సర్ ప్రైజ్ : బియ్యం పిండితో చర్మం తెల్లగా..కాంతివంతంగా..!!
మగువలు అందాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం, బ్యూటీ పార్లర్స్ కు వెళ్లడం, హోం రెమెడీస్ ఉపయోగించడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పద్దతులను ఫాలో అవుతుంటారు.అయితే అన్నింటిలో కంటే మనం ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే హోం రెమెడీస్ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి. అటువంటి హోం రెమెడీస్ లో బియ్యం పిండి ఒకటి. ఇందులో విటమిన్స్ మరియు మనిరల్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇటువంటి విలువైన పదార్థాన్ని ఫేస్ మాస్క్ గా ఎందుకు ఉపయోగించుకోకూడదు?
ఆశ్చర్యం కలిగించే విషయమేటింటే బియ్యం పిండి సౌందర్యం పెంచుకోవడంలో ఒక బాగంగా ఉపయోగిస్తారన్న విషయం చాలా మందికి తెలియదు. బియ్యం పిండి చర్మ సౌందర్యం మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగించినప్పుడు, ఇది స్కిన్ టాన్ ను తొలగిస్తుంది, స్కిన్ పిగ్మెంటేషన్ తొలగిస్తుంది. చర్మంను బ్రైట్ గా మార్చుతుంది.
ఆశ్చర్యం కలిగించే విషయమేటింటే బియ్యం పిండి సౌందర్యం పెంచుకోవడంలో ఒక బాగంగా ఉపయోగిస్తారన్న విషయం చాలా మందికి తెలియదు. బియ్యం పిండి చర్మ సౌందర్యం మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగించినప్పుడు, ఇది స్కిన్ టాన్ ను తొలగిస్తుంది, స్కిన్ పిగ్మెంటేషన్ తొలగిస్తుంది. చర్మంను బ్రైట్ గా మార్చుతుంది.
బియ్యం పిండిలో ఉండే ఫిరిలిక్ యాసిడ్ నేచురల్ సన్ స్క్రీన్ గా, ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే చర్మాన్ని హానికర ప్రభావాల నుండి రక్షిస్తుంది. అలాగే బియ్యం పిండిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, చర్మంలో మలినాలను తొలగించి, చర్మ రంద్రాలు ష్రింక్ అయ్యేందుకు సహాయపడుతుంది. బియ్యం పిండిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ రీజనరేట్ చేస్తుంది, చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. చర్మం తేమగా మరియు రేడియంట్ గా ఉండేందుకు సహాయపడుతుంది.
ఇన్ని ప్రయోజనాలున్న బియ్యం పిండిని చర్మసౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిందే....దీన్ని రెగ్యులర్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఒకటిగా చేర్చుకుని ఉపయోగించడం వల్ల చర్మం రేడియంట్ గా మారుతుంది.
1. ఇన్ స్టాంట్ గా రేడింట్ స్కిన్ పొందడానికి :
తక్షణం చర్మంలో మంచి కాంతిని తీసుకు రావాడానికి, చర్మం రంగును తెల్లగా మార్చడానికి వేసుకోవల్సిన ఫేస్ ప్యాక్ ఇది
పదార్థాలు:
పెరుగు: 1 tablespoon
బాదం ఆయిల్ :1 teaspoon
ఆరెంజ్ పీల్ పౌడర్ : 1 teaspoon
ఎలా పనిచేస్తుంది
* ముందుగా ఆరెంజ్ తొక్కను మెత్తగా పౌడర్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా బాదం ఆయిల్ మరియు పెరుగు మిక్స్ చేయాలి. స్మూత్ గా పేస్ట్ అయ్యే వరకూ చేయాలి. తర్వాత ముఖం శుభ్రంగా కడిగి, తేమలేకుండా తుడిచి, ఈ పేస్ ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత ముఖం శుభ్రం కడిగేసుకోవాలి.
2. స్కిన్ టానింగ్ నివారించడానికి రైస్ పౌడర్ మాస్క్
స్కిన్ టాన్ నివారించడానికి గ్రేట్ ఐడియా బియ్యం పిండి మాస్క్. అంతే కాదు, ఇది డీప్ గా చర్మంలోని చొచ్చుకుపోయి, చర్మాన్ని శుభ్రం చేసి, అవాంఛిత మలినాలను ఇతర టాక్సిన్స్ ను తొలగిస్తుంది.
