జుట్టును రెండింతలు రెట్టింపు చేసే ఆమ్లా హెయిర్ మాస్క్

జుట్టుకు ఉసిరికాయను ఉపయోగించడం వల్ల తప్పనిసరిగా మార్పులను గమనిస్తారు, జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా హోం మేడ్ ఆమ్లా హెయిర్ రిసిపిలు జుట్టు సంరక్షణలో గ్రేట్ గా సహాయపడుతాయి. అదెలాగో తెలు


ఇండియన్ గూస్ బెర్రీ, ఆమ్లా ఇది జుట్టుసమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. జుట్టుకు కావల్సిన షైనింగ్, స్మూత్ నెస్, వాల్యూమ్ పెంచుతుంది.
ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తో పోల్చితే ఉసిరికాయాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి జుట్టుకు అవసరమయ్యే కొల్లాజన్ ను ఉత్పత్తి చేస్తుంది. జుట్టు బ్రేక్ కాకుండా హెయిర్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది.
అంతే కాదు, ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది తలను శుభ్రం చేయడం మాత్రమే కాదు, చుండ్రుకు సంబంధించిన పొట్టులాంటి పదార్థాన్ని తొలగిస్తుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెయిర్ ఫాలీసెల్స్ కొత్తగా ఏర్పడుటకు సహయాపడుతుంది.
జుట్టుకు ఉసిరికాయను ఉపయోగించడం వల్ల తప్పనిసరిగా మార్పులను గమనిస్తారు, జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా హోం మేడ్ ఆమ్లా హెయిర్ రిసిపిలు జుట్టు సంరక్షణలో గ్రేట్ గా సహాయపడుతాయి. అదెలాగో తెలుసుకుందాం..


హెయిర్ ఆయిల్ :
ఉసిరికాయను చిన్న ముక్కలుగా కట్ చేసి, 5,6 మందారం ఆకులు, ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకిని, తక్కువ మంట మీద వేడి చేయాలి. 20నిముషాలు వేడి చేసి తర్వాత మంట తగ్గించి నూనెను చల్లారనివ్వాలి. తర్వాత ఎయిర్ టైట్నర్ డబ్బాలో నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు రెగ్యులర్ గా ఉపయోగించుకోవచ్చు.


జుట్టుకు బాలన్నిచ్చే హెయిర్ మాస్క్
ఒక టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ , పెరుగు వేసి స్మూత్ గా పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ హెయిర్ స్ట్రెటనింగ్ ఆమ్లా మాస్క్ ను తకలు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.


యాంటీ డాండ్రఫ్ మాస్క్:
ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టీస్పూన్ ఆమ్లాపౌడర్ , ఒక టీస్పూన్ బ్రహ్మీ పౌడర్ , 1 చుక్కల రోజ్మెర్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. సరిపడా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. తర్వాత జుట్టు తడిచేసి, తలకు అప్లై చేయాలి. ఒకటి , రెండు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.


హెయిర్ షైనింగ్ కోసం :
ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ , 10 చుక్కల ఆమ్లా ఆయిల్ మిక్స్ చేయాలి. అందులో ఒక టీస్పూన్ తేనె ను ఒక కప్పు నీటిలో మిక్స్ చేయాలి. షాంపు చేసిన తర్వాత చివరగా ఈ వాటర్ తో తలస్నానంచేయడం వల్ల , 5 నిముషాలు మసాజ్ చేసి, చల్లటి నీటితో తలస్నానం చేయాలి.


యాంటీ గ్రేయింగ్ మాస్క్:
ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేడి చేయాలి, అందులో ఆమ్లా పౌడర్, గుప్పెడు కరీవేపాకు వేసి, 16నిముసాలు వేడి చేయాలి, తర్వాత క్రిందికి దింపుకుని చల్లార్చాలి, నూనె గోరువెచ్చగా ఉన్నప్పుట, తకలు పట్టించి మసాజ్ చేయాలి. రాత్రిలో పెట్టి, ఉదయం షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నివారించబడుతుంది.


హెయిర్ కండీషనర్ :
ఒక ఎగ్ వైట్ లో ఒక టేబుల్ స్పూన్ ఆమ్లాపౌడర్ , ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి,తలకు అప్లై చేయాలి. ఇది జుట్టు రాలడం తగ్గించడానికి హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ మాస్క్ డ్రైగా మారినతర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.


జుట్టుచిట్లకుండా:
ఒక టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్ తీసుకుని,అందులో ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ మిక్స్ చేయాలి. పెరుగు కూడా చేర్చి స్మూత్ గాపేస్ట్ చేసి , తలకు అప్లై చేయాలి. షవర్ క్యాప్ పెట్టుకుని, ఒక గంట తర్వాత షాంపు, కండీషనర్ తో తలస్నానం చేసుకోవాలి.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్