Posts

Showing posts from September, 2016

7 డేస్ లో గార్జియస్ స్కిన్ కోసం ఫ్యాబులస్ కోకొనట్ ఆయిల్ ఫేస్ మాస్కులు..!!

Image
అద్దం ముందు నిలబడి, క్లోజ్ గా గమనించినప్పుడు, మీ ముఖంలో ఏమి గమనిస్తారు ? చర్మంలో మొటిమలు, మచ్చలు, బ్లాక్ స్పాట్స్ చాలా అసహ్యంగా కనిపిస్తున్నాయా..?కొన్ని కారణాలు వల్ల, ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ వల్ల చర్మంలో మొటిమలకు కారణమవుతుంది. లేదా స్కిన్ లో డల్ నెస్ పెరుగుతుంది. వయస్సు రిత్యా కావచ్చు, లేదా వేరే ఇతర కారణాలు కావచ్చు ముఖంలో మొటిమలు మర్చలు ఏర్పడుతుంటాయి. అయితే ముఖం స్పాట్ లెస్ గా..ఒక క్లియర్ స్కిన్ చూడాలంటే అందుకు కొబ్బరి నూనెతో తయారుచేసే ఫేస్ మాస్క్ లు ఉన్నాయి. కొబ్బరి నూనె కేవలం జుట్టుకు మాత్రమే కాదు, ఇది స్కిన్ కు కూడా చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఇది స్కిన్ క్యూటికల్స్ ను సీల్ చేస్తుంది. చర్మంలోని మలినాలు లేకుండా శుశ్రం చేస్తుంది. చార్మానికి కాంతిని, మంచి గ్లోను అందిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ చర్మంలోనికి షోషింపబడి, చర్మంలోని మలినాలను పూర్తిగా తొలగిస్తుంది. డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ ను రిపేర్ చేస్తుంది. చర్మంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అంతే కాదు, కొబ్బరి నూనెలో ఎక్కువగా యాంటీ ఆక్సిడె...

అన్నం గంజిలో దాగున్న అమేజింగ్ బ్యూటి సీక్రెట్స్..!!

Image
ఒకప్పుడు.. మన అమ్మవాళ్లు ఇంట్లో అన్నం వండిన తర్వాత.. ఆ నీటిని అలానే పక్కనపెట్టేవాళ్లు. దాన్ని అన్నం గంజి అని పిలిచే వాళ్లు. ఇప్పుడు రైస్ వాటర్ అని పిలుస్తారు. ఇది బంకగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎవరికీ నచ్చదు. కానీ.. ఈ అన్నం గంజిని.. రకరకాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించుకునేవాళ్లు. కానీ రోజులు గడిచిన తర్వాత.. మనం అన్నం వండిన నీటిని పడేస్తున్నాం. లేదా రైస్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్ వంటి వంటసామాన్లు వచ్చిన తర్వాత.. చాలామంది వీటిల్లో అన్నం చేయడం వల్ల గంజి ఇమిరిపోతుంది. వాటిని వంపడం లేదు. కానీ అన్నం వంపిన నీటిలో బ్యూటి బెన్ఫిట్స్ అమోఘంగా ఉంటాయి. ఈ గంజిలో అల్లాంటన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను నివారిస్తాయి. అలాగే ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల..రంధ్రాలను క్లెన్స్ చేసి.. చర్మాన్ని బిగుతుగా మార్చి, కాంప్లెక్షన్ ని పెంచుతుంది. టోనర్ అన్నం గంజి.. చర్మ రంధ్రాలను క్లోజ్ చేసి.. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. తాజాగా తీసిన అన్నం గంజిలో కాటన్ ముంచి.. ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత.. టైట్ అనిపించినప్పుడు.. దాన్ని పీల్ ఆఫ్ చేసి.. చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. క్లెన్సర్ అన్...

దానిమ్మ తొక్కలో దాగున్న అమోఘమైన సౌందర్య రహస్యాలు..!

Image
ఎంతో ఆకర్షణీయంగా, తినాలనిపించేలా ఉండే దానిమ్మ విత్తనాలు ఆరోగ్యానికి చాలామంచిదని అందరికీ తెలుసు. అయితే.. ఈ విత్తనాలనే కాదు.. దాని తొక్కను కూడా ఉపయోగించవచ్చు. విత్తనాలు తీసుకుని.. తొక్కను పడేస్తుంటాం. కానీ.. దానిమ్మ తొక్క.. మీకు చాలా అమోఘమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని బ్యూటి సీక్రెట్స్ తెలిస్తే.. ఇకపై దానిమ్మ తొక్కను ఎట్టిపరిస్థితుల్లో పడేయరు. న్యాచురల్ సన్ స్క్రీన్ ఎండలో దానిమ్మ తొక్కను ఎండబెట్టాలి. తర్వాత పొడిచేసి.. డబ్బాలో పెట్టుకోవాలి. ఈ పొడిని క్రీమ్ లేదా లోషన్ లో కలుపుకోవాలి. ఒకవేళ న్యాచురల్ సన్ స్క్రీన్ కావాలంటే.. ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి రాసుకోవచ్చు. బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు ఇది అప్లై చేయాలి. మొటిమలకు దానిమ్మ తొక్కలు ఎండలో ఎండబెట్టి... కొన్నింటినీ.. ప్యాన్ పై వేడి చేయాలి. చల్లారిన తర్వాత.. గ్రైండ్ చేయాలి. నిమ్మరసం లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ కి అప్లై చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముడతలు తగ్గడానికి ఎండలో ఆరబెట్టిన దానిమ్మ తొక్క పొడి 2స్పూన్లును రోజ్ వాటర్ లేదా పాలలో కలిపి పేస్ట్ చ...
Image
బోల్డ్ స్కై » తెలుగు » సౌందర్యం » కేశ సంరక్షణ మీ జుట్టు రెండింతలు పొడవుగా, స్టాంగ్ గా పెరగడానికి ఆయుర్వేదిక్ హెర్బ్స్ ..! ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే కొన్ని ఆయుర్వేదిక్ హెర్బ్స్ జుట్టును రెండింతలు పొడవుగా...స్ట్రాంగ్ గా పెరిగేందుకు సహాయపడుతాయన్న విషయం మీకు తెలుసా? అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ జుట్టును ఆరోగ్యాంగా పొడవు పెరిగేలా హెర్బ్స్ ఉపయోగపడుతాయంటే ఆశ్చర్యం కలగాల్సిందే ! తలలో దాదాపు 3,000,000 వెంట్రుకలుంటాయి, వీటిలో ప్రతి ఒక్క వెంట్రుక పెరగడానికి కృషి చేస్తుంది. వెంట్రుకలు ఎప్పుడైతే విశ్రాంతి స్థితిలో ఉంటాయో, అప్పుడు జుట్టు వదులవ్వడం, అలాగే జుట్టు రాలడం జరుగుతుంది. జుట్టు రెస్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాదాపు 40 to 80 వెంట్రుకలను కోల్పోతాము. ఇలా కోల్పోవడం నార్మల్ స్టేజ్ అని చెప్పవచ్చు, అయితే ఈ నెంబర్ దాటితే అది సీరియస్ గా పరిగణించాలి. ఇటువంటి హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి జుట్టు పెరిగే క్రమాన్ని క్రమబద్దీకరించలేవు కానీ, హెయిర్ ఫాలిసెల్స్ కు కావల్సినంత బలాన్ని చేకూర్చి, హెయిర్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా సహాయపడుతాయి ...

వీపు మీద మొటిమలను నివారించే లెమన్ షుగర్ బాడీ స్ర్కబ్

Image
చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. మొటిమలనగానే ముఖంలో బాధించే మొటిమలనుకుంటాము. వీటిని తొలగించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ముఖంలో వచ్చే మొటిమలను తొలగించుకోవడానికి చాలా హోం రెమెడీస్, ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి. ముఖంలో కాకుండా బాడీ మీద, బ్యాక్ లో వచ్చే మొటిమలు కూడా చాలా బాధిస్తుంటాయి. బ్యాక్ పోర్షన్ లో వచ్చే మొటిమలను నివారించడానికి కొన్నిఇంట్లో తయారుచేసుకునే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి . ముఖ చర్మంలో మాత్రమే కాదు, బ్యాక్ పోర్షన్ లో కూడా ఎక్కువగా సెబమ్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రదేశంలో ముఖంలో కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్సెస్ గా సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు , చర్మ రంద్రాలు పెద్దగా తెరచుకోవడం వంటి సమస్యలు ఎదుర్కుంటారు. బ్యాక్ ఏన్స్ ను స్నానం చేసేప్పుడు, తొలగించుకోవడానికి కూడా సాధ్యం కాదు. వాస్తవానికి, బ్యాక్ ఏన్స్ నివారించుకోవడానికి ఇంట్లో ఉండే హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతుంది. మొటిమలను నివారించుకోవడానికి కెమికల్స్ తో తయారుచేసిన క్రీమ్స్ , స్ర్కబ్బింగ్స్ ఉపయోగించకూడదు. కాబట్టి, ఇంట్లో స్వయంగా తయారుచేసుకొనే స్క్రబ్ తో బ్యాక్ ఏన్స్ ను తొలగించుకోవచ్చు . ఈ స్ర్కబ్బింగ్స్...

చుండ్రు నివారణకు ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే హోం రెమెడీస్..!

Image
జుట్టు సమస్యల్లో విసుగుపుట్టించేంది చుండ్రు. ఈ సమస్యను త్వరగా నివారించుకోకపోతే, సమస్య మరింత తీవ్రమవుతుంది. చుండ్రు నివారణకోసం ఉపయోగించే యాంటీ డ్యాండ్రఫ్ షాంపులు మనం ఊహించినంత ఫలితాలనివ్వవు. తాత్కలికంగా ఉపశమనం కలిగించినా, ఒకటి, రెండు రోజులకు తిరిగి అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి, చుండ్రును నేచురల్ గా తొలగించుకోవడాని కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. చుండ్రును పర్మనెంట్ గా తొలగిస్తాయి ! తలలో చుండ్రు ఏర్పడటానికి ముఖ్య కారణం: తల డ్రైగా ఉండటం, జుట్టు ఎక్కువగా పొడిబారడం వల్ల తలలో దురద ఎక్కువగా ఉంటుంది. దురద వల్ల తలను గోకినప్పుడు, తలలో నుండి పొట్టు వంటిది భుజాల మీద, దుస్తుల మీద రాలడం గమనిస్తుంటారు. కాబట్టి, ఎక్సఫ్లోయేషన్ చాలా వసరం. ఎక్స్ ఫ్లోయేషన్ అంటే చాలా మంది అది స్కిన్ సంబంధించినది, ఇది స్కిన్ వరకే పరిమితం అనుకుంటారు ? ముఖంలో డెడ్ స్కిన్ సెల్స్ పెరిగినప్పుడు, ముఖం డల్ గా కనబడుతుందని భావిస్తారు. అదే విధంగా తలలో కూడా అటువంటి డెడ్ స్కిన్ ఉండటం వల్ల, తలలో చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రుతో పాటు దురద పెరుగుతుంది.ఈ సమస్యను వెంటనే నివారించుకోకపోతే, జుట్టు రాలే సమస్యలు అధికమ...