కావల్సినవి
బియ్యం పిండి : 1 teaspoon
తేనె : 1 teaspoon
పసుపు : చిటికెడు
ఎలా పనిచేస్తుంది :
* పైన సూచించిన పదార్థాలన్నింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. స్కిన్ స్ట్రెచ్ గా అనిపిస్తుంటే, వాటర్ చిలకరించి, మర్ధన చేస్తూ ముఖాన్ని నీటితో శుభ్రం కడిగి, తేమ పూర్తిగా తుడిచి, మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
3. స్కిన్ వైటనింగ్ కోసం రైస్ పౌడర్ ఫేస్ మాస్క్ :
ఈ ఫేస్ మాస్క్ లో ఎసెన్సియల్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బ్లాక్ స్పాట్స్ ను తొలగిస్తుంది, స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.
కావల్సిన పదార్థాలు:
అలోవెర జెల్ : 1 tablespoon
బియ్యం పిండి : ½ a teaspoon
టమోటో గుజ్జు: 1 teaspoon
ఎలా పనిచేస్తుంది :
* పైన సూచించిన పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత క్లీన్ గా శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది. తర్వాత ఐస్ ముక్కలతో మర్ధన చేయాలి.
4. ఆయిల్ కంట్రోలింగ్ మాస్క్
ఈ పేస్ మాస్క్ వల్ల చర్మంలో జిడ్డు తగ్గుతుంది, చర్మం స్మూత్ గా ...క్లియర్ గా కనబడుతుంది.
కావల్సినవి
రోజ్ వాటర్ : 1 tablespoon
బియ్యం పిండి : 1 teaspoon
టీ ట్రీ ఆయిల్ : 10 drops
ఎలా పనిచేస్తుంది:
* పైన సూచించిన పదార్థాలను ఒక బౌల్లో తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంలో ఎక్సెస్ ఆయిల్ను తగ్గిస్తుంది. ఈ హోం మేడ్ రైస్ పౌడర్ మాస్క్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
5. డ్రై స్కిన్ మాస్క్
ఈ ఫేస్ మాస్క్ డ్రై స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపరుస్తుంది.
కావల్సినవి
మిల్క్ క్రీమ్: 1 teaspoon
బియ్యం పిండి: 1 teaspoon
గ్లిజరిన్ : 1 teaspoon
ఎలా పనిచేస్తుంది:
* ఒక బౌల్ తీసుకుని, అందులో పై పదార్థాలన్నింటిని వేసి మిక్స్ చేయాలి. పేస్ట్ లా తయారయ్యాక , ఈ పేస్ట్ ను ముఖం , మెడకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
6. మొటిమలను నివారించే ఫేస్ ప్యాక్ :
ఈ మాస్క్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మొటిమలను నివారిస్తుంది, చర్మంలో మార్క్స్ ను తగ్గిస్తుంది. స్కిన్ డ్రైగా మారదు. .
కావల్సినవి:
బియ్యం పిండి: 1 tablespoon
కొబ్బరి నూనె: 10 drops
పుదీనా ఆయిల్ : 10 drops
నిమ్మరసం : 1 tablespoon
ఎలా పనిచేస్తుంది:
* ఈ పదార్థాలన్నింటిని మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. స్కిన్ స్ట్రెచ్ అవుతున్నట్లు అనిపించినప్పుడు, ముఖానికి కొద్దిగా నీళ్ళు చిలకరించి, స్ర్కబ్ చేస్తూ వాష్ చేయాలి. ఈ చిట్కాను వారంలో ఒకటి రెండు సార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.
7 యాంటీ ఏజింగ్ మాస్క్ :
ఈ పేస్ మాస్క్ చర్మంలో సన్నని చారలు, స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది. స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది
కావల్సినవి:
ఎగ్ వైట్ :1
య్యం పిండి: 1 teaspoon
బాదం ఆయిల్ : 10 drops
ఎలా పనిచేస్తుంది
* గుడ్డులోని పచ్చనను ఒక బౌల్లో తీసుకుని, అందులో బియ్యం పిండి, బాదం ఆయిల్ మిక్స్ చేసి, పేస్ట్ గా అయిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
Comments
Post a Comment