ఉత్తమ ఐ-షాడో పాల్లెట్స్



అందమే ఆనందం అన్నాడో కవి..తమ అందం మరింత ప్రస్పుటంగా కనిపించాలి అని అతివలు బాగా కోరుకుంటారు..ఇందులో భాగంగానే మేకప్ చేసుకుని మరింత అందంగా కనపడాలనుకుంటారు..మేకప్ చేసుకునేప్పుడు కళ్ళ షాడో మేకప్ ప్రధానమైన, ప్రత్యేకమైన పాత్రని పోషిస్తుంది. ఐ(కళ్ళ) షాడో పాలెట్ల కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మార్కెట్లో ఇవి ఎంతో ఖరీదైన రేట్లలో ఉన్నాయి. ఈ కొనుగోలు మీ బడ్జెట్టును బట్టీ ఉంటుంది. అయితే వాటిలో కొన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది మీరు ఎంపిక చేసుకునేందుకు అనువుగా, ఉపయుక్తంగా ఉండేలా తెలుగుటిప్స్ మీకోసం వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అవేంటో చూద్దామా..!

మేబెలైన్ డైమండ్ గ్లో క్వాడ్ ఐషాడో

ఇది చాలా సంపన్నమైన, మృదువైన ఐషాడో పాల్లెట్. దీనిలో 4 రంగుల ఐ షాడోలు ఉంటాయి. ఇవి చాల మృదువుగా, చాలా ప్రకాశవతంగా ఉండి మీ కళ్ళకే కాదు మీ ముఖానికి కూడా వెలుగునిస్తాయి. ఇవి మీ ముఖానికి స్మోకీ లుక్ ని అందించి ఎంతో అందంగా ఆకర్షనీయంగా కనపడేలా చేస్తాయి. ఈ షాడోలు మంచిగా మీ ముఖానికి ఇమిడిపోతాయి.

ఒరి ఫ్లేం ప్యూర్ కలర్ ఐషాడో పాల్లెట్. 4.8 గ్రా. న్యూడ్ అండ్ గ్రే

ఈ ఐషాడో పాల్లెట్ ఒరి ఫ్లేం నుంచీ వస్తోంది. దీనిలో 8 రకాల న్యూడ్, గ్రేయ్ ఐషాడొ రంగులు వస్తాయి. ఇవి అన్ని అకేషన్స్ లో ఉపయోగపడతాయి. అంతేకాక ఇవి ఎక్కువ సేపు అంటే రోజు అంతా వచ్చే విధంగా ఉంటాయి. ఇవి మీ మేకప్ కి మరింత అందానీస్తాయి. ఈ పాల్లెట్ లో స్లాంటెడ్ బ్రష్ అప్ప్లికేటర్ కూడా వస్తుంది. ఇది మచ్చలేని ఖచితత్వాన్ని ఇస్తుంది.

లాక్మె 9 టు 5 ఐ కలర్ క్వార్టెట్ ఐషాడో, డిసెర్ట్ రోస్

ఈ డిజర్ట్ ఐ షాడో లాక్మె హౌస్ నుంచీ ప్రత్యేకంగా వస్తోంది. దీనిలో 4 రకాల రేడియంట్ కలర్స్ మెరిసే తత్వాన్ని కలిగిఉంటాయి. ఈ పాల్లెట్లో ఉండే కలర్స్ మీ మేకప్ కు అనువుగా డార్క్ గా , అదేవిధంగా మీకు కావాలంటే లైట్గా వచ్చేలా, షేపింగ్ చేసుకునేలా ఉంటాయి. ఈ రంగుల్ని రోజూ చక్కగా వాడుకోవచ్చు. అంతేకాక పార్టీలకు బ్రైట్ గా కనిపించేందుకు కూడా వాడవచ్చు.

