మొటిమలు మిమ్మల్ని బాదిస్తున్నాయా ?

మొటిమలు మిమ్మల్ని బాదిస్తున్నాయా ?

యుక్త వయసు వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఆడవారిని మొటిమలు వేధిస్తుంటాయి.వీటివల్ల ముఖం అందవికారంగా తయారయ్యి నలుగురితో కలవాలంటే సంకొచించే పరిస్ధితి ఏర్పడుతుంది.అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మొటిమలు మిమ్మల్ని దరిచేరవు.

» మొటిమలు ఎక్కువగా ఆయిల్ పుడ్ తినేవారిలో 
వస్తాయి.కాబట్టీ అయిల్ పుడ్ ను వీలైనంత వరకూ తగ్గించుకునేలా చూడాలి.

» మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి.కాబట్టి ముఖాన్ని ఎప్పటికపుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకోవాలి.

» మొటిమలు ఉన్నవారు వాటిని సూది,పిన్నిసు వంటి వాటితో పొడుస్తుంటారు.ఇలా చెయ్యడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది.

» మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్ క్యూబ్ను వాటిపై మెల్లగా రుద్దుతుంటే కొంచేం ఉపశమనం లభిస్తుంది.

» కొంచెం నిటీలో దాల్చిన చెక్క పొడి వేసి మెత్తగా పెస్ట్ లా చేసుకుని మొటిమలకు పట్టిస్తే ఫలితం కనబడుతుంది.

» మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహరం తగ్గించాలి.
»
నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటీమలు రాకుండా చూసుకోవచ్చు.

» మొటిమలు ఉన్నయి కదా అని ఏక్రిం బడితే ఆక్రిం రాసేయకూడదు.దీనివల్ల మీ ముఖం ఇన్ పెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.

» టమోటాపండు రసం తీసీ మొటిమలు మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

» కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడి వేసి బాగా కలుపుకుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు.

» మొటిమలు ఉన్న చోట తెల్ల ఉల్లిపాయ రసం తీసి దానిలో కొంచెం తెనె,చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుని అప్లైచేస్తే మొటిమలు తగ్గుతాయి.

» మొటిమలు మీద వెల్లుల్లి రసం రాయడం వల్ల వీటిని నివారించవచ్చు

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్