సెల్యులైట్, స్ట్రెచ్ మార్క్స్ , డార్క్ స్పాట్స్ అన్నింటికి చెక్ పెట్టే ఒకే ఒక్క జెల్..!!
సెల్యులైట్, స్ట్రెచ్ మార్క్స్ , రాషెస్ ఏలాంటి సమస్య నివారించుకోవడానికైనా కొబ్బరి నూనె, అలోవెర, విటమిన్ ఇ మరయు రోజ్ హిప్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో శ్యాచురేటెడ్ మరియు అన్ శ్యాచురేటెడ్
స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వాస్తాయి. సెల్యులైట్ లేదా రాషెస్ కారణంగానే వస్తాయి. సెల్యులైట్ స్ట్రెచ్ మార్క్స్ , డార్క్ స్పాట్స్ ఏర్పడటం సహజం. ఈ సమస్యను చాలా మంది మహిళలు ఫేస్ చేస్తుంటారు. మహిళ శరీరం మీద జరిగే ఈ మార్పు కనబడకుండా దుస్తులు కప్పి ఉంచేస్తాయి.
స్ట్రెచ్ మార్క్స్, సెల్యులైట్ , రాషెస్ కు కారణం ఏదైనా ఈ సమస్యను తగ్గించుకోవడం చాలా అవసరం. లేదంటే చాలా అందోళన కలిగిస్తుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి వివిధ రకాల క్రీములు, కెమికల్ ప్రొడక్ట్స్ కోసం డబ్బు వ్రుదా చేయడం కంటే ఇంట్లో ఉండే హెర్బల్ మాస్క్ లతో సులభంగా నివారించుకోవచ్చు.
సెల్యులైట్, స్ట్రెచ్ మార్క్స్ , రాషెస్ ఏలాంటి సమస్య నివారించుకోవడానికైనా కొబ్బరి నూనె, అలోవెర, విటమిన్ ఇ మరయు రోజ్ హిప్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో శ్యాచురేటెడ్ మరియు అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే లౌరిక్ యాసిడ్ మరియు ఓలియక్ యాసిడ్స్ ఉండటం వల్ల చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇది లింఫ్యాటిక్ ఫ్లోను మెరుగుపరుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది, దాంతో చర్మం స్మూత్ గా మారుతుంది.
అలోవెరలో ఉండే అల్లిసిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్, చర్మంలో కొల్లాజెన్ ప్రొడక్షన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్కిన్ ఎలాసిటి పెంచుతుంది మరియు స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది.
విటమిన్ ఇ చర్మంను రిపేర్ చేస్తుంది, పోషణను అందిస్తుంది. చర్మం క్లియర్ చేస్తుంది. అదేవిధంగా రోజ్ హిప్ ఆయిల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది స్కిన్ స్ట్రెంగ్గ్ మరియు ఎలాసిటిని మెరుగుపరుస్తుంది.
అలాంటి ఎఫెక్టివ్ హెర్బల్ మాస్క్ ను నేచురల్ గా ఏవిధంగా తయారుచేసుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..
స్టెప్ #1
ఒక పాన్ తీసుకుని, తక్కువ మంట మీద పెట్టాలి. అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసి ఒకటి రెండు నిముషాలు వేడి చేయాలి. తర్వాత క్రిందికి దింపుకోవాలి.
స్టెప్ # 2
ఒక పెద్ద అలోవెర లీప్ తీసుకుని స్కిన్ తొలగించి స్పూన్ తో జెల్ ను వేరుగా తీసుకోవాలి. ఈ అలోవెర జెల్ ను కొబ్బరి నూనెలో వేసి ఫోర్క్ తో బాగా మిక్స్ చేయాలి. ఈ రెండూ బాగా కలగలిసే వరకూ మిక్స్ చేయాలి.
స్టెప్ #3 ఇప్పుడు విటమిన్ ఇ క్యాప్స్యుల్ తీసుకుని, రెండుగా బ్రేక్ చేసి అందులోని జెల్ ను సపరేట్ చేసుకోవాలి. ఈ విటమిన్ ఇ ఆయిల్ ను అలోవెర మిక్స్ లో వేసి తిరిగి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి.
స్టెప్ # 4
ఈ మిశ్రమంలో రోజ్ హిప్ ఆయిల్ 5 చుక్కలు మిక్స్ చేయాలి. ఈ పదార్థాన్ని మూత గట్టిగా ఉండే బాటిల్లో వేసి 24 గంటలు మూత తియ్యకుండా పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ # 5
తర్వాత ఈ నూనెను బయటకు తీసి , చర్మానికి పూర్తిగా అప్లై చేయాలి. కాళ్ల వేళ్ళ దగ్గర నుండి పైకి బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ మరియు సెల్యులైట్ ను నివారించుకోవచ్చు
స్టెప్ #6
రాత్రుల్లో ఇలా అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మార్నింగ్ యథావిధంగా స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
స్టెప్ #7
ఈ నేచురల్ పదార్థాలను ప్రతి రోజూ రాత్రుల్లో అప్లై చేసుకోవడం వల్ల సెల్యులైట్, స్ట్రెచ్ మార్క్స్ డార్క్ సర్కిల్స్ లు ఎఫెక్టివ్ గా నివారించబడుతాయి. చర్మం స్మూత్ గా కనబడుతుంది.
Comments
Post a Comment