క్యామెలియొన్ ఐషాడో కిట్ ఫర్ ఉమెన్-ఇ36

ఇది ఓ సింగిల్ ఐ షాడో పాల్లెట్. ఇది మీకు అన్ని ఐషాడో రంగుల్ని ఇస్తుంది. దీనిని లైట్ నుంచీ డార్క్ వరకూ, స్కిన్ నుంచీ బ్రైట్ వరకూ అన్ని రకాల టోన్స్ ని మీరు పొందవచ్చు. ఇది ఒక ప్రొఫెషనల్ ఐషాడో మేకప్. ఇది క్యామెలియొన్ నుంచీ వస్తున్న ప్రాడక్టు. దీనిలో 36 రకాల ఐషాడో రంగులుంటాయి. ఇవి ఒక ఆక్ర్షనీయమైన లుక్ ని మీకు అందిస్తాయి. అంతేకాక ఎక్కువసేపు చెరిగిపోకుండా ఎంతో చక్కగా రోజంతా అలాగే ఉంటాయి.

మేబెల్లైన్ న్యూయార్క్ న్యూడ్స్, ద న్యూడ్స్ పాల్లెట్

ఈ ఐషాడో పాల్లెట్లో 11 రకాల రంగులు ఉంటాయి. అంతేకాక వీటితో పాటు బ్లాక్ షాడో కూడా హైలైట్ చేసుకునేందుకు వస్తుంది. దీనివల్ల స్మోకీ ఎఫ్ఫెక్ట్ వస్తుంది. దీనిలో ప్రతీ రంగు చాలా ఇంటెన్సివ్ గా ఉండి ప్రతి రోజు పార్టీ లుక్ ని మీకు ఇస్తాయి. ఈ పాల్లెట్లో రెండువైపులా ఉండే టూ సైడ్ అప్ప్లికేటర్ బ్రష్ వస్తుంది.

ఒరిఫ్లేం ప్యూర్ కలర్ ఐ షాడో పల్లెట్, మిడ్నైట్ అండ్ పింక్

మీకు ఈ ఐమేకప్ ను బాగా చేసుకునేవారైతే మీరు ఈ పింక్ షేడ్స్ ని మీ కళ్ళకు చక్కగా వేసుకోవచ్చు. ఈ బ్లూ ఐషాడో మేకప్ ని ప్రయత్నించండి. ఇది ఒక్క ఓరీఫ్లేం కల్లెక్షన్ తోనే సాధ్యం. ఇది డార్క్ మరియు పేస్టిల్ షాడ్స్ ని తీసుకు వచ్చి మీ ముఖానికి రాత్రిపూట కూడా మరింతా ఆకర్షణ పెంచుతుంది. ఈ రంగులకు చాలా ఇంటెన్సిటి ఉంది. ఇవి మీ కనురెప్పలవరకూ వ్యాప్తి చెంది చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. ఈ షాడోలను మీరు సులువుగా వేసుకునేదుకు మీకు ఒక అప్ప్లికేటర్ ఉంటుంది. దీనితో వేసుకుంటే మీ అందం మరింత ఇనుమడిస్తుంది.

ఒరిఫ్లేం బ్యూటి కలర్ ప్రో ఐషాడో ట్రియో, షీర్ పర్పుల్

ఇది 3 రంగులు ఉండే ఐషాడో పాల్లెట్. దీనిని మీతో ఎప్పుడూ తీసుకువెళ్ళవచ్చు. దీనిలో పర్పుల్ షేడ్స్ కూడి ఉంటాయి. అంతేకాక దీనిలో ఉన్న కాంపాక్ట్ డెజైన్స్ ఎక్కడైన వాడుకునేలా ఉంటాయి. ఈ షాడోలు చాలా మృదువుగా ఉంది మీరు చక్కగా వేసుకునేట్లు ఉంటాయి.

ఇ.ఎల్.ఎఫ్. 100 పీస్ మార్బుల్ ఐషాడో పాల్లెట్

ఇది ఒక ప్రొఫెషనల్ ఐషాడో కిట్. దీనిలో 100 రంగుల ఐషాడోలు ఉంటాయి. దీనిలో తెలుపు నుంచీ న్యూడ్ కలర్స్ నుంచీ లైట్ షేడ్స్ నుంచీ డార్క్ షేడ్స్ వరకూ అన్ని ఉంటాయి. మీరు కనక పూర్తి స్థాయిలో ఐ మేకప్ చేసుకోవాలంటే మీరు ఈ 100 పీస్ ఐషాడో పాల్లెట్ ని ఎంచుకోండి. మీకు చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది.

ఇ.ఎల్.ఎఫ్.ఐషాడో 32 పీస్ పల్లెట్ నేచురల్

ఈ ఐషాడో పాల్లెట్ లో 32 రకాల రంగులు ఉంటాయి. ఇవి అన్ని న్యూడ్, డార్క్ షేడ్స్ లో ఉంటాయి. ఒక రకంగా ఇది ప్రొఫెషనల్ మేకప్. ఈ కలర్స్ ని చక్కగా మీ ఐమేకప్ తగ్గట్టుగా కలుపుకుని వేసుకోవచ్చు. ఈ కలర్స్ ఎక్కువగా మన్నటమే కాక నిర్మాణాత్మకంగా ఉంటాయి. ఈ కలర్స్ చక్కగా మిశ్రమమవుతాయి. మీ కళ్ళకు కూడా హాని చేయబోవు.

బెబ్యూటిఫుల్ ఐషాడో 88 షేడ్స్ పాల్లెట్ మట్టె

88 లాంగ్ లాస్టింగ్ ఐషాడో కలర్స్ ఒకే పాల్లెట్ లో ఉంటాయి. దీనిలో ఉండే రంగులు మీ అకేషన్ కు తగ్గట్టుగా చక్కగా ఉపయోగపడతాయి. ఈ ప్రాడక్టు ప్రొఫెషనల్ బాగా ఉపయోగపడటమే కాక కొత్తవారికీ చక్కగా ఉపయోగపడతాయి.

కోస్టల్ సెంట్స్ రివీల్డ్ ఐ-షాడో పాల్లెట్

ఈ పాల్లెట్ 20 న్యూడ్ మరియు మెటాలిక్ షేడ్స్ లతో వస్తాయి. ప్రతీ అకేషన్లో మీకో కొత్తదనపు రూపు రెఖల్ని వచ్చేలా చేయటమే వీటి ప్రత్యేకత. ఇవి చక్కని మృదుత్వాన్ని కలిగి ఉండటమే కాక చక్కని పవ్డర్ రూపంలో ఉండి మిశ్రమంగా మారే తత్వాన్ని కలిగి ఉంటాయి. ఇది పగలు రాత్రి మంచి లుక్ వచ్చేలా చేస్తాయి. ఇది చక్కని సగసైన డిజైన్ తో రావటం వల్ల మీరు దీనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు.

180 కలర్ త్రీ-లేయర్ ఐషాడో పాల్లెట్ మేకప్ ఐ-షాడో సెట్

ఈ పాల్లెట్ మీకు మంచీ ఆకర్షణీయమైన లుక్ ను తెస్తుంది. ఇది 180 కలర్స్ ను కలిగి ఉండి చక్కటి సొగసైన డిజైన్ కలిగి ఉండటం వల్ల మీరు దీనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. ఈ మేకప్ కిట్ ఏ అకేషన్లో నైన తీసుకువెళ్ళవచ్చు. అంతేకాక ఇది ప్రొఫెషనల్ మేకప్. ఈ రంగుల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇవి సిల్కీగా ఉండటం వల్ల చక్కగా మీ కళ్ళకు ఇమిడిపోయి రోజంతా నిలిచి ఉంటాయి.

కోస్టల్ సెంట్స్ 252 అల్టిమేట్ ఐషాడో పాల్లెట్

ఇది పవ్డర్ షాడో కలర్స్ కలిగిన 3 ట్రే లతో కూడిన కిట్. దీనిలో 252 ఐషాడో కలర్స్ ఉండి మీకు ఆశ్చర్యాన్ని కలిగించేలా మీకు అన్ని విధాలా సంతృప్తి ఇచ్చేలా ఉంటాయి. ఈ రంగులు హై పిగ్మెంటేషన్ ను కలిగి ఉండటమే కాక సులువుగా మిక్స్ అయ్యేలా ఉంటాయి. ఈ రంగులు పొడి రూపంగా అలాగే తేమ రూపంలో ఉంటాయి. ఈ కేస్ చక్కగా తీసుకువెళ్ళే విధంగా ఉంటుంది.

ఇ.ఎల్.ఎఫ్ 36 పీస్ వొల్1 జిఒ ఐషాడో పాల్లెట్

ఈ 36 పీస్ ఐషాడో బూక్ ప్రతీ ఔత్సాహిక మేకప్ వారికీ అవసరం. దీనిలో ఉండే జియో మెట్రిక్ పాట్రెన్ లుక్ మిగతా వాటికి భిన్నంగా కనిపిస్తుంది. ఈ షాడోస్ చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. దీనిలో ఐ షాడో అప్ప్లికేటర్ కూడా వస్తుంది.

ఒరిఫ్లేం ప్యూర్ కల్ర్ ఐ షాడో పాల్లెట్ 4.8 గ్రా- సాండ్ అండ్ గ్రీన్

ఈ పాల్లెట్ 8 రంగుల సాండ్ అండ్ గ్రీన్ ఐ షాడో లతో వస్తుంది. ఈ షాడో లను మీరు మీకు తగ్గట్టుగా ఉపయోగించవచ్చు. ఈ షాడో ఒక ప్రత్యేకమైన లుక్ ను తీసుకువచ్చి 24 గంటల పాటు నిలిచేలా చేస్తాయి.

ఎం యు ఏ ఐషాడో పాల్లెట్ డస్క్ టిల్ డాన్

ఈ ఐషాడో సెట్ లో 12 రకాల షిమ్మెరీ షేడ్స్. ఈ పాల్లెట్స్ చాలా శక్తివంతమైన, లోతైన షేడ్స్ మీ ఇష్టమైన విధంగా విభిన్న రకాలుగా మేకప్ చేసుకునేలా ఉంటాయి. ఈ షేడ్స్ చాలా వర్ణకమైనవి అంతేకాక జంతువులపై కూడా ప్రయోగించనివి.

ఇ.ఎల్.ఎఫ్. బేకెడ్ ఐషాడో పాల్లెట్ నిక్

ఈ పాల్లెట్ ఇ.ఎల్.ఎఫ్ నుంచీ వెలువడుతోంది . దీనిలో 10 రంగులతో కూడి తెలుపు, గులాబీ, గోధుమ, వెండి, చాక్లెట్, నీలి, బూడిద, నలుపు రంగులు ఉంటాయి. దీనిలో ఉండే న్యూడ్ కలర్స్ మీకు పగలు, రాత్రీ చక్కగా నిలిచి ఉంటాయి. వీటిలో ఉన్న మృదుత్వైన తత్వం చక్కగా మీ మేకప్ నిలిచేలా చేస్తాయి. ఇవి చక్కగా మిశ్రమం గా మారతాయి. వీటిలో ఉన్న షిమ్మరింగ్ కలర్స్ ఎక్కువసేపు ఉండేలా చేస్తాయి.

షని ఐషాడో పాల్లెట్,బోల్డ్ అండ్ బ్రైట్ కల్లెక్షన్,వివిడ్,120 కలర్

ఈ పాల్లెట్ రెండు లేయెర్లతో 120 రంగులతో వస్తుంది. ఇవి మీ కనురెప్పలపై చక్కగా నిలిచి ఉంటాయి. ఈ రంగుల షాడో లను పరీక్షించటం జరిగింది. అంతేకాక వీటిలో శుధ్ధీకరించినా ఆయిల్ వేయటం వల్ల చక్కగా మీ కళ్ళని కాపాడతాయి.

క్యామెలియోన్ గోల్డ్ & గోల్డ్ 98 ఐషాడో పాల్లెట్

దీనిలో 98 రంగులతో కూడిన ఐషాడోలుంటాయి. ఇవి చాలాసేపు నిలిచి ఉండటమేకాక లైట్, డార్క్ షేడ్ లలో ఉంటాయి. ఈ షేడ్స్ విభిన్నమైన టెక్చర్స్ లొ ఉంటాయి. ఈ కలర్స్ అన్ని కూడా హై పిగ్మెంటెడ్ ఇందులో రెండువైపులా గల అప్ప్లికేటర్స్ ఉంటాయి.

ద బాల్మ్ న్యూడ్ ట్యూడ్ ఐషాడో పాల్లెట్

ఈ పాల్లెట్ లో 12 రకాల న్యూడ్ కలర్ షేడ్స్ ఉంటాయి. ఇవి చాల మృదువైన శాటిని ఫినిషింగ్ ను కలిగి ఉంటాయి. ఇలా ఉండటం వల్ల మీరు అనుకున్న రూపును మీరు పొందవచ్చు. దీనిలో ఉన్న విభిన్నమైన రంగులు మీకు కావల్సిన విధంగా అమరుతాయి.

ఎన్ వై ఎక్ష్ కాస్మెటిక్స్ లవ్ ఇన్ ఫ్లోరెన్స్ ఐషాడో పాల్లెట్ బెల్లిని కిస్

ఈ పాల్లెట్ 5 రకాల రంగులు కలిగి ఉంటుంది. కాంస్య రంగు, బంగారం, గోధుమ మరియు న్యూడ్ కలర్లతో కలిగి ఉండి మీకు సరియైన రూపు వచ్చేలా చేస్తాయి. ఈ పాల్లెట్ చక్కటి ఆకృతిని కలిగి మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళేలా ఉంటుంది. దీనిలొ రెండు రకాల అప్ప్లికేటర్లు ఉంటాయి.

ఎస్టీ లండర్ 8 షేడ్స్ ప్యూర్ కలర్ మిర్రర్డ్ ఐషాడో పాల్లెట్స్

ఈ బ్రాండ్ ఎస్టీ లండర్ నుంచి వెలువడిన ప్రాడక్టు. దీనిలో 8 రకాల షేడ్స్ అదీకాక పూర్తిగా షాడో కలర్స్ ఉంటాయి. దీనిలో ఎక్కువగా ఉన్న కలర్ రేంజ్ వల్ల మీకు డార్క్ అలాగే లైట్ షేడ్స్ వచ్చి మీ మేకప్ ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

ఎన్ వై ఎక్స్ కాస్మెటిక్స్ లవ్ ఇన్ ఫ్లారెన్స్ ఐషాడో పాల్లెట్ ఎక్సొ ఎక్సొ మోనా

మీరు కనక గులాబీ, ఊదా(పర్పుల్) కలర్ ను కనక ఎక్కువగా వాడేవారైతే ఈ పాల్లెట్ ను వాడండి . ఇది సరైనది. ఈ పాల్లెట్ లో 5 రకాల లైట్, డీప్ షేడ్స్ ఉండి మీకు చక్కని మేకప్ వచ్చేలా చేస్తాయి. దీనిలో ఉండే షేడ్స్ వర్ణకమైనవి కావటం వల్ల చక్కటి మెత్తటి టెక్చర్ ను కలిగి ఉంటాయి.

ఫాష్ 56 కలర్ ఐషాడో పాల్లెట్

ఈ 56 రంగుల షేడ్స్ ఉన్న పాల్లెట్ షిమ్మరీ కలిగి ఉండి కనురెప్పలకు సైతం చక్కగా ఒదిగిపోయి ఎక్కువ గంటలు ఉండేలా చెస్తాయి. ఈ ప్రాడక్టును సహజసిధ్ధమైన ఆయిల్ తో చేయటం వల్ల హాని తలపెట్టదు. ఈ షేడ్స్ పెళ్ళిళ్ళకైనా లేదా మరో అకేషన్లోనైనా చక్కగా నప్పుతుంది.

ఫ్రోలా కాస్మెటిక్స్ ప్రొఫెషనల్ 120 వార్మ్ కలర్స్ ఐషాడో మేకప్ పాల్లెట్ 04

మీరు కనుక చక్కటి ఎక్కువ స్థాయి లో ఐషాడో మేకప్ ను ఆశిస్తే ఈ పాల్లెట్ మీకు సరియైనది. ఈ పాల్లెట్ లో 120 వార్మ్ కలర్స్ ఉంటాయి. దీనిలో మేటీ మరియు షిమ్మరీ రంగుల షేడ్స్ మీకు మేకప్ కి అవసరమైన విధంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

టూ ఫేస్డ్ ప్రెటీ రెబెల్ ఐషాడో పాల్లెట్

ఈ పాల్లెట్ లో చాలా రకాల షేడ్స్ అంటే 10 రంగులలో దొరుకుతుంది. అయితే మీకు కావాల్సి విధంగా లైట్ మరియు డార్క్ కలర్స్ లో మీరు మేకప్ చేసుకోవచ్చు.

సెఫోరా కలెక్షన్ ఐ టి ఐషాడో పాల్లెట్-గ్లిట్టర్

ఈ గ్లిట్టర్ ఐషాడో కలెక్షన్ సఫోరా కంపనీ నుంచీ వెలువడుతోంది. ఇది ద్రమాటిక్ మేకప్ కి చాలా చక్కగా నప్పుతుంది. దీనిలో 12 రకాల పైస్థాయి పిగ్మెంటెడ్ షేడ్స్ వస్తాయి. తెలుపు, న్యూడ్, వెండి, బంగారం, మరియు పింక్ నుంచీ నలుపు,పర్పుల్, ఆకుపచ్చ, నీలి రంగులుంటాయి. అంతేకాక దీనితో పాటు ఒక అప్ప్లికేటర్, సెఫోర పెన్సిల్ లైనర్ వస్తాయి.

క్రిస్టియన్ డియొర్ 5 కౌలౌర్స్ కోచర్ కలర్స్ $ ఎఫ్ఫెక్ట్స్ ఐ షాడో పాల్లెట్- నెం.456 జార్డిన్

ఈ పాల్లెట్ లో 5 రకాల ఎలిగెంట్ కలర్స్ ఉంటాయి. వీటి వల్ల మీకు ఒక కొత్త రూపు వస్తుంది. వీటి టెక్స్చర్స్ శాటిని, మేటీ, అల్ట్రా స్లిమ్మరీ బట్టి మారుతుంటాయి.

బూట్స్ నెం-7 స్టే పెర్ఫెక్ట్ ఐషాడో పాల్లెట్ రైన్ ఫోరెస్ట్

ఈ పాల్లెట్ బూట్స్ కంపనీ ప్రాడక్టు. అంతేకాక నాన్యతలో దిట్ట. ఈ పాల్లెట్లో 3 రకాల షేడ్స్ ఉంటాయి. అంతేకాక వీటితో పాటుగా రైన్ ఫారెస్ట్, ఆకుపచ్చ, చోకోలెట్ షేడ్స్ అలాగే ముదురు పింక్ షేడ్స్ ఉంటాయి. ఈ షేడ్స్ చాలా మృదువుగా, మిశ్రమం అయ్యేలా అలాగే హైపోఅల్లెర్జిటిక్ గా ఉంటాయి.

ఎస్టీ లాండర్ ప్యూర్ కలర్ ఫైవ్ కలర్ ఐషాడో పాల్లెట్ టోపాజ్ మొసాయిక్

ఈ ఎస్టీ లాండర్ పాల్లెట్ లో 5 న్యూడ్ షేడ్స్ మ్యాటీ ఫినిషింగ్ కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ మేకప్ ను పగటిపూట, సహజసిధ్ధంగా వాడతారు.

గ్యుర్లైన్ ఎక్రిన్ 6 కౌల్యుర్స్ ఐషాడో పాల్లెట్- 66 బౌలెవర్డ్ డూ మోంట్పర్నస్సె

ఈ పాల్లెట్ 6 షేడ్స్ ను కలిగి ఉంటుంది. వీటి సహాయం తో ఏ రకమైన రూపునైనా తీసుకురావచ్చు. ఈ షాడోస్ వెల్వెట్ టెక్చర్ ని కలిగి ఉంటాయి. వీటికి ఎక్కువ సేపు నిలిచే శక్తి ఉంది.

Comments

Popular posts from this blog

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

స్త్రీలలో జుట్టు రాలటాన్ని తగ్గించే విటమిన్లు

ఆరెంజ్ ఫేస్ ప్యాక్స్