ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్

అందానికి, చర్మ సౌందర్యానికి నారింజ చెప్పే “ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్”

orange face packs

మన చర్మ సౌందర్యానికి పండ్ల ఫదార్దములు ఎంతో మేలు చేకూరుస్తున్నయి,అందువల్లనే ఇప్పటికీ ఎంతో మంది ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం “కాస్మొటిక్ ప్యాక్స్” కన్నా “ఫ్రూట్ ప్యాక్స్” ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ సౌందర్య సం రక్షణను పెంపొందించే పండ్లలో నారింజ ఎంతో ఉపయోగకరమైనది.

 నారింజలొ “కాల్షియం” మరియు “విటమిన్ భ్” పుష్కలంగా ఉన్నయీ అనడంలో సందేహం లేదు,ఇవి మనలోని ఎముకల్ని ధ్రుడంగా చేయడంలో ఎంతో సహయపడతాయి.మన శరీర సం రక్షణలో నారింజది ఒక అద్భుతమైన పాత్ర అని చెబితే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఫ్రూట్ జూస్ రూపంలో, గుజ్జు చేసుకుని, పండు పై భాగము అనగ తొక్కని పొడి చెస్కుని ఎలా ఎన్నొ రకాలుగా ఉపయోగపడుతుంది.



“ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్””, వాటి ఉపయోగాలు తెలుసుకుందాం

ఆరెంజ్ ఫేస్ ప్యాక్1:

నారింజని 2 ముక్కలుగా కోసి ఒక ముక్కలోని రసాన్ని పిండి, అందులో 2 Tbsp పెరుగు కలిపి ముఖమునకు పట్టించి 15-20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడిగితే, ముఖమంతా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అంతే కాకుండా జిడ్డుతనం పోయి మ్రుదువుగా మరియు కాంతివంతంగా కూడా అవుతుంది.



ఆరెంజ్ ఫేస్ ప్యాక్2:

నిమ్మరసాన్ని ఒక గ్రాము పిండిలో కలిపి పేస్ట్ గా మారిన తరువాతా ముఖానికి పట్టించి 20 నిమిషాల అరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే చాలా మ్రుదువైనా, కాంతివంతమైన, కోమలమైన చర్మం లభిస్తుంది.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్3:
2 Tbsp నారింజ రసంలో, 1 Tbsp తేనె, 1 Tbsp నిమ రసం కలిపి ముఖమునకు రాస్తే మొటిమలని నివారించడమే కాకుండా, మచ్చ రహితమైన, అంటే మచ్చలు లేని పరిశుబ్రమైన, తేజోవంతమైన చర్మం లభిస్తుంది



ఆరెంజ్ ఫేస్ప్యాక్4:
నారింజ రసంలో బంక మట్టి, లేదా ముల్తాని మట్టి+పాలు కలిపి ఒక అరగంట సేపు తరువాత ముఖానికి రాసి మరొక 20 నిమిషముల తరువాత గొరు వెచ్చని నేటితో శుబ్రపరుచుకోవాలి.



ఆరెంజ్ ఫేస్ ప్యాక్5:
నిమ్మ కాయ బయట ఉండే తొక్కని పొడిగా చేసి  అందులో, గంధం పొడిని జతపరిచి, పాలు\నీళ్ళూ\రోజ్ వాటర్ ని కలిపి పేస్ట్ గా అయిన తరువాత  ముఖానికి  పట్టించి పొడిగా మారిన తరువాత అంటే ఒక 30 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి మెత్తటి టవల్ తో శుబ్రం  చెసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.



ఒక వేళ మీది మొటిమలకు గురైన చర్మం అయితే పైన సూచించిన విదానంలో పాలకు బదులు \నీళ్ళూ\రోజ్ వాటర్ ఉపయోగించితే మంచిది

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు