దానిమ్మ తొక్కలో దాగున్న అమోఘమైన సౌందర్య రహస్యాలు..!
ఎంతో ఆకర్షణీయంగా, తినాలనిపించేలా ఉండే దానిమ్మ విత్తనాలు ఆరోగ్యానికి చాలామంచిదని అందరికీ తెలుసు. అయితే.. ఈ విత్తనాలనే కాదు.. దాని తొక్కను కూడా ఉపయోగించవచ్చు. విత్తనాలు తీసుకుని.. తొక్కను పడేస్తుంటాం.
కానీ.. దానిమ్మ తొక్క.. మీకు చాలా అమోఘమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని బ్యూటి సీక్రెట్స్ తెలిస్తే.. ఇకపై దానిమ్మ తొక్కను ఎట్టిపరిస్థితుల్లో పడేయరు.
న్యాచురల్ సన్ స్క్రీన్
ఎండలో దానిమ్మ తొక్కను ఎండబెట్టాలి. తర్వాత పొడిచేసి.. డబ్బాలో పెట్టుకోవాలి. ఈ పొడిని క్రీమ్ లేదా లోషన్ లో కలుపుకోవాలి. ఒకవేళ న్యాచురల్ సన్ స్క్రీన్ కావాలంటే.. ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి రాసుకోవచ్చు. బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు ఇది అప్లై చేయాలి.
మొటిమలకు
దానిమ్మ తొక్కలు ఎండలో ఎండబెట్టి... కొన్నింటినీ.. ప్యాన్ పై వేడి చేయాలి. చల్లారిన తర్వాత.. గ్రైండ్ చేయాలి. నిమ్మరసం లేదా రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ కి అప్లై చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ముడతలు తగ్గడానికి
ఎండలో ఆరబెట్టిన దానిమ్మ తొక్క పొడి 2స్పూన్లును రోజ్ వాటర్ లేదా పాలలో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు చేస్తే.. ముడతలు తగ్గిపోతాయి.
హెయిర్ లాస్, చుండ్రు
ఏదో ఒక హెయిర్ ఆయిల్ ని దానిమ్మ తొక్కపొడిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి. 2గంటల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ టైంలేకపోతే.. రాత్రినిద్రకు ముందు అప్లై చేసి ఉదయం శుభ్రం చేసుకోవచ్చు.
ఎండలో ఆరబెట్టిన దానిమ్మ తొక్క పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. టైట్ గా ఉండే కంటెయినర్ లో వేయాలి. 2స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment