త్వరగా, తేలికగా చుండ్రు తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!
టీనేజర్స్ ను ఎక్కువగా వేధించే సమస్య చుండ్రు. జుట్టు రాలడం ఒక సమస్య అయితే.. చుండ్రు మరింత ఇబ్బంది పెట్టే సమస్య. దీనివల్ల స్కాల్ఫ్ పై దుష్ర్పభావం చూపుతుంది. సాధారణంగా స్కాల్ఫ్ పొడిబారి, దురగా ఉంది అంటే.. చుండ్రు సమస్య మొదలైనట్టే. ఈ సమస్య ఎక్కువగా వింటర్, సమ్మర్ లో కనిపిస్తూ ఉంటుంది.
కాలుష్యం, ఒత్తిడి, దూర ప్రయాణాల కారణంగా ప్రతి ఒక్కరిని చుండ్రు సమస్య వేధిస్తుంది. ప్రస్తుత బిజీ లైఫ్ లో చుండ్రుతో బాధపడే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఎన్ని ప్యాక్ లు వేసుకున్నా, ఎన్ని షాంపూలు వాడినా.. చుండ్రు సమస్య నుంచి మాత్రం బయటపడలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
అయితే తీవ్రంగా ఇబ్బంది, దురద పెట్టే చుండ్రు వదిలించడానికి మెడికేటెడ్ షాంపూల అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా చుండ్రుని ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు.
వారంలో రెండు రోజులు తలకు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. ఆలివ్ ఆయిల్‌లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ పట్టించి తలకు టవల్ లేక స్కార్ఫ్ కట్టుకుని పడుకుంటే ఆయిల్ బాగా తలకు పడుతుంది. తర్వాత తర్వాత చుండ్రు తొలగిపోతుంది.
మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి నెల రోజులు క్రమం తప్పకుండా చేస్తే చుండ్రు తొలగిపోతుంది.
కలబందలో యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు కలబంద గుజ్జును పట్టించి 40 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చుండ్రు దూరమవుతుంది.

Comments
Post a Comment