పగిలిన పాదాలను తేలికగా, త్వరగా నివారించే ఎఫెక్టివ్ రెమెడీస్..!

పాదాలు చీలిపోయి చిరాగ్గా కనిపిస్తున్నాయా ? ఎలాంటి చెప్పులు వేసుకున్నా.. మీ పాదాల మీ అందాన్ని దెబ్బతీస్తున్నాయా ? చలికాలంలో అందరినీ వేధించే సమస్యే ఇది. చర్మం పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం, పాదాలు పగలడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే.. పాదాల పగుళ్లకు చెక్ పెట్టడానికి కెమికల్ క్రీమ్స్ కంటే.. ఇంట్లోనే చక్కటి పరిష్కారాలు పాటించడం చాలా మంచిది.


పాదాలు పగుళ్లు కేవలం అందవిహీనంగా మాత్రమే కాదు.. అనారోగ్యానికి కూడా సంకేతం. మనం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం లేదని పాదాల పగుళ్లు చెబుతారు. అలాగే పాదాల సంరక్షణ కోసం సరిపడా సమయం కేటాయించడం లేదని సూచిస్తాయి. పాదాల పగుళ్లకు ఇవి మాత్రమే కాదు.. మరికొన్ని కారణాలున్నాయి. 

డ్రై స్కిన్, ఎక్కువగా నడవడం, చెప్పులు లేకుండా నడవడం, పరుగెట్టడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఒబేసిటీ, పరిశుభ్రత పాటించకపోవడం వంటివి కూడా పాదాల పగుళ్లకు కారణమవుతాయి. అయితే ఈ పగిలిన పాదాలను ఎక్కువకాలం పట్టించుకోకపోతే, త్వరగా నయం చేసుకోకపోతే.. సోరియాసిస్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతాయి. 

పగిలిన పాదాలను స్మూత్ గా, ఎట్రాక్టివ్ గా మార్చుకోవడానికి న్యాచురల్ రెమిడీస్ మీ ఇంట్లోనే ఉన్నాయి. తరచుగా ఉపయోగించే వస్తువులతోనే పాదాల పగుళ్లను నయం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..


కోకో బట్టర్ 

కోకోబటర్ డ్రైగా మారిన చర్మానికి చాలా ఎఫెక్టివ్ గా పోషణ అందిస్తుంది. పగిలిన పాదాలకు ఇది పట్టించి.. సాక్సులు వేసుకోవాలి. ఉదయం నిద్రలేచేపాటికి పగుళ్లు తగ్గిపోతాయి.


ఆముదం 

ఆముదంలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల డ్రైగా మారిన చర్మంలోపలి పొరల్లో కూడా పోషణ అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఆముదంను పాదాలకు రాసుకుంటే.. ఉదయానికి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది.


కొబ్బరి నూనె 

ఎలాంటి చర్మ సమస్యనైనా కొబ్బరి నూనె చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. పగిలిన పాదాలకు కూడా ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ. పగిలి, నొప్పి పుట్టించే పాదాలకు చాలా మందంగా కొబ్బరినూనె పట్టించి రాత్రంతా అలాగే వదిలేయాలి.


విటమిన్ ఈ 

ఆయిల్ విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సుల్స్ తీసుకుని.. అందులో ఆయిల్ తీసి.. పగిలిన పాదాలకు పట్టించాలి. విటమిన్ ఈ చర్మానికి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. డ్రైనెస్ ని తగ్గించడానికి సహాయపడుతుం


పెట్రోలియం జెల్లీ 

పగిలిన పాదాలు నివారించడానికి పెట్రోలియం జెల్లీ చాలా ఎఫెక్టివ్ రెమెడీ. పెట్రోలియం జెల్లీని పగిలిన పాదాలకు అప్లై చేసి.. రాత్రంతా అలాగే వదిలేయాలి.


ఆలివ్ ఆయిల్ 

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి ఉపశమనం కలిగిస్తుంది. పగుళ్లను చాలా తేలికగా, త్వరగా తగ్గిస్తుంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్