణంగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇది చీకాకు కలిగిస్తుంది. దురద పెట్టినట్లు అనిపిస్తుంది. దాంతో సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇటువంటి అనుభం మీకు కూడా కలిగి ఉంటే , తప్పనిసరిగా ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది.

ఫేషియల్ బ్లీచ్ బర్నింగ్ ను తగ్గించుకోవడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. ఇది చర్మంలో మంటను, ఇరిటేషన్, తగ్గిస్తుంది. ఈ ట్రెడిషినల్, నేచురల్ రెమెడీస్ ను కొన్ని శతాబ్దాల కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఈ నేచురల్ రెమెడీస్ చర్మంలో ఇరిటేషన్ తగ్గిస్తాయి . బర్నింగ్ సెన్షేషన్ తగ్గిస్తాయి.చర్మానికి స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తాయి. ఇవి ఇన్ స్టాంట్ రిలీఫ్ ను అందివ్వడం మాత్రమే కాదు, చర్మంలో మంటతోపాటు, చర్మం ఎర్రగా కందిపోకుండా చేస్తుంది. ఫేషియల్ బ్లీచింగ్ బర్న్స్ ను నివారించే హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం...


అలోవెర జెల్

ఫేషియల్ బ్లీచ్ అయిన తర్వాత కలబంద రసాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయడం మంచిది. కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బర్నింగ్, రెడ్ నెస్ తగ్గిస్తుంది. మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది.


ఐస్ క్యూబ్స్

ఫేషియల్ బ్లీచ్ చేయించుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ను చర్మానికి అప్లై చేస్తూ స్మూత్ గా మర్ధన చేయాలి. ఇది సూపర్ ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ. ఇది బర్నింగ్ సెన్సేషన్ తగ్గిస్తుంది. మంట తగ్గే వరకూ రోజులో ఎన్ని సార్లైనా మర్ధన చేయొచ్చు.

కీరదోసకాయ:
ఫేషియల్ బ్లీచ్ తర్వాత కీరదోసకాయ ముక్కతో ముఖం మీద మర్ధన చేయడంవల్ల చర్మంలో మంట నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇది కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. చర్మంలో ఇరిటేషన్ మరియు మంటను తగ్గిస్తుంది.

పచ్చిపాలు
ఈ ఏజ్ ఓల్డ్ నేచురల్ రెమెడీ ఫేషియల్ బ్లీచింగ్ బర్న్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పచ్చిపాలను ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. పచ్చిపాలో కాటన్ బాల్ డిప్ చేసి, మంట ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.



పసుపు, పెరుగు :
పెరుగులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి, తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఇది ఫేషియల్ బ్లీచ్ బర్న్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. చర్మంలో బర్నింగ్ సెన్షేషన్ తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని మంట ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా చేయడంవల్ల స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది.

శాండిల్ ఉడ్ పేస్ట్
శాండిల్ ఉడ్ పౌడర్ లో యాంటీబ్యాక్టీరియల్, పెయిన్ కిల్లర్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి చర్మంలో ని బర్నింగ్ సెన్షేషన్ , అసౌకర్యంను తొలగిస్తుంది. ఈ పేస్ట్ తయారుచేయడానికి ముందు శాండిల్ ఉడ్ పౌడర్ లో కొద్దిగా వాటర్ లేదా పాలను మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది


బంగాళదుంప తొక్క
కొన్ని వందల సంవత్సరాల నుండి, బంగాళదుంపను సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఔషధంగా కూడా పురతాన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. చర్మంలో ఎక్కడైనా మంట కలిగినప్పుడు, బంగాళదుంప తొక్కను అప్లై చేయడం వల్ల ఇంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. బ్లీచింగ్ లక్షణాలు, ఇన్ స్టాంట్ రిలీఫ్ ను కలిగిస్తాయి

ల్యావెండర్ ఆయిల్
అసాధరణ బర్నింగ్ సెన్షేషన్ ను నివారించడంలో ల్యావెండర్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఫేషియల్ హెయిర్ బ్లీచింగ్ ను కూడా తగ్గిస్తుంది. కాటన్ బాల్ ను ల్యావెండర్ ఆయిల్లో డిప్ చేసి, ఎఫెక్టెడ్ ఏరియాల్ అప్లై చేస్తే ఇన్ స్టాంట్ రిలీఫ్ దొరుకుతుంది.


Